– హమాస్ తీవ్రవాదుల దాడిని ఎందుకు పసిగట్టలేకపోయింది.?
ప్రపంచంలోనే అతి గొప్ప గూఢచారి ఐన ఇజ్రాయెల్ కు ఏమైంది , హమాస్ తీవ్రవాదుల దాడిని ఎందుకు పసిగట్టలేకపోయింది.?
ఇజ్రాయెల్ దెబ్బతినింది , ప్రపంచ ప్రఖ్యాతమైన తన గూఢాఛార వ్యవస్థ కుదేలయింది , భూమి మీద , గాలిలో, సముద్రంలో, రోదసీలో, ఫోన్లలో, ఇంటర్నెట్ లో ఎవరు ఎక్కడ ఏమి మాట్లాడుకున్నా, వారి దేశం గురించి చెడుగా ఆలోచించినా పసిగట్టగలిగే ఇజ్రాయెల్ ను దెబ్బతీసింది ఎవరు.
ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే , రాజకీయాలు . అవును అంతర్గత రాజకీయ విబేధాలు.
ఎప్పుడైతే రాజకీయపార్టీలు ప్రత్యర్థులుగా వుండే స్థాయినుండి వ్యక్తిగత శత్రువులుగా మారతారో ఎప్పుడైతే అధికారం చేజిక్కించుకోవడం అనేది దేశం కన్నా ఎక్కువైపోతుందో అప్పుడు కోట్ల కళ్ళు వున్న కోట్ల చెవులు వున్న ఇజ్రాయెల్ కూడా గుడ్డిది , చెవిటిది అయిపోతుంది , పిపీలకం లాంటి హమాస్ చేతిలో ఓడిపోతుంది.
నిజానికి గత దశాబ్ద కాలంగా ఇజ్రాయెల్ లో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మీద ప్రతిపక్షాలు విపరీతమైన వ్యక్తిగత దాడులు చేస్తున్నాయి , ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని కూడా ప్రతిపక్షాలు లెక్కజేయకుండా, అతడిని మా ప్రధాని కాదు అనే స్థాయిలో దాదాపు ప్రతి రోజు దేశంలోని ఎదో ఒక ప్రదేశంలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. దీనితో ఇజ్రాయెల్ ప్రజలు ప్రధానికి అనుకూలంగా మరియు వ్యతిరేకంగా చీలిపోయారు.
ఇజ్రాయెల్ లాంటి తక్కువ జనాభా గల దేశంలో ప్రతి పౌరుడు సైన్యంలో చేరడం కొద్ది సంవత్సరాలు సైన్యం లో పనిచేయడం అనేది తప్పని సరి , ఆ తరువాత వాళ్ళు రిజర్వు సైనికులుగా ఉండి దేశానికి అవసరం పడినప్పుడు తమ తమ సహాయం అందిస్తారు. కానీ గత రెండు మూడేళ్ళుగా రాజకీయ కారణాలతో సైన్యంలోకి చేరేడానికి మరియు వారి ఇంటెలిజెన్స్ సంస్థ ఐన మోసాద్ లో ( విదేశీ ఇంటెలిజెన్స్ ) మరియు షిన్ బెట్ ( మిలిటరీ మరియు అంతర్గత ఇంటెలిజెన్స్) లో చేరడానికి ఇజ్రాయెల్ పౌరులు నిరాకరిస్తున్నారు.
దానితో ఎంతో గొప్ప గూఢాఛార టెక్నాలజీ గల దేశంలో ఆ టెక్నాలజీ అందజేస్తున్న సమాచారాన్ని విశ్లేషించడానికి మరియు దానిమీద చర్య తీసుకోవడానికి అవసరమైన మానవ వనరులే లేకుండా పోవడమో , లేదా అందుబాటులో వున్న సమాచారాన్ని కూడా కొందరు రాజకీయ కారణాలతో తొక్కిపెట్టి, దేశం మీద దాడులు జరిగితే ప్రధానిని దింపేయొచ్చు అనే భావనతో వ్యవహరించడమో జరిగి ఉండాలి.
ప్రపంచంలోనే అత్యంత గొప్ప గూఢచారికి తన దేశం మీద ఇంతపెద్దఎత్తున జరగబోయే దాడి విషయం తెలియకుండా పోతుందా. …..?
అసలే జనాభా తక్కువగా వుండే దేశంలో రాజకీయ కారణాలతో దేశ సెక్యూరిటీని , గూఢాఛార వ్యవస్థల్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో ఈ రోజున ఇజ్రాయెల్ ద్వారా మనకు గుణపాఠం దొరికింది. …
ఒక విధంగా చుస్తే మన దేశంలో కూడా గత దశాబ్ద కాలంగా రాజకీయ పార్టీలు, అందునా అధికారం చేజిక్కించుకోవాలి అని అనుకునే పార్టీలు అధికారంలో వున్నవారిని శత్రువులుగా చూడడం , వారు నా ప్రధాని కాదు అని మాట్లాడడం , కొన్ని వర్గాల ప్రజలని ప్రభుత్వానికి తద్వారా దేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం చూస్తుంటే , ఇజ్రాయెల్ పరిస్థితి మనకు కూడా వస్తుందా అనే భయం పుట్టుకొస్తుంది…. ?
ఒకవేళ అలాంటిదే జరిగితే మన దేశo లోకి ఎక్కడినుండో హమాస్ రానక్కరలేదు ” ఇక్కడే వుండే కొన్ని ప్రభుత్వ వ్యతిరేక వర్గాలే ” ఆ హమాస్ పని చేస్తాయేమో…..?
దేశంకన్నా నా పార్టీ అధికారంలోకి రావడమే ముఖ్యం అని అనుకునే రాజకీయ పార్టీలు వున్న ఏ దేశంలో అయినా ఇలాంటి ఉపద్రవం తప్పదేమో….. !
రాజకీయ కారణాలతో ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని వ్యతిరేకించి తద్వారా ప్రభుత్వాన్ని, దేశాన్ని వ్యతిరేకిస్తే పరిస్థితి ఏమవుతుందో ఇప్పటికైనా మన ప్రజలు నేర్చుకోవాలి…
ఒక బలమైన ప్రధాని కాకుండా, పొత్తులతో నిరంతరం అస్థిరతతో సతమతమయ్యే ప్రధాని ఉంటే ఎంతటి బలమైన దేశాన్ని కూడా శత్రువులు ఎలా ఆటాడిస్తారో కనీసం ఇప్పటికైనా మనకు అర్థమవ్వాలి…..!
చూద్దాం , మనకు ఎంతగా అర్థమవుతుందో మహా అంటే ఇంకో ఎనమిది నెలల లో మన పరిపక్వతకు, మన దేశభక్తికి పరీక్ష
– చెన్ను సుబ్రహ్మణ్యం