ఇటువంటి చాలా ప్రశ్నలకు రామాయణంలో గానీ భారతంలో గానీ భాగవతంలో గానీ నేరుగా సమాధానం ఎవరూ చెప్పలేదు. కానీ మనం ఊహించ వచ్చు. మొట్ట మొదటిగా జాంబవంతుడు చిరంజీవి కాదు.
దీర్ఘాయుర్ధాయం ఉన్న వాడు మాత్రమే. ఇతను సృష్టి మొదట్లోనే బ్రహ్మ ముక్కు రంధ్రం లో నుండి పుట్టినట్లు గా చెప్పబడింది. వామనావతారం లో వామనుడు త్రివిక్రముడు గా మారి అన్ని లోకాలు ఆక్రమించినప్పుడు జాంబవంతుడు 21 మార్లు ఆయనకు ప్రదక్షిణం చేసాడట. అంత శక్తిమంతుడు. రామాయణంలో అతని పాత్ర మనకు తెలిసిందే.
ఇక భాగవతంలో సత్రాజిత్తు యొక్క వృత్తాంతం లో శమంతక మని జాంబవంతుడి దొరికింది. అది వెతుకుతూ కృష్ణుడు అక్కడికి రావడం వారి మధ్య యుద్ధం జరగడం మనకు తెలిసిందే. ఆ యుద్ధంలో జాంబవంతుడు ఓడిపోయాడు.
అప్పుడు గ్రహించాడు ఆ వచ్చిన వాడు త్రేతా యుగంలో శ్రీ రాముడే అని. దాంతో కాళ్లపై బడి క్షమాపణ చెప్పి మణిని తన కుమార్తె జాంబవతిని ఇచ్చి కృష్ణుడిని పంపించాడు. అక్కడితో ఈ వృత్తాంతం ముగిసింది. జాంబవంతుని ప్రస్తావన ఇంకెప్పుడు రాలేదు. జాంబవంతుడు దీర్గాయువే కానీ చిరంజీవి కాదు.
మన పురాణాలలో చాలా మంది మహా పురుషుల జన్మకు ఇచ్చిన ప్రాముఖ్యత వారి మరణానికి ఇవ్వలేదు. కాబట్టి తన కుమార్తెను కృష్ణుడికి ఇచ్చి పంపిన కొద్దీ కాలానికి అతను శరీర త్యాగం చేసినట్లు భావించ వచ్చు. ఇది మనం ఊహించుకోవాలి తప్ప ఖచ్చితమైన ఆధారాలు ఎక్కడా ఉండక పోవచ్చు.
– సేకరణ