వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో సీబీఐ చేతులెత్తేస్తే, నాలుగేళ్లుగా జగన్ ఏం ఎత్తాడు?
– బాబాయ్ ని చంపినవారిని పట్టుకోవడానికి నాలుగేళ్ల పదవీకాలం సరిపోలేదా?
• వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరి పాత్రఏమిటో సీబీఐ స్పష్టంగా తేల్చాకకూడా సిగ్గులేకుండా సాక్షిపత్రికలో విషప్రచారం చేస్తారా?
• హత్యకేసు విచారణపై చంద్రబాబువేసిన సిట్ ను జగన్ ఎందుకు నీరుగార్చాడు?
• సీబీఐ అధికారుల్ని బెదిరించడం, వారిపై తప్పుడు కేసులు పెట్టి, పోలీసులతో వారి విధినిర్వహణను ఎందుకు అడ్డుకున్నారు?
• సీబీఐ ఛార్జ్ షీట్ అబద్ధమైతే అజయ్ కల్లం, కృష్ణమోహన్ రెడ్డి వాంగ్మూలాలు అబద్ధమేనా?
• ఐ.ఏ.ఎస్ అధికారిగా ఉండి అజయ్ కల్లం జగన్ ప్రలోభాలకు లొంగి, హత్యకేసు వివరాలు దాచడం సిగ్గుచేటు.
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి
వివేకానందరెడ్డి హత్యకేసు విచారణకు సంబంధించి సీబీఐ 28-06-2023న కోర్టుకి సమర్పించిన రెండో ఛార్జ్ షీట్లో ప్రధానంగా మూడుఅంశాలు అవినాశ్ రెడ్డిపాత్ర, షర్మిల, సునీతల వాంగ్మూలాలే కీలకంగా ఉన్నాయని, 2019 మార్చి15 నుంచి వైసీపీ, జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న మెగాడ్రామా ముగింపుదశకు వచ్చినట్టే కనిపిస్తోందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి జీ.వీ.రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా సీబీఐ ఛార్జ్ షీట్లో అవినాశ్ రెడ్డి పాత్ర కు సంబంధించి కీలక విషయాలు ప్రస్తావించారు. హత్యజరిగిన తర్వాత ఘటనాస్థలం లోని సాక్ష్యాధారాలను రూపుమాపే ప్రక్రియ మొత్తం అవినాశ్ రెడ్డి కనుసన్నల్లో ఆయన పర్యవేక్షణలోనే జరిగిందని సీబీఐ చెప్పింది. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి దగ్గరుండి మరీ పనులుచేయించారని ఛార్జ్ షీట్లోని పేజీనెం-139లో స్పష్టంగా చెప్పింది.
రక్తపు మరకలు తుడిపించడం, శవానికి అయిన రక్తాన్నితుడిచి, గొడ్డలిపోట్లు కనిపించకుం డా కుట్లువేయించడం చేశారని, తర్వాతహత్యను సహజమరణంగా చిత్రీకరించే ప్రయ త్నం చేశారని సీబీఐ పేర్కొంది. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వ కుండా, మృతుడి ఫోన్ తీసుకొని, దాన్ని దాచేశారని చెప్పింది.
విచారణాధికారి ఘటనా స్థలానికి వచ్చి అడిగాకే ఫోన్ ఇచ్చారని చెప్పారు. అవినాశ్ రెడ్డి, డీ.శివ శంకర్ రెడ్డి ఘటనాస్థలానికి వచ్చే పోలీస్ అధికారులు, ఇతర అధికారుల్ని ఎలా మేనేజ్ చేయా లనే దానిపై చర్చించుకున్నారని సీబీఐ తేల్చింది. ఈ విషయా లన్నీ సీబీఐ చెప్పినవే కానీ, టీడీపీనో, మరోపార్టీనో చెబుతున్నవి కావు.
సునీత వాంగ్మూలం..
వివేకా హత్యజరిగిన వారంతర్వాత వై.ఎస్.విజయమ్మ, జగన్ సతీమణి భారతి, సజ్జల రామకృష్ణారెడ్డి, అనిల్ రెడ్డి సునీత ఇంటికొచ్చారని ఆమె తన వాంగ్మూలంలో చెప్పిన ట్టు సీబీఐ చెప్పింది. ఆనాడు వారు వివేకాహత్యలో టీడీపీవారి ప్రమేయముందని చెప్ప మని బలవంతంచేశారని, వారే ఒకనోట్ ఇచ్చి దానిలో సంతకంపెట్టమని కూడా అడి గారని చెప్పినట్టు సీబీఐ తెలిపింది.
షర్మిల వాంగ్మూలం…
మాకు, వై.ఎస్.అవినాశ్ రెడ్డి కుటుంబానికి దశాబ్దాల నుంచి వైరం ఉంది. అవినాశ్ రెడ్డి కడపఎంపీగా పోటీచేయడం మా చిన్నాన్నకు (వై.ఎస్.వివేకానందరెడ్డి) ఇష్టంలేదు. నన్ను ఎంపీగా పోటీచేయమని చిన్నాన్నకోరాడు. చిన్నాన్నఅడగడంతో నేనే నేరుగా జగన్ ను కలిసి కడపఎంపీటిక్కెట్ ఇవ్వాలని అడిగాను. నా కోరికను కాదని జగన్ అవినాశ్ రెడ్డినే కడపఎంపీగా పోటీకి దింపాడు. ఇదంతా తెలిసి, కుట్రపన్ని కావాలనే చిన్నాన్నను చంపేశారు.
వివేకాహత్యకేసు విచారణలో సీబీఐ చేతులెత్తేసిందా? నాలుగేళ్లు అధికారంలో ఉండి జగన్ అతని ప్రభుత్వం ఏం ఎత్తాయి?
సునీత, షర్మిల వాంగ్మూలాలు, అవినాశ్ రెడ్డి పాత్ర చూశాక వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరు అసలుదోషులో సీబీఐ స్పష్టంగా తేల్చాక, సిగ్గులేకుండా సాక్షిపత్రికలో ఏం రాశారు. చేతులెత్తేసిన సీబీఐ అనా? అన్నీ అబద్ధాలు చెప్పింది అని రాస్తారా? షర్మిల, సునీతల వాంగ్మూలాలు అబద్ధాలా? సాక్షిలో రాసిందే నిజమా? గతంలో నారా సుర రక్తచరిత్ర అనిరాశారు..అదీ నిజమేనా? సీబీఐ ఛార్జ్ షీట్ అబద్ధమైతే, అధికారంలో ఉండి జగన్ అసలుదోషుల్ని ఎందుకు పట్టుకోలేకపోయాడు?
సొంత బాబాయ్ ని చంపి నవారిని కనిపెట్టి శిక్షించడానికి ముఖ్యమంత్రిగా నాలుగేళ్లసమయం సరిపోలేదా? సీబీ ఐ చేతులెత్తేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం ఎత్తాడు? హత్యజరిగిన నాటినుంచి ఇప్పటివరకు ఏం ఎత్తుతున్నాడో చెప్పాలి. హత్యకేసు విచారణపై చంద్రబాబువేసిన సిట్ ను ఎందుకు నీరుగార్చాడు? కేసువిచారిస్తున్న సీబీఐ అధికారుల్ని బెదిరించడం, వారిపై తప్పుడు కేసులు పెట్టడం, పోలీసులతో వారి విధినిర్వహణను అడ్డుకోవడం ఎందుకు చేశారు?
సీబీఐ అంతా అబద్ధమే చెబితే, మరి హత్యజరిగిన రోజున జగన్ తో ఆయన నివాసంలో తాము మేనిఫెస్టోపై చర్చిస్తున్నామని ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐ.పీ.ఎస్ అజయ్ కల్లం ఎందుకు చెప్పారు? వారేమన్నా చిన్నపిల్లలా? లేక వారితో జగనే అలాచెప్పిం చాడా? హత్యవార్త తెలిసిన వెంటనే మృతుడి కుమార్తె, అల్లుడికి చెప్పకుండా అవినాశ్ రెడ్డి నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్పాడు? ఆయన సతీమణి భారతిరెడ్డికి ఎందుకు చెప్పాడు?
నిజంచెప్పాలంటే ఆరోజు జరిగింది మేనిఫెస్టో మీటింగ్ కాదు. నిజం గా అదే అయితే పగటిపూట సమావేశం పెట్టుకోకుండా, ఎన్నికలకు ఇంకా 26 రోజులు ఉందన్నప్పుడు తెల్లవారుజామున సమావేశాలు పెడతారా? ఇలాంటి కట్టుకథలతో ఎవరి చెవుల్లో పూలుపెడతారు? కృష్ణమోహన్ రెడ్డి, అజయ్ కల్లంలు సీబీఐకి చెప్పిన వివరాల్నిగమనిస్తే వారుకూడా అబద్ధాలే చెప్పారని అర్థమైంది. నిజంగా చిన్నాన్న చనిపోతే, ఆవిషయం జగన్ కు అవినాశ్ రెడ్డి చెప్పాకకూడా, తీరుబడిగా మేనిఫెస్టో మీటింగ్ పై చర్చిస్తారా?
ఎవడైనా అలాచేస్తాడా? సొంత చిన్నాన్న చనిపోయిన దానికం టే మీటింగులే ముఖ్యమా? అంతా తెలిసి కావాలనే కుట్రలుపన్నారని, స్పష్టంగా అర్థ మవుతోంది. అజయ్ కల్లం ఐ.పీ.ఎస్ అధికారిగా ఉండి ఈ వ్యవహారంలో భాగస్వామి కావడం నిజంగా దురదృష్టకరం. టీడీపీ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అజయ్ కల్లం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సలహాదారు పదవికి ఆశపడి, ఇంతహీనంగా వ్యవహరిం చడం నిజంగా సిగ్గుచేటు. ఎవరో తహసీల్దార్లు, కిందిస్థాయి ఉద్యోగులు కక్కుర్తిపడ్డారం టే అనుకోవచ్చు. కానీ ఐ.పీ.ఎస్ అధికారికూడా దిగజారబట్టే, హత్యకేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.
సీబీఐ తీగలాగుతుంటే ఎక్కడ తమదాకా వస్తుందోనన్నభయంతో చివరకు సునీతను, ఆమె భర్తను దోషుల్ని చేయాలని ప్రయత్నించారు
తండ్రిని చంపినవారిని శిక్షించడానికి కోర్టులచుట్టూ తిరుగుతున్న సునీతను కూడా దోషిగా నిలబెట్టే ప్రయత్నంచేశారు. తొలుత టీడీపీపై, చంద్రబాబుపై నేరాన్ని మోపాలని చూసి భంగపడి, సీబీఐ తీగలాగుతుంటే, చివరకు తండ్రిని కూతురు, అల్లుడే చంపారని చెప్పే నీచస్థాయికి దిగజారారు. అడబిడ్డకు అండగా నిలవాల్సినవారే ఆమెను తప్పుడుమనిసిగా చిత్రీకరించే ప్రయత్నంచేశారు.
అలాంటిమీరు సిగ్గలేకుండా చేతిలో అవినీతిపత్రిక ఉం దని ఇంకా సిగ్గులేకుండా తప్పుడురాతలు రాస్తారా? ఈరోజు మేం ఎవరిపైనా వ్యక్తిగతంగా మాట్లాడలేదు.సీబీఐ ఛార్జ్ షీట్ లోని అంశాలనే ప్రస్తావించాము. ఈ వ్యవహారంలో మరిన్ని అంశాలు వెలుగులోకిరావాల్సి ఉంది. అన్నీ బయటకు వచ్చాక ప్రజలే వాస్త వాలు తెలుసుకుంటారు.” అని జీ.వీ.రెడ్డి స్పష్టంచేశారు.