బ్రాహ్మణత్వం అన్నది పుట్టుకతో రాదు. బ్రాహ్మణత్వం అన్నది ఒక ఆలోచనా సరళి. బ్రాహ్మణత్వం అన్నది ఒక జీవన విధానం. బ్రాహ్మణత్వం అన్నది ఒక తీరు.
బ్రాహ్మణత్వం అన్నది ఒక పరిణామం. బ్రాహ్మణత్వం అన్నది ఒక శైలి. బ్రాహ్మణత్వం అన్నది ఒక స్థితి. బ్రాహ్మణత్వం అన్నది ఒక తత్త్వం. బ్రాహ్మణత్వం సత్వం.
కావాల్సిన వాళ్ళు బ్రాహ్మణ్యాన్ని సాధించుకోవచ్చు. అక్కర్లేనివాళ్లు వద్దనుకోవచ్చు.
ప్రముఖ గాయకుడు కె.జే. ఏసుదాస్ కోరుకుని, అభ్యాసం చేసి భాష పరంగా, భావన పరంగా, ప్రవర్తన పరంగా బ్రాహ్మణ త్వాన్ని పొందారు. ఆయన ఒకప్పటి, ఇప్పటి చిత్రాల్ని చూస్తే మతిస్థిమితం ఉన్న ఎవరికైనా ఆయన పరిణామం, బ్రాహ్మణ్యాన్ని పొందిన స్థితి అవగతం ఔతాయి. కె.జే. ఏసుదాస్‌ను చూసి ఎవరైనా బ్రాహ్మణ్యంపై, కులంపై, మతంపై ‘బుద్ధి’ తెచ్చుకోవచ్చు.
– రోచిష్మాన్
9444012279