– లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డి బేరం కుదుర్చుకున్నారు
– విచారణ సంస్థ-నిందితుడి మధ్య బార్గైనింగ్ కుదిరినట్లు అర్ధమవుతుంది
– కోర్టుతో గేమ్లాడుతున్నారని జడ్జి అసహనం
– వాసుదేవరెడ్డి పిటిషన్లో నిజాయితీ లేదని స్పష్టీకరణ
– బెయిలివ్వకపోతే అప్రూవర్‌గా మారరా అని ప్రశ్న
– గతంలో ఇదే కోణంలో విమర్శించిన న్యాయవాది లక్ష్మీనారాయణ
-అందుకు బోలెడు వ్యూహాలున్నాయంటూ మీడియా, సోషల్‌మీడియా మేధావుల వాదన
– న్యాయవాది లక్ష్మీనారాయణపై మైండ్‌గేమ్
– వాసుదేవరెడ్డికి బెయిల్ అభ్యంతరం లేదన్న ప్రభుత్వ న్యాయవాది
– అయినా బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు జడ్జి
– అంతమంది లాయర్లు ఉన్నా సర్కారు మాట నెగ్గలేదేం?
– లిక్కర్ కుంభకోణంలో వాసుదేవ రెడ్డి “శరీరంలోని తల”లాంటివాడు
– అప్రూవర్‌కు బెయిల్ మంజూరు చేయకూడదు
– అప్రూవర్‌గా కస్టడీలో ఉండి సాక్ష్యం ఇవ్వాలి
– వాసుదేవ రెడ్డి అప్రూవర్ పిటిషన్ తప్పు.. పనికిరానిది
– బెయిల్ ఇస్తే న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీయడమే
– బెయిల్ మంజూరు చేస్తే విచారణ ప్రభావితమవుతుంది
– గుంటూరు జిల్లాకు శాశ్వత నివాసి అయినప్పటికీ పారిపోయే ప్రమాదం
– లిక్కర్ స్కామ్ కేసులో వాసుదేవ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన విజయవాడ ఏసీబీ కోర్టు
(మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘ పిటిషనర్, ఏ-2 వాసుదేవరెడ్డి మాస్టర్‌మైండ్. ఈ కేసులో ఆయనే కీలకపాత్ర పోషించారు. లేబుల్స్ మార్చడం, ఓఎఫ్ఎస్ అలాట్మెంట్లో ఆయనదే కీలకపాత్ర. ఏ2 వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారేందుకు లోపభూయిష్టమైన పిటిషన్ దాఖలు చేశారు. అది రిటర్ను అయింది. మీరు దానికి సమాధానం చెప్పలేదు. మళ్లీ అభ్యర్ధన కూడా చేయలేదు. మళ్లీ దానిని ప్రెజంట్ చేయకుండానే అప్రూవర్‌గా మారినట్లు పిటిషన్ వేశానని అబద్ధం చెప్పడం కోర్టును తప్పుదోవపట్టించడమే. విచారణ సంస్థ మొత్తం ఈ కేసులో పలు బలమైన డాక్యుమెంట్లు, ఆధారాలు సేకరించింది. వాసుదేవరెడ్డి ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించారని తెలిపింది. అలాంటి వ్యక్తిని అప్రూవర్‌గా ఒప్పుకోవడం న్యాయసమ్మతం కాదు. ఏ-2 వాసుదేవరెడ్డి ఆర్ధికనేరాలపై అన్ని ఆధారాలున్నప్పటికీ, నిందితుడు అప్రూవర్‌గా మారాల్సిన అవసరం లేదని తెలిసి కూడా, వాసుదేవరెడ్డిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కోర్టుతో ఆటలాడవద్దు. నాకు ముందస్తు బెయిలిస్తేనే అప్రూవర్‌గా మారతానని మీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇది కోర్టుతో గేమ్ ఆడటమే. అంటే పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే అప్రూవర్‌గా మారే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోంది. మీరు సిట్- కోర్టుతో బేరాలాడుతున్నారు. చట్టం ఉద్దేశం అది కాదు కాబట్టి దానిని కోర్టు అంగీకరించదు.
ప్రామిస్ చేస్తే బెయిల్ ఇవ్వాలని చట్టం లో ఎక్కడా లేదు. మీరు అప్రూవర్‌గా మారే ఆలోచన మీ మనసులో ఉన్నట్లు అనిపించడం లేదు. ఇది కోర్టును తప్పుదోవపట్టించేలా ఉంది. పిటిషనర్‌కు నిజాయితీ ఉన్నట్లు కనిపించడం లేదు. మేం బెయిల్ ఇవ్వకపోతే మీరు అప్రూవర్‌గా మారరా? అంటే మీలో నిజాయితీ లోపించినట్లు కనిపిస్తోంది. మీరు న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని తక్కువగా అంచనా వేశారు. విచారణ సంస్థ-నిందితుడి మధ్య బేరం (బార్గైనింగ్) కుదిరినట్లు అర్ధమవుతుంది. ఇలాంటివి అనుమతించడం 306(4)(బి)ఆఫ్ సీఆర్పిసికి వ్యతిరేకం. అందువల్ల నా విచక్ష ణాధికారాలతో నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తున్నా’’
– ఇది లిక్కర్ కుంభకోణంలో వాసుదేవరెడ్డి, వెంకట సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు పిటిషన్‌ను కొట్టివేస్తూ విజయవాడ స్పెషల్ జడ్జి పి.భాస్కర్‌రావు ఇచ్చిన తీర్పు.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు దొంటిరెడ్డి వాసుదేవ రెడ్డి (A2) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడలోని స్పెషల్ జడ్జి ఫర్ SPE & ACB కేసుల కోర్టు తిరస్కరించింది. ఈ ఆర్డర్‌ను స్పెషల్ జడ్జి ప్రియాంక భాస్కర రావు జారీ చేశారు. ఈ కుంభకోణం వల్ల రాష్ట్ర ఖజానాకు 3200 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు నివేదికలు తెలిపాయి.అయితే ప్రభుత్వ న్యాయవాది స్వయంగా వాసుదేవరెడ్డికి బెయిల్ ఇచ్చినా అభ్యంతరం లేదని స్పష్టం చేసినప్పటికీ, జడ్జి మాత్రం ప్రభుత్వ కౌంటర్‌ను ఖాతరు చేయకుండా వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేయడం విశేషం. ప్రభుత్వమే బెయిల్‌పై తన అంగీకారం ప్రకటించినా, న్యాయమూర్తి మాత్రం అందుకు భిన్నమైన తీర్పు ఇవ్వడం దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి అని న్యాయవాద వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
కేసు వివరాలు
అక్టోబర్ 2019 నుండి మార్చి 2024 వరకు జరిగిన ఈ లిక్కర్ స్కామ్‌లో వాసుదేవ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు కోర్టు గుర్తించింది. ఆయన APSBCL మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆ తర్వాత కమిషనర్ ఆఫ్ బెవరేజెస్ అండ్ డిస్టిలరీస్గా బాధ్యతలు నిర్వహించారు. లిక్కర్ సేకరణ, సరఫరా, పంపిణీలో అవకతవకలు, అక్రమ కిక్‌బ్యాక్‌లు (కేసుకు 150 నుండి 600 రూపాయల వరకు), ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై (OFS) సిస్టమ్‌ను నిలిపివేయడం ద్వారా డిస్టిలరీలకు అక్రమ లాభాలు చేకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుట్ర YSRCP ప్రభుత్వ హయాంలో జరిగినట్లు తెలుస్తోంది. వాసుదేవ రెడ్డి వాట్సాప్ గ్రూపుల ద్వారా డిపో మేనేజర్లకు సూచనలు ఇచ్చి, అపరిమిత OFSలను జారీ చేసినట్లు కోర్టు గమనించింది. ఈ కుంభకోణంలో సీనియర్ రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, ప్రైవేట్ పార్టీలు కూడా భాగస్వాములుగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బెయిల్ నిరాకరణకు కారణాలు
వాసుదేవ రెడ్డి భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 180 కింద స్వచ్ఛంద ఒప్పుకోలు ప్రకటన ఇచ్చి, అప్రూవర్‌గా (క్షమాపణ పొందిన సాక్షి) మారేందుకు ప్రయత్నించారు. అయితే, కోర్టు ఈ పిటిషన్‌ను “తప్పుగా మరియు పనికిరానిది”గా భావించింది. Cr.P.C. సెక్షన్ 306(4)(b) ప్రకారం, అప్రూవర్‌కు బెయిల్ మంజూరు చేయడం న్యాయపరమైన గౌరవాన్ని దెబ్బతీస్తుందని, ఇతరులను తప్పుగా ఇరికించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.
కోర్టు వాసుదేవ రెడ్డిని ఈ కుంభకోణంలో “శరీరంలోని తల”గా వర్ణించింది, ఆయన కీలక పాత్ర కారణంగా బెయిల్ మంజూరు చేస్తే విచారణ ప్రభావితమవుతుందని తెలిపింది. గుంటూరు జిల్లాకు శాశ్వత నివాసి అయినప్పటికీ, పారిపోయే ప్రమాదం ఉందని కోర్టు భావించింది. విచారణ దాదాపు పూర్తయిన నేపథ్యంలో, A1 కెసిరెడ్డి రాజా శేఖర్ రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేయబడింది.
ఇదీ తీర్పు
స్పెషల్ జడ్జి ప్రియాంక భాస్కర రావు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, దానిని తొలగించినట్లు ప్రకటించారు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థీకృత అవినీతిపై వెలుగులోకి వచ్చిన మరో కీలక అంశంగా భావించబడుతోంది, మరియు ఈ తీర్పు విచారణ పురోగతిపై గణనీయమైన ప్రభావం చూపనుంది
ఈ బెయిల్ ఆర్డర్ విజయవాడలోని స్పెషల్ జడ్జి ఫర్ SPE & ACB కేసుల కోర్టులో జారీ చేయబడింది, దీనిలో దొంటిరెడ్డి వాసుదేవ రెడ్డి (A2) బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసు లిక్కర్ స్కామ్‌తో సంబంధం కలిగి ఉంది, ఇది అక్టోబర్ 2019 నుండి మార్చి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అవినీతి మరియు క్రిమినల్ కుట్రకు సంబంధించినది. ఈ కుంభకోణం వల్ల రాష్ట్ర ఖజానాకు 3200 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది.
కేసు వివరాలు:
• నిందితుడు: దొంటిరెడ్డి వాసుదేవ రెడ్డి, APSBCL MD మరియు కమిషనర్ ఆఫ్ బెవరేజెస్ అండ్ డిస్టిలరీస్గా పనిచేశారు.
• ఆరోపణలు: IPC సెక్షన్లు 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), 420 (మోసం), 120-B (కుట్ర) మరియు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 1988 సెక్షన్లు 7, 7(a), 8, 13(1)(b), 13(2) కింద నేరాలు.
• కుంభకోణం: లిక్కర్ సేకరణ, సరఫరా, మరియు పంపిణీలో అవకతవకలు, అక్రమ కిక్‌బ్యాక్‌లు (కేసుకు 150-600 రూపాయలు), మరియు ఆటోమేటెడ్ OFS సిస్టమ్‌ను నిలిపివేయడం ద్వారా డిస్టిలరీలకు అక్రమ లాభాలు చేకూర్చారు.
• పిటిషనర్ పాత్ర: వాసుదేవ రెడ్డి లిక్కర్ సరఫరా మరియు పంపిణీపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నారు. వారు వాట్సాప్ గ్రూపుల ద్వారా డిపో మేనేజర్లకు సూచనలు ఇచ్చారు. అపరిమిత OFS జారీ చేశారు.
బెయిల్ పిటిషన్ – అప్రూవర్
• వాసుదేవ రెడ్డి అప్రూవర్ గా (క్షమాపణ పొందిన సాక్షి) మారేందుకు పిటిషన్ దాఖలు చేశారు మరియు BNSS సెక్షన్ 180 కింద స్వచ్ఛంద ఒప్పుకోలు ప్రకటన ఇచ్చారు. తన మరియు ఇతర కుట్రదారుల (రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, ప్రైవేట్ పార్టీలు) పాత్రలను వెల్లడించారు.
• అయితే, కోర్టు అతని అప్రూవర్ పిటిషన్‌ను తప్పుగా మరియు పనికిరానిదిగా భావించింది. Cr.P.C. సెక్షన్ 306(4)(b) ప్రకారం, అప్రూవర్‌కు బెయిల్ మంజూరు చేయకూడదు. ఎందుకంటే ఇది న్యాయపరమైన గౌరవాన్ని దెబ్బతీస్తుంది మరియు ఇతరులను తప్పుగా ఇరికించే అవకాశం ఉంది.
బెయిల్ నిరాకరణ కారణాలు:
1 పిటిషనర్ ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు మరియు కీలక పాత్ర పోషించారు. కోర్టు వారిని “శరీరంలోని తల”గా వర్ణించింది.
2 అప్రూవర్‌గా, వారు కస్టడీలో ఉండి సాక్ష్యం ఇవ్వాలి. బెయిల్ మంజూరు చేస్తే, వారి సాక్ష్యం ప్రభావవంతం కాదు.
3 విచారణ దాదాపు పూర్తయింది, మరియు A1పై ఛార్జిషీట్ దాఖలు చేయబడింది.
4 గుంటూరు జిల్లాకు శాశ్వత నివాసి అయినప్పటికీ, పారిపోయే ప్రమాదం ఉందని కోర్టు భావించింది.
5 అధికారిక రికార్డుల వెలుపల కమ్యూనికేషన్లు జరిగాయి, ఇది కుట్రను సూచిస్తుంది.
తీర్పు:
• కోర్టు పిటిషనర్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది మరియు తొలగించింది.
• ఈ ఆర్డర్‌ను ప్రియాంక భాస్కర రావు, స్పెషల్ జడ్జి, 2025 ఆగస్టు 18న జారీ చేశారు.
సంక్షిప్తంగా, లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించినందున మరియు అప్రూవర్‌గా కస్టడీలో ఉండవలసిన అవసరం ఉన్నందున, వాసుదేవ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
లోపం ఎక్కడ? ఎవరిది?
నిజానికి ఈ కేసులో ప్రభుత్వం తరఫున హేమాహేమీలయిన న్యాయవాదులున్నారు. వారిలో సుప్రీంకోర్టు న్యాయవాదులయిన సిద్దార్ధ్ లూత్రా, ముకుల్ రోహత్గీ, సిద్దార్ధ అగర్వాల్, మనుశర్మ సలహాదారులుగా ఉన్నారు. ఇక రాష్ట్రం నుంచి రాజేంద్రప్రసాద్, గూడపాటి, పోసాని వెంకటేశ్వర్లు, జవ్వాది శరత్చంద్ర, దుద్దాల కోటేశ్వరరావు ప్రభుత్వ న్యాయవాదులుగా ఉన్నారు. ఈ సందర్భంలో నిందితులిద్దరికీ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని శరత్చంద్ర వాదించారు. ప్రభుత్వం కూడా ఆ మేరకు కౌంటర్ వేసింది.
అయినప్పటికీ న్యాయమూర్తి, ప్రభుత్వ వాదనలు త్రోసిపుచ్చి నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించడం న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశమయింది. సహజంగా ప్రభుత్వమే బెయిల్‌పై అభ్యంతరం లేదని చెప్పిన తర్వాత, న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తారు. కానీ లిక్కర్ కేసులో మాత్రం అందుకు భిన్నంగా జరగడమే ఆ చర్చకు కారణం. అయితే ఈ కేసు వాదిస్తున్న ఇద్దరు ప్రభుత్వ లాయర్లు తొలి నుంచీ, ప్రభుత్వ ప్రముఖుడి తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు టీడీపీ న్యాయవాద వర్గాల్లో ప్రచారం జరిగింది. ఆ మేరకు వారు తమపై ఒత్తిళ్లు తీసుకురావడాన్ని ఇష్టపడటం లేదన్నదే ఆ ప్రచార సారాంశం.
నిజానికి వాసుదేవరె డ్డిని అప్రూవర్‌గా మార్చేందుకు కొందరు చేసిన ప్రయత్నాలపై పార్టీ వర్గాల్లోనే వ్యతిరేకత వ్యక్తమయింది. వాసుదేవరెడ్డికి బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన అప్రూవర్ కాకపోతే ఏం చేస్తారు? బె యిల్ పిటిషన్ కొట్టివేసినా వాసుదేవరెడ్డి అదే వైఖరి కొనసాగిస్తారా? వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా లోపభూయిష్టమైన పిటిషన్ వేశారని జడ్జి వ్యాఖ్యానించేంతవరకూ , ప్రభుత్వ న్యాయవాదులు దానిని ముందుగా ఎందుకు కనిపెట్టలేకపోయారు అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
కిం కర్తవ్యం?
లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డి సహా జగన్ లబ్దిదారులను రక్షించేందుకు తెరవెనక బాగోతం నడుస్తోందంటూ టీడీపీకి చెందిన సీనియర్ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ చేసిన సంచలన ఆరోపణల్లో పస లేదని.. ప్రభుత్వం వ్యూహం ప్రకారమే వాసుదేవరెడ్డిని అప్రూవర్‌గా మార్చిందంటూ ఇప్పటివరకూ వాదిస్తూ వచ్చిన ఒక మీడియా, కొందరు సోషల్‌మీడియా మేధావుల వాదన తప్పని విజయవాడ జడ్జి తీర్పు తేల్చింది.
వాసుదేవరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తే.. ఆయన నుంచి సమాచారం రాబట్టలేము కాబట్టే, ఆయనను అప్రూవర్‌గా మార్చి లిక్కర్ కేసు నిందితుల కథ తేల్చేందుకే, ప్రభుత్వ న్యాయపెద్దలు వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారని వారు వాదిస్తూ వచ్చారు. లిక్కర్ కేసు గురించి ఏమీ తెలియకుండా, మిడిమిడి జ్ఞానంతో చేస్తున్న వాదన వల్ల జగన్‌కు లబ్థి చేకూర్చుతున్నారని, చివరకు సొంత పార్టీ వారిపైనే వైసీపీ ముద్ర వేసే ప్రయత్నం చేశారు.
కానీ విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు పరిశీలిస్తే, వాసుదేవరెడ్డి వేసిన లోపభూయిష్టమైన పిటిషన్‌ను ప్రాసిక్యూషన్ అసలు పరిశీలించలేదన్న విషయం స్పష్టమవుతోందని టీడీపీ న్యాయవాద వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. వాసుదేవరెడ్డికి నిజంగా అప్రూవర్‌గా మారే మనసు లేదని ఒక జడ్జిగారే గ్రహించినప్పుడు, కీలకమైన పదవుల్లో అనుభవం ఉన్న వారు ఆ కీలక అంశాన్ని గ్రహించకపోవడమే ఆశ్చర్యంగా ఉందని అటు సీనియర్ న్యాయవాదులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పుడు ఈ కేసులో సిట్ ఏం చేయబోతోంది? వాసుదేవరెడ్డిని అరెస్టు చేస్తుందా? లేక ఆయన హైకోర్టులో అపీల్ చేస్తారా? అప్పుడు కూడా ప్రాసిక్యూషన్ ఇదేమాదిరిగా ఆయనకు బెయిలిచ్చినా అభ్యంతరం లేదని చెబుతుందా అన్నది చూడాలి.
నేను చెప్పిందే నిజమైంది: లక్ష్మీనారాయణ
లిక్కర్ కేసుకు సంబంధించి తొలి నుంచి తాను చేస్తున్న వాదనే నిజమయిందని సీనియర్ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ చెప్పారు. తాను వ్యక్తులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని, వ్యవస్థను-పార్టీని తప్పుదోవపట్టించేవారి గురించి, ప్రభుత్వం-పార్టీని అప్రమత్తం చేయడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.
సిట్ దగ్గర బలమైన సాక్షాలు ఉన్న తర్వాత వాసుదేవరెడ్డిని అప్రూవర్‌గా మార్చాల్సిన అవసరం లేదని, ఆయనను అరెస్టు చేసిన తర్వాతనే కోర్టు కూడా అప్రూవర్‌గా అంగీకరిస్తుందని తాను గతంలోనే చెప్పానని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. కేసును సిట్ బలంగా బిగించిందని, వారిపై ఎవరి ఒత్తిళ్లు లేకపోతే జగన్‌ను శిక్షించడం పెద్ద కష్టం కాదని, రాజేంద్రప్రసాద్ లాంటి సమర్ధులు-నిజాయితీపరులైన న్యాయవాదులు సిట్‌లో ఉన్నారని చెప్పారు.
అసలు ఈ కేసులో జగన్‌ను జైలుకు పంపించి, వైసీపీ పార్టీని రద్దు చేయించాలన్నదే తమ అభిమతమన్నారు. కానీ తన వాదనను కొందరు సరిగ్గా అర్ధం చేసుకోకపోగా, తనపై ఎదురుదాడి చేసి వ్యక్తిత్వ హననం చేయడం బాధాకరమని లక్ష్మీనారాయణ ఆవే దన వ్యక్తం చేశారు.
‘‘ఐదేళ్లు జగన్ ప్రభుత్వంపై నేను చేసిన పోరాటం గురించి తెలియని వాళ్లే వివిధ మార్గాల్లో నాపై ఎదురుదాడి చేస్తున్నారు. వాటిని నేను పట్టించుకోను. నేనేమిటో, నేను చేసిన సేవలు-పోరాటమేమిటో అప్పట్లో మాతో నిరంతరం చర్చించిన సీఎం గారికి, టీడీపీలోని నా క్లయంట్లకు తెలుసు. అందుకే శ్రేయోభిలాషుల సూచనల మేరకు నేను మౌనంగా ఉంటున్నా’’నని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.