Suryaa.co.in

Devotional

రామాయణంలో ఏముంది?

విభీషణుడు ఇంటి గుట్టు చెప్పి లంకకే చేటు తెచ్చాడా? ఇది మరో అబద్ధం.
వాల్మీకి రామాయణంలో ఉన్నది వేరు.. సినిమాలలో మనం చూసేది వేరు.

నిజ రామాయణంలో ఏమి ఉన్నది?
రామరావణ యుద్ధం ప్రారంభమౌతుంది. రావణాసురుడు కి అత్యంత అద్భుమైన రథం ఉంటుంది.. రాముడు నేల మీద నిలబడి యుద్ధం చెయ్యడం కష్టం.

అది గమనించిన దేవేంద్రుడు తన రథ సారధి మాతలిని ఆదేశించగా, ఆయన దేవేంద్రుని రథాన్ని తీసుకుని వెళ్లగా శ్రీరాముడు ఆ రథం పై ఎక్కి యుద్ధం చేస్తాడు. (అంతేగానీ సినిమా లలో చూపించినట్లు ఆంజనేయుని భుజస్కందా లపై ఎక్కి కాదు )

యుద్ధం లో ఎంత సేపటికీ రావణుడు ఓడిపోతూ ఉంటాడు కానీ చావడు.
అప్పుడు మాతలి సలహా ఇస్తాడు. “ఓ రామచంద్రమూర్తి! ఈతనికి పూర్వ వరం వలన బ్రహ్మాస్త్రం తో తప్ప చావు రాదు” అని అప్పుడు శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి, రావణ సంహారం చేస్తాడు అని రామాయణం లో ఉంది.

సినిమాలలో నేమో విభీషణుడు రావణుడి పొట్టలో అమృత భాండముందని, పొట్టలో బాణం వేస్తే గానీ తన అన్న చావడని చెప్పినా, కుక్షి పై బాణం వెయ్యడానికి రాముడు ఒప్పుకోలేదని, అప్పుడు ఆంజనేయుని కోరిక మీద, వాయు దేవుడు రాముని బాణాన్ని రావణాసురుడి పొట్ట వైపు తిప్పాడని చూపించారు..

ప్రమాదం ఏమిటంటే.. రామ వ్యతిరేకులు, రావణ భక్తులు, హేతువాద,నాస్తిక మిత్రులు, విధర్మీయులు, కుహనా లౌకిక వాదులు విభీషణుడిని విలన్ ను చేసేసి.. తన అన్నకు ద్రోహం చేసిన తమ్ముని గా ఆ రామ భక్తునిపై నిందలు వేసేసి అబద్ధాల narratives ను సృష్టించడాన్ని చూసి… నిజానిజాలు చెప్పే ప్రయత్నం ఇది

– మల్లికార్జున రావు భైరిశెట్టి
9618644949

LEAVE A RESPONSE