Suryaa.co.in

Andhra Pradesh

పోలవరంలో అంత రహస్యమేంటి?

-విపక్ష ఎమ్మెల్యేలను ఆపడంలో ఆంతర్యమేమిటి?
-టీడీపీ హయాంలో బస్సులు వేసి మరీ చూపించాం
-ఇప్పుడు వైసీపీ సర్కారు భయపడటానికి కారణమేంటి?
-పోలవరం ప్రాజెక్టు పరిశీలిస్తే మీకేం భయం?
-మీ లొసుగులు బయటపడతాయన్న భయమా?
-టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అడ్డుకున్న పోలీసులు
-పోలీసుల తీరుపై నిమ్మల ఫైర్

పోలవరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లే విపక్ష ఎమ్మెల్యేలను వైసీపీ సర్కారు అడ్డుకోవడం వెనుక, అక్కడ ఏవో లొసుగులున్నాయని ప్రజలు భావించాల్సి వస్తుందని, టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు అనుమానం వ్యక్తం చేశారు. తనను పోలవరం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసుల తీరుపై, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నిమ్మల ఏమన్నారంటే..
తెలుగుదేశం హయంలో బస్సులు పెట్టి సామాన్యులకు సైతం పోలవరం నిర్మాణం చూపించేవాళ్ళం – నేడు జగన్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కూడా చూసే పరిస్థితి లేదు..
2014 -19 వరకూ 5సం.లలో 72% పోలవరం పనులు పూర్తిచేస్తే, జగన్ ఈ 4 సంవత్సరాలలో 2 శాతం కూడా పూర్తి చెయ్యకపోవడం ప్రపంచానికి తెలియకూడదనా?

2019లో జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఏ విధమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండానే అక్కడ పనిచేసే ఏజెన్సీలను,అనుభవం గల అధికారులను మార్చడం వల్లనే పోలవరం పడకేసిందన్న విషయం బయట ప్రపంచానికి తెలుస్తుందనా?

2020లో వచ్చినటువంటి వరదల్లోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని (అంటే నీ ప్రభుత్వ హయాంలోనే) పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పడం బయట ప్రపంచానికి తెలుస్తుందనా?

పోలవరం ఎత్తు 45.75 మీటర్ల నుండి 41.15 మీటర్ల ఎత్తుకు తగ్గించడం ద్వారా పోలవరం ప్రాజెక్టు బ్యారేజీగా మారిపోయి పోలవరం అర్థం పరమార్థం మారిపోతుందని బయట ప్రపంచానికి తెలుస్తుందనా? పోలవరం ఎత్తు తగ్గించడం ద్వారా 194 టీఎంసీలు నిలవ ఉండాల్సిన నీరు కేవలం 119 టీఎంసీల నీరుకు మాత్రమే పరిమితమై గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు, రాయలసీమకు వెళ్లే అవకాశం లేదని బయట ప్రపంచానికి తెలుస్తుందనా?

స్పీల్ వే లో సుడిగుండాల నుండి రక్షణ కోసం ఏర్పాటుచేసిన గైడ్ బండ్ బీటలు వారిన విషయం బయట ప్రపంచానికి తెలుస్తుందనా? ఆరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో 2021 జూన్ కు పూర్తిచేస్తానని మొదటిగా, 2022 జూన్ కి పూర్తి చేస్తాను అని రెండవసారి, 2022 డిసెంబర్ కి పూర్తి చేసి చూపెడతామని అసెంబ్లీ సాక్షిగా మూడుసార్లు చెప్పి, ఇప్పుడు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియనటువంటి దశ ప్రపంచానికి తెలుస్తుందనా?

LEAVE A RESPONSE