Suryaa.co.in

Andhra Pradesh

పంచదార మిల్లులపై ప్రభుత్వ వైఖరి ఏంటి?

– ముఖ్యమంత్రికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు బహిరంగ లేఖ
సహకార చెక్కర కర్మాగారాల పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఏర్పడిన పంచదార మిల్లులకే అన్ని సమస్యలు వస్తాయా లేదంటే రాష్ట్ర పాలకుల కుఠిల పన్నాగాలకు బలౌతున్నాయా అన్న అనుమానాలు షుగర్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు కలుగుతోంది.
సహకార రంగం బలోపేతం ద్వారా మాత్రమే దేశాభివ్రుద్ది జరుగుతుందని మహాత్మాగాంధీ కలలు కన్నారు అటువంటి మహాత్ముడి కలలకు రాష్ట్రంలోని పాలకులు తూట్లు పొడుస్తున్నారంటూ సోమువీర్రాజు ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 75 శాతం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి వీటికి రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణం.
కడప, చిత్తూరు, విశాఖ పట్నం జిల్లాల్లో సహకార రంగంలోని షుగర్ ఫ్యాక్టరీలు మూత పడడం వల్ల సుమారు మూడు వేల మందికి పైగా కార్మికులు రోడ్డున పడ్డారు. వేలాది మంది చెరుకు రైతుల కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయి.మీరు అధికారంలో కి రాగానే 2019 నవంబర్ మాసంలో కడప, చిత్తూరు జిల్లాల్లోని షుగర్ ఫ్యాక్టరీ లతో పాటు అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీల పనులు ప్రారంభించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేసి సమీక్ష చేశారు అయితే ఆ సమీక్షకు సంవత్సరాలు గడుస్తున్నా అతిగతీలేదు.
యాక్షన్ ప్లాన్ తయారు చేసి రెండు సంవత్సరాలు నిండినా షుగర్ ఫ్యాక్టరీ ల విషయంలో మీరెందుకు నోరుమెదపడం లేదు. సహకార రంగంలోని 10 పంచదార మిల్లులకు గాను కేవలం మూడు ఫ్యాక్టరీలకు మాత్రమే యాక్షన్ ప్లాన్ తయారు చేసి అదికూడా అమలకు నోచుకోలేదు. అసలు చెరుకు రైతుల పట్ల మీ వైఖరేంటి వీటిని అమ్మేందుకు రంగం సిద్దం చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి.
విశాఖ జిల్లాలోని తాండవ, ఏటికొప్పాక, గోవాడ, తుమ్మపాల, నాలుగు షుగర్ ఫ్యాక్టరీలు రాష్ట్రప్రభుత్వం నిర్వాకం వల్లే అప్పుల ఊబిలోకి దిగజారాయని అక్కడ కార్మికులు చేస్తున్న ఆందోళన మీ చెవికి వినపడం లేదా ఆ కార్మికులకు 32 నెలలుగా జీతాలు ఇవ్వలేదు , రైతులకు చెరుకు సొమ్ము సంవత్సర కాలంగా ఇవ్వలేదు..
ఈవిధంగా ఒక్కో ఫ్యాక్టరీని నష్టపరిచి ప్రైవేటు వ్యక్తులకు దొడ్డిదారిన అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారా అని ఈ లేఖ ద్వారా ప్రశ్నిస్తున్నాను. అందరికీ తీపినందించి వారి జీవితాన్ని చేదు మయం చేసుకునే పరిస్థితి లు ప్రభుత్వం కల్పిస్తోంది. ఇకపై ప్రభుత్వం స్పందించక పోతే షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల పక్షాన బిజెపి రాష్ట్ర ప్రభుత్వం తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈలేఖ ద్వారా స్పష్టం చేయదల్చుకున్నాను.

LEAVE A RESPONSE