Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రుణ భారం ఎంత?

రాష్ట్ర రుణభారం రూ.9,74,556 కోట్లు ఉన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం ద్వారా శాసనసభలో వెల్లడించారు. అందులో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్, వార్షిక బడ్జెట్ పత్రాలలో ప్రస్తావించే ఆంధ్రప్రదేశ్ రుణ భారం రు.7,67,869 కోట్లు ఉన్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ రు.7,48,612 కోట్లు ఉన్నదని, శాసనసభకు హాజరు కాకుండా ప్రసారమాధ్యమాలకు తెలియజేశారు. రెండింటి మధ్య తేడా రు.19,257 కోట్లు.

అదనంగా, పౌర సరఫరాల శాఖకు మరియు విద్యుత్ రంగ సంస్థలకు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తాలను, విక్రేతలు, కాంట్రాక్టర్లు & పథకాలకు చెల్లించాల్సిన బాకీలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, వగైరా బాకీల మొత్తం రు.2,06,687 కోట్లు ఉన్నదని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ బాకీల ప్రస్తావన మాజీ ముఖ్యమంత్రి జగన్ చేయలేదు.

శ్వేతపత్రంలో పేర్కొన్న అప్పుల చిట్టా సమగ్రంగా ఉన్నదో.. లేదో! మరొకసారి సరిచూసుకోవాలని ముఖ్యమంత్రికి ఒక శాసన సభ్యుడు సభలోనే విజ్ఞప్తి చేస్తూ, ఇంకా ఎక్కువ రుణ భారం ఉన్నదని వ్యాఖ్యానించారు. దీన్ని ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని, శాఖలు వారీగా సమాచారాన్ని సేకరించుకుని, లోతుగా పరిశీలించి, వాస్తవాలను బహిర్గతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

– టి. లక్ష్మీనారాయణ

LEAVE A RESPONSE