– డయేరియాతో ఊరు ఊరంతా మంచం పట్టిన దారుణ పరిస్థితి పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం
హైదరాబాద్: కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడి ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?
కలుషిత నీరు తాగి తండ్రి, కొడుకులు మృతి చెందటం అత్యంత బాధాకరం. శుభ్రమైన తాగు నీరు సరఫరాలో రూరల్ వాటర్ సప్లై డిపార్ట్ మెంట్ ఫెయిల్. పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ ఫెయిల్. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నష్టనివారణ చర్యలు చేపట్టడంలో రెవెన్యూ డిపార్ట్ మెంట్ ఫెయిల్
మొత్తంగా పల్లెలు, గ్రామాల ప్రజలకు సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్. దేమికలాన్ గ్రామంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి, వెంటనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.