– సీఎల్పీ బృందాన్ని ఎందుకు చూడనివ్వడం లేదు.
– ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించిన పోలీసులు అడ్డుకున్న కాలేశ్వరం ప్రాజెక్టు వెళ్లి తీరుతాం
– రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చేరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? పోలీసు రాజ్యం నడుస్తుందా? పోలీసు రాజ్యం తీసుకురావడం కోసమే తెలంగాణ తెచ్చామా? సీఎం కేసీఆర్ తన పరిపాలన పోలీసులతోనే కొనసాగిస్తాడా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం లేదా?
ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టుల పురోగతి తెలుసుకోవడం ప్రజలకు హక్కు లేదా? 8 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆదాయం తెచ్చిన అప్పులు కాళేశ్వరంలో ధారపోసి ఏం అభివృద్ధి సాధించారో తెలుసుకోవడానికి సి.ఎల్. పి బృందం ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరింది. ప్రభుత్వ తప్పిదాలు అవకతవకలు బయటపడతాయని పోలీసులతో అడ్డుకుంటున్నట్లు స్పష్టమవుతున్నది.
మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రాజెక్టుల సందర్శన చూడకుండా భద్రాచలం దుమ్ముగూడెం మణుగూరు క్రాస్ రోడ్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు.భద్రాచలంలో అరెస్టు చేసిన పోలీసులు పాల్వంచ
తీసుకొచ్చి అక్కడ నుంచి ఇల్లందు పోలీస్ స్టేషన్కు తరలించారు అక్కడి నుంచి కూడా మరోచోటికి తరలించే ప్రయత్నం చేస్తుండగా తమ కార్యకర్తలు అడ్డుకొని నిలదీయడంతో ఇల్లందు గెస్ట్ హౌస్ కు తరలించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా? తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ లో పర్యటించడానికి ప్రభుత్వం అనుమతి దేనికోసం? తెలంగాణ ఏమైనా పాకిస్తాన్లో ఉందా?