Suryaa.co.in

Telangana

జాబ్ క్యాలండర్ కు చట్టబద్దత ఏది?

-రుణమాఫీ అంశం క్లారిటీ లేదు
-భట్టి విక్రమార్క కు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గా ఇవ్వాలని కోరుతున్న
– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: నిన్నటి వరకు జరిగింది బడ్జెట్ సమావేశాలు కావు, అవి బుల్డోజ్ చేసే వాటిలా ఉన్నాయి. జీరో ఆవర్ మొత్తానికే రద్దు చేశారు. కేవలం 6 రోజులే సభలు సాగాయి. 16 మంది మంత్రులు మాట్లాడాల్సిన అంశం పై చర్చనే జరగలేదు.నాకు అవకాశమే ఇవ్వలేదు. అన్యాయంగా నేను మాట్లాడకుండా నా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఏ రోజు ఏ ఒక్క విప్ కూడా ప్రతిపక్షాలతో మాట్లాడలేదు.

ప్రజా సమస్యల మీద మాట్లాడుదాం అంటే మైక్ కట్ చేశారు. మార్షల్స్ ను పెట్టీ మమ్మల్ని బయటికి పంపించారు. అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష, ఆయన తీరు హావభావాలు మొత్తం చూసి నాకు బాధేసింది. అసెంబ్లీ నడిచిన తీరు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడిన భాషను సైతం అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.

సబ్జెక్ట్ మంచిగా మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు పై చేయి అవుతుంటే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేసి, చర్చను మరుగున పడేసారు. ఈ సభ మొత్తం జరిగింది కేసిఆర్ ను తిట్టడం, గత ప్రభుత్వాన్ని నిందించటం, మమ్మల్ని బెదిరించటం తో నే సరిపోయింది.

నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. జాబ్ క్యాలండర్ లో స్పష్టత లేదు. రైతు భరోసా నిధుల మాటే లేదు. జాబ్ క్యాలండర్ కు చట్టబద్దత ఏది? రుణమాఫీ అంశం క్లారిటీ లేదు.. మైక్ ఇవ్వరు, అడిగితే మార్షల్ లను పెట్టీ యెత్తి పడేశారు. భట్టి విక్రమార్క కు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గా ఇవ్వాలని ప్రధాని మోడీని కోరుతున్న 75 కోట్లతో 1.50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వొచ్చని డిప్యూటీ సిఎం భట్టి అంటున్నారు. ఇతనికి నోబుల్ ప్రైజ్ ఇవ్వొచ్చు. ఇంత అనుభవం ఉంది భట్టి విక్రమార్క కు.

LEAVE A RESPONSE