-స్పాట్ ఎక్కడ చెప్పు నేను రావటానికి రెడీ
-తాజ్ కృష్ణ హోటల్లో చేసే వేషాలు మాకు తెలుసు
-రేవంత్ రెడ్డి.. మీకు సిగ్గుందా?
-బీఆర్‌ఎస్ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: ఈ దేశంలో కేసిఆర్ తప్ప ఏ రాష్ట్రం కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇస్తే నేను నా పదవి కి రాజీనామా చేస్తానని సవాల్ చేశాను. కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఆ సవాల్ స్వీకరించలేదు ఇప్పటికీ స్పందన లేదు. రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. కేసీఆర్ ను విమర్శించటం కాదు మీరేం చేస్తారో చెప్పండి.
సీఎం రేవంత్ రెడ్డి కి సిగ్గు శరం లేదు. మేమిచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చానని చెప్పడానికి రేవంత్ రెడ్డి మీకు సిగ్గుందా? నిన్న మీరు ప్రకటించిన జాబ్ క్యాలండర్ లో ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పారా? నిన్న ఇచ్చిన జాబ్ క్యాలండర్ లో ఏ ఒక్క మంత్రి సంతకం లేదు, వైట్ పేపర్ మీద రాసి జాబ్ క్యాలండర్ అని చెప్పుకుంటున్నారు. యువత పెద్ద ఎత్తున ఎదురు చూశారు. వారి ఆశలపై నీళ్ళు జల్లారు. మేము చర్చ కావాలని అడిగితే ఇవ్వకపోగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం తో మమ్మల్ని తిట్టించారు. దానం నాగేందర్ మాటలు చెప్పరాకుండా ఉన్నాయి. రూల్స్ కి వ్యతిరేకంగా ఆయన స్థానం నుంచి కాకుండా వేరే స్థానం నుంచి మాట్లాడారు.
దానం నాగేందర్.. నేను హైద్రాబాద్ లోనే ఉన్న. నువ్వు మొగోడివైతే రా చూసుకుందాం. ఎక్కడ స్పాట్ చెప్పు నేను రావటానికి రెడీ.దానం నాగేందర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎవడు ఇక్కడ భయపడటం లేదు. కేసిఆర్ పెట్టిన బిక్షపై నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు. గతంలో ఇలాగే మాట్లాడితే ఉప్పల్లో మా లక్ష్మారెడ్డి..ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డిలు ఉరికించి కొట్టిన సంగతి మరువకు. మేము మళ్లీ కొట్టే సమయం వచ్చింది. నువ్వు తాజ్ కృష్ణ హోటల్లో టీ షర్ట్ ..పౌడర్ వేసుకుని చేసే వేషాలు మాకు తెలుసు.