Suryaa.co.in

Features

2026లో తొలి బ్యాచ్ అగ్నివీర్‌ల ఆగమనం..వారు బయటకొచ్చాక ?

మీకు తెలుసుకదా, నెలలో అగ్నిపథ్‌లో చేరబోతున్న 46000మందిలో 4ఏళ్ళ తరువాత మంది రక్షకదళాల్లో కొనసాగగా 32,200మంది 13,200మంది అగ్నివీర్లుగా బయటకువస్తారు. వారికి 48నెలల జీతంతో పాటు చివర్లో 11.71 లక్షలు ఇస్తుంది భారతప్రభుత్వం అని. 4ఏళ్ళల్లో శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా ధృడమౌతారు, దేశభక్తులౌతారు సరే, మరి వారు బయటకొచ్చాక ? అదే తెలుసుకొందాం.. ముఖ్యమైన 6పాయింట్లలో..

వారు బయటకొచ్చాక వారికున్న మార్గాలు :
1) ఆర్మీవారిచ్చిన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్‌తో నచ్చిన డిగ్రీలో జాయిన్ అవ్వొచ్చు. చదువుకొని పోటీ పరీక్షలు వ్రాసి ప్రభుత్వోద్యోగాలు పొందవచ్చు.
2) ప్రైవేట్ జాబులు కూడా చేసుకొంటూ వచ్చిన సొమ్ముతో చిన్నతనంలోనే ఇల్లుకట్టుకొని పెళ్ళిచేసుకొని స్థిరపడవచ్చు.
3) రాజకీయాల్లో ఇంట్రెస్టుంటే చేరి రాజకీయాలని బాగుచేయవచ్చు. ఆర్మీ రిటర్న్‌డ్ వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మనం ఎందుకు వోటేయం చెప్పండి ?
4) రెగ్యులర్ ఆర్మీ ఆఫీసర్‌పోస్టులకి మళ్ళీ అప్లైఇ చేసుకొని చేరవచ్చు. ఈసారి వారికి ప్రిఫరెన్స్ ఉంటుంది.
5) ప్రభుత్వం వారు చివర్లో ఇచ్చిన సొమ్ము, జీతంలో దాచుకున్న సొమ్ముతో ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు. చాలదనుకొంటే ప్రభుత్వం వీరికి అతి తక్కువ వడ్డీతో ఋణాన్ని ఇస్తుంది అతి త్వరగా. ఏదైనా సంస్థ స్థాపించి వందలమందికి తామే ఉద్యోగాలివ్వొచ్చు.
6) స్వంతంగా ఒక డిఫెన్స్ అకాడమీయో ఒక స్కూలో స్థాపించవచ్చు. ఇవన్నీ కాకుంటే విదేశాల్లో చదువులకో, ఉద్యోగాలకో వెళ్ళవచ్చు వయస్సు చిన్నదేకాబట్టి.
ఇవే కాకుండా ఇంకా చాలా అవకాశాలుంటాయి ఒక ధృడమైన శరీరంతో ఖచ్చితమైన క్రమశిక్షణతో దేశభక్తితో హృదయం నిండియున్న ఒక భారత సైనికుడికి.
తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని నాలుగేళ్ళపాటు సైన్యానికి అప్పగించండి. బంగారంలా మార్చి మీ చేతికిస్తారు. అక్కడ అర్ధరాత్రి సినిమాలకు పోవడాలుండవు, క్లబ్బులూ పబ్బులూ ఉండవు, జంక్ ఫుడ్ బెంగ ఉండదు, ఆరోగ్యం పాడౌతుందనే అవకాశమే ఉండదు. రిస్క్ అంటారా, అది రోడ్డుపై పోయేవాడికికూడా ఉంటుంది. కానీ మీరు ఒక సైనికుడికి అమ్మగా, నాన్నగా ఉండే భాగ్యం వచ్చే ఏ బంగారు అవకాశాన్నికూడా వదులుకోవద్దు. ఎందుకంటే అది అందరికీ దక్కే అదృష్టం కాదు.

సనాతన సైనిక్

LEAVE A RESPONSE