Suryaa.co.in

Political News

కేంద్రం పెట్రోల్, డీజిల్ రేటు తగ్గించినా ఈ ఆంధ్ర చానల్స్ కడుపు మంట ఏమిటో!

దేశంలో పెట్రోలియం ప్రొడక్ట్స్ రేట్లు ప్రజలు తట్టుకోలేనంతగా పెరుగుతున్న సందర్భంలో, కేంద్రానికి వస్తున్న ఆదాయాన్ని తగ్గించుకుని పెట్రోల్ మీద ఐదు రూపాయలు, డీజిల్ మీద పది రూపాయలు తగ్గించిన విషయం మనకందరికీ తెలిసిందే.
ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్న సమయంలో కొన్ని తెలుగు చానల్స్ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు, దేశ వ్యతిరేకులను విశ్లేషకుల పేరుతో, ఛానల్స్ లో కూర్చోబెట్టి ఇష్ట ప్రకారం కేంద్రం మీద వ్యతిరేకత వచ్చేటట్టుగా మాట్లాడిస్తున్నారు.
కేంద్రానికి పెట్రోల్, డీజిల్ మీద వచ్చిన ఆదాయాన్ని దేశ బార్డర్ లో రోడ్లకు, మన ఆర్మీ కి వసతుల కోసం ,గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పెట్రోల్ బండ్ల అప్పులు తీర్చడం కోసం ఖర్చు పెట్టడం తప్ప పప్పులు, బెల్లాలకు పంచడం కోసం కాదు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, పెట్రోల్ మీద డీజిల్ మీద రాష్ట్ర సంవత్సర ఆదాయం 6,500 కోట్లు వస్తుండేది. ప్రస్తుతమది 11,700 కోట్లుగా వస్తుంది . మిగతా రాష్ట్రాలలో కంటే కూడా ఈ రాష్ట్రంలో అమరావతి నిర్మాణం కోసం వ్యాట్ పేరుతో 4 రూపాయలు చంద్రబాబు నాయుడు పెంచారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక రోడ్డు సెస్ పేరుతో ఒక రూపాయి పెంచారు.
కేంద్రం తగ్గించింది కదా? రాష్ట్రాలు ఎందుకు తగ్గించరూ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమాభిమానాలు ఉంటే పెట్రోల్, డీజిల్ మీద లీటర్ కు కనీసం పది రూపాయలు తగ్గించాలి. అన్ని రాష్ట్రాల కంటే మీరు ఎక్స్ట్రా గా 4 +1= 5 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ పేరుతో తీసుకున్న డబ్బుకు మీరు అమరావతి కట్టలేదు, రోడ్లు వేయలేదు.
ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ఈ దేశంలో ఉన్న ఎక్కువ రాష్ట్రాలు 5 నుండి 7 రూపాయల వరకు పెట్రోల్, డీజిల్ మీద తగ్గించాయి .కనుక ప్రజలందరూ పై విషయం మీద మీకు తోచిన విధంగా, రాజకీయ పార్టీలు ఇచ్చే పిలుపునకు ఉద్యమ రూపంలో స్పందించి, రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియ చేయవలసిందిగా కోరుచున్నాను.

– కరణం భాస్కర్
బిజెపి,
నెల్లూరు,
7386128877.

LEAVE A RESPONSE