Suryaa.co.in

Political News

ప్రకృతి ఇచ్చిన ఇసుక మీద వేలకోట్లు దోచుకోవడం దేనికి సంకేతం?

భగవంతుడు ప్రకృతి ప్రసాదించిన ఇసుకను, వేలకోట్లకు అమ్ముకోవడం ప్రభుత్వం చేస్తున్న నీతిమాలిన పనని అనుకోవడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. సాధారణంగా వ్యాపారం చేసేవారు ఏదైనా కొంత పెట్టుబడి పెట్టి , కొంత తెలివితో , కొంత మానవ వనరుల తో ప్రజలకు అవసరమైన వస్తువులు తయారు చేసి మార్కెట్ చేసుకోవడం సహజం. కానీ ఈ రాష్ట్రంలో ప్రకృతి ప్రసాదించిన ఇసుకను, ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని, వేలకోట్లు ఒక వ్యక్తి , ఇద్దరు వ్యక్తులు సంపాదించుకుంటున్నారు .ఇది ఎంతవరకు సబబన్నది ప్రజలే ఆలోచించాలి.

గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు వారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, కోట్లు దోచుకోని సొమ్ము చేసుకున్నారు అమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీ మార్చాలని, ఆరు నెలలపాటు ఇసుక అందకుండా కూలీలు , బిల్డర్ల ను నానా ఇబ్బందిపాలు చేశారు. కూలీలకు పని దొరక్క పస్తులున్న పరిస్థితి కూడా మనకు తెలుసు. కొద్ది రోజులు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఆన్లైన్ లో డబ్బు కట్టించుకుని అమ్మారు. మరల తిరిగి అది మానేశారు.

మా నెల్లూరులో అయితే 2019 ముందు ట్రాక్టర్ ఇసుక 1,100 రూపాయలకు దొరికేది. ప్రస్తుతం అదే ఇసుక అదే ట్రాక్టర్ 4,800 అవుతుంది. ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోండి. పోనీ ప్రభుత్వమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా , ఇంత రేటు పెట్టి ప్రభుత్వ ఖజానాకు జమవుతుందా అంటే ఇది ఎవరికి తెలియని విషయం.

కేవలం ముఖ్యమంత్రి కి సన్నిహితుడు శేఖర్ రెడ్డి అనే వ్యాపారస్తుడి కి , జేబీ వెంచర్స్ అనే పేరుతో రాష్ట్ర మొత్తం ఇసుక వ్యాపారం ఇచ్చినట్టుగా మనం పేపర్లలో చూశాం . వారు ఎంత మొత్తం ఇసుకను సేకరిస్తున్నారు? ఎంతకు అమ్ముతున్నారు? ప్రభుత్వానికి ఎంత కడుతున్నారో ఎవరికీ తెలియని రహస్యం.

ఇది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి అమ్మేటప్పుడు బహిరంగంగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది . ఇందులో ఏమీ మతలబు లేకపోతే, కొనేవాళ్లకు ఆన్లైన్ లో, బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారా,ఫోన్ పే ,గూగుల్ పే ద్వారా అమ్మ వచ్చు కదా? ఇది కూడా మద్యం వ్యాపారం చేసినట్టే చేస్తున్నారు . ( లెక్కలు ఎవరికీ తెలియకుండా) చెన్నైకి, బెంగళూరుకు, హైదరాబాదుకు వేల టన్నులు పెద్ద పెద్ద లారీలలో తరలిస్తున్నారని మాత్రం పేపర్లలో ఫోటోలతో సహా చూస్తున్నాం. ప్రజలకు తెలుస్తున్నది ఏమిటంటే.. ఒక యూనిట్ ఇసుక ఇంటికి చేరేసరికి 4,800 కు అమ్ముతున్నారు (ఇసుక లెక్క ఒక్క ముఖ్యమంత్రికి శేఖర్ రెడ్డికి తప్ప)

ముఖ్యమంత్రి మాత్రం అప్పుడప్పుడు .. ఇసుక టన్ను ఇంత రేటు విరివిగా దొరుకుతుంది అని చెప్పి పేపర్లలో ప్రకటనలు మాత్రం ఇస్తున్నారు . అసలు ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా, ప్రకృతిsand1 ఇచ్చిన వనరును ప్రజలకు మినిమం ఖర్చులతో ఇచ్చి ఉపయోగపడకుండా, ఈ రకమైన వ్యాపారం చేయడం ఎంతవరకు కరెక్టో ప్రజలే నిర్ణయించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక మీద ఇప్పటివరకు ఎంత ఆదాయం వచ్చిందో, ఎన్ని టన్నులు బయటకు తీశారో దానికైన ఖర్చులు ఏమిటో తెల్ల కాగితం ప్రకటించాలి.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877

LEAVE A RESPONSE