-జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా అమరావతి రైతుల పాదయాత్రను ఆపలేరు
-చట్ట ప్రకారం డ్యూటీ చేయకుండా జగన్ రెడ్డి చెప్పినట్టు చేస్తే ఇబ్బందులు తప్పవు
– డోలా బాలవీరాంజనేయ స్వామి
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పోలీసులను అడ్డు పెట్టుకుని అమరావతి రైతుల పాదయాత్రకు ఆది నుంచి అడుగుడునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అమరావతి పరిరక్షణ జేఏసీ సభ్యుడు శివపై నెల్లూరు జిల్లా వెంకటగిరి సీఐ నాగమళ్లేశ్వరరావు విచక్షణా రహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రక్క టెముకలు విరిగేలా కొట్టడం ఏంటి? కొంతమంది పోలీసులు మానవత్వం మరచి విచక్షారహితంగా ప్రవర్తిస్తున్నారు. రైతుల పాదయాత్ర రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ విధ్యార్ధుల నుంచి వృద్దుల వరకు అన్ని వర్గాల ప్రజల బ్రహ్మరధం పడుతున్నారు. దీన్ని చూసి ఓర్వలేని జగన్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని రైతులపై లాఠీ చార్జీ చేయించటం, బెదిరింపులకు పాల్పడుతున్నారు. కోర్టు ఆదేశాలకు లోబడి రైతులకు పాదయాత్ర చేస్తున్న రైతుల్ని వైసీపీ నేతలు, పోలీసులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అమరావతి రైతులపై పోలీసుల అత్యుత్సాహం ఏంటి? పోలీసులు చట్ట ప్రకారం డ్యూటీ చేయకుండా జగన్ రెడ్డి చెప్పినట్టు డ్యూటీ చేస్తే ఇబ్బందులు తప్పవు.
శివకు ఏదైనా జరిగితే పోలీసులు, ప్రభుత్వానిదే బాధ్యత. దీనిపై మానవహక్కుల సంఘం స్పందించాలి. శివపై దాడి చేసిన వెంకటగిరి సీఐ నాగమళ్లేశ్వరావుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక నుంచి అమరావతి రైతుల పట్ల పోలీసులు ఓవరాక్షన్ చేస్తే సహించేదీ లేదు. జగన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ లో కూర్చుని ఎన్ని కుట్రలు పన్నినా అమరావతి రైతుల పాదయాత్రను ఆపలేరు. వైసీపీ దుర్మార్గాలన్నీ ప్రజలు చూస్తున్నారు. సరైన సమయంలో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు.