-బీఆర్ఎస్ అంటే.. “బీజేపీకి రహస్య సమితి”
-బీఆర్ఎస్ అంటే బరాబర్ బీజేపీకి ‘బీ’టీం
-కేసీఆర్ కూతురు అడ్డంగా దొరికినా బేడీలు వేయని బీజేపీ
-విభజన హామీలపై మోడీని నిలదీయలేని బీఆర్ఎస్
-వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ట్వీట్
కేసీఆర్, బీజేపీ ఒక్కటికాదని చిన్నదొర నొక్కినొక్కి చెబుతుంటే..చిన్న పిల్లవాడు కూడా నమ్మడం లేదు పాపం. తెలంగాణలో లేని బీజేపీని పైకిలేపి, ఇన్నాళ్లు విమర్శలు గుప్పించిన కేసీఆర్..కొడుకు, కూతురు కేసులతో కథ అడ్డం తిరిగే సరికి బీజేపీతో జతకట్టాడు.కేసుల నుంచి బయట పడేందుకు కేంద్రం వద్ద మోకరిల్లాడు.
ఒక్కసారిగా కేసీఆర్ నాలుక బీజేపీ నుంచి ఇంకో పార్టీకి మళ్లింది.తొమ్మిదేండ్లుగా విభజన హామీలపై మోడీని నిలదీయలేని బీఆర్ఎస్..బీజేపీకి ‘బీ’ టీం కాదా?రాష్ట్రానికి వచ్చే నిధుల వాటా గురించి మాట్లాడలేని కేసీఆర్.. మోడీ తొత్తు కాదా?
కాళేశ్వరంలో కేసీఆర్ రూ.వేల కోట్లు తినేసినా కనీసం విచారణ చేయించని బీజేపీ..బీఆర్ఎస్ కు మద్దతు తెలిపినట్లు కాదా?లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు అడ్డంగా దొరికినా బేడీలు వేయని బీజేపీ..బీఆర్ఎస్ ను కాపాడుతున్నట్లు కాదా?
బీఆర్ఎస్ అంటే “బీజేపీకి రహస్య సమితి”. బీఆర్ఎస్ అంటే బరాబర్ బీజేపీకి ‘బీ’టీం.బీజేపీతో కేసీఆర్ చేస్తున్నది సమరం కాదు.. వ్యభిచారం.