– భట్టి విక్రమార్క చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తున్న
– రాజగోపాల్రెడ్డి పార్టీని నిలబెట్టారు
– పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి అధిష్టానం మంతి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని భట్టి విక్రమార్క చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తున్న. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ మాట్లాడే స్వాతంత్రం, స్వేచ్ఛ పార్టీ మాకు ఇచ్చింది ఈ స్వేచ్ఛ ఈనాటిది కాదు మొదటి నుంచి ఉన్నదే.
రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలను ఎవ్వరము తప్పు పట్టము. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు రాజ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి గెలిచాడు , ఎంపీగా గెలిచాడు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ లో గట్టిగా పని చేసే నాయకులు. నల్లగొండ జిల్లా అంటేనే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే నల్లగొండ జిల్లా. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి గట్టి నాయకులు అక్కడ ఉన్నారు.