Home » తెలుగుభాషకు రామోజీ సేవలు అనిర్వచనీయం

తెలుగుభాషకు రామోజీ సేవలు అనిర్వచనీయం

-తెలుగు ఉన్నంతవరకూ రామోజీ చిరస్థాయిగా ఉంటారు
-రామోజీ సంస్థ లో పని చేయడం వల్లే సమయ పాలన నేర్చుకున్నా
– బీజేపీ అధికార ప్రతినిధి, ఉషా సాహితీ పత్రిక సంపాదకులు ఆర్ డి. విల్సన్

అమరావతి: ఈనాడు సంస్థ లో పని చెయ్యడం వల్లే తాను సమయ పాలన గురించి నేర్చుకున్నాను అని బీజేపీ అధికార ప్రతినిధి మరియు ఉషా సాహితీ పత్రిక సంపాదకులు విల్సన్ @శరత్ చంద్ర అన్నారు.జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమావేశం లో ఒక అతిధి గా పాల్గొని మాట్లాడారు. ముందు రామోజీ రావు చిత్ర పటానికి పూలు వేసి అంజలి ఘటించారు.

ఈ సందర్బంగా ఆయన తన ఉపన్యాసం కొనసాగిస్తూ ప్రజా సమస్యలు ఎలుగెత్తి చాటడం లో ఈనాడు ముందు వరసలో ఉండేది అని, ఈనాడు లో తాను పని చేసిన కాలాన్ని,తన అనుభవాలు నెమరేసుకున్నారు. మద్య నిషేధ సమయం లో తాను పదిరోజులు పాటు వరుసగా రాసిన ఆర్థికల్స్ ను రామోజీ ప్రశంసించడం తన జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం అన్నారు.

ఆ రోజుల్లో విలువలు కోసం వారమన్నారు. అవినీతి అధికారులకు వ్యతిరేకంగా కలం ఝళి పించామన్నారు. ఇప్పుడు పతన విలువలు నడుస్తు న్నాయన్నారు. క్వాలిటీ జర్నలిజానికి రామోజీ పెట్టింది పేరు అన్నారు.రామోజీ స్ఫూర్తి తోనే ఉషా పత్రిక స్థాపించాను అన్నారు.

ఈ సందర్భంగా జాప్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈరోజు పత్రికల్లో పని చేసే వాళ్ళలో 90 శాతం ఈనాడు సంస్థ నుండి బయటకు వచ్చిన వారే అన్నారు. తాను కడపలో పనిచేసేటప్పుడు నికార్స్ గా సాక్షాదారాలతో కూడిన సంచలన వార్తలు ఇస్తే, ఈనాడు సంస్థలో ప్రచురించే వారు. అప్పట్లో ఇద్దరు మంత్రులకి ఉద్వాసన పలకడానికి తాను రాసిన వార్తలే కారణమని, జర్నలిస్టుకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం రామోజీ ఆలోచన విధానం అని అన్నారు.

ఒకటో తేదీ నాటికి జీతాలు ఇవ్వడం ఒక ఈనాడు సంస్థకే సాధ్యం అన్నారు. ఉద్యోగుల పట్ల స్పష్టమైన వైఖరితో ఉండడంతో పాటు, వారి వెల్ఫేర్ గురించి కూడా రామోజీ ఆలోచించేవారు అన్నారు.

మరో ముఖ్య అతిధి గా విచ్చేసిన తెలుగుదేశం నేత పట్టాభి రామ్ మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. తన కూతురు తో కూడా రోజూ అరగంట తెలుగు పేపర్ చదివిస్తున్నాను అన్నారు. తెలుగు భాషను పరిరక్షించడానికి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలు తీసుకెళ్లడానికి రామోజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

జగన్ రాక్షస ప్రభుత్వాన్ని దించడంలో జర్నలిస్టుల పాత్ర గణనీయమైందన్నారు. ఇటీవల ఫలితాలు వెలువడగానే తాను ముందు ఫోన్ చేసింది జర్నలిస్టులకే అన్నారు.

జనసేన నేత గాదే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో మార్పు కోసం వారి సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు నిరంతరం తపన పడుతుంటారని అన్నారు. రామోజీరావు తెలుగు వాడవడం గర్వకారణం అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి రామోజీ చేసిన ఎనలేని కృషిని, పవన్ కళ్యాణ్ ముందు కొనసాగిస్తాడన్నారు.

బిజెపి అధికార ప్రతినిధి బాజీ మాట్లాడుతూ.. జర్నలిస్టులు, కొవ్వొత్తిలా కరిగిపోతూ ప్రజల జీవితాల్లో మార్పు కోసం పని చేస్తున్నారన్నారు. ఎన్నో కష్టాలుకోర్చి ప్రజలకు సమాచారం ఇస్తున్నారన్నారు. సమావేశం లో జాప్ అధ్యక్షులు ఏ. రవితేజ, జనరల్ సెక్రటరీ ఆర్. వి. సత్య న్నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు వి.సత్య నారాయణ, లలిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply