-కచ్చితంగా కోర్టులో మార్గదర్శికి వ్యతిరేక తీర్పు వస్తుంది
-ఇప్పటికైనా రామోజీ తాను తప్పు చేసినట్లుగా ఒప్పుకోవడం మంచిది
-ఉండవల్లితో ముఖాముఖి
విజయవాడ: యూసీసీ బీజేపీ సిద్ధాంతం కాదు.రాజ్యాంగ మౌలిక స్వరూపంలోనే ప్రతిపాదన ఉంది. ఆర్ధిక అసమానతలను రూపుమాపేందుకు అప్పట్లో ఆ ప్రతిపాదన.పేదరికం ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ జన సంఖ్య ఎక్కువగా ఉంటుంది.యూసీసీ అవసరం లేదని 21వ లా కమిషన్ మోదీ ప్రభుత్వానికి సూచించింది.
22వ లా కమిషన్ కూడా జూన్ 24న తొందరపడి ముందుకెళ్లొద్దని సూచించింది. మేనరిక వివాహాలు చట్టప్రకారం చెల్లవు.. కానీ సంప్రదాయంగా వస్తోంది కాబట్టి అభ్యంతరం లేకపోతోంది. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలున్న మన దేశంలో యూసీసీ అమల్లోకి తేవడం సులువు కాదు. ప్రయత్నం మంచిదే కానీ, మిగిలిన అంశాలన్నీ పక్కనబెట్టి ఇప్పుడెందుకీ హడావిడి?
ఆర్ధిక అసమానతలను తొలగించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాలి. యూసీసీపై వైసీపీ, టీడీపీ విధానం బయటపెట్టాలి. యూసీసీపై ఆ రెండు పార్టీలు శ్వేతపత్రం విడుదల చేయాలి. జనసేన కూడా యూసీసీపై స్పష్టతనివ్వాలి. పార్లమెంటులో బిల్లు పెడితే రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు అనుకూలంగా ఓటు వేస్తాయి. సదరు పార్టీలు యూసీసీపై తమ విధానాన్ని ప్రజలకు వెల్లడించాలి. స్వప్రయోజనాల కోసం, అధికారమే పరమావధిగా వ్యవహరించడం సరికాదు.
సైద్ధాంతిక కాలుష్యం చాలా వేగంగా విస్తరిస్తోంది. ఈ జాడ్యాన్ని నివారించాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. యూసీసీపై విస్తృత చర్చ జరగాలి. చట్ట సవరణల ద్వారా క్రమబద్ధీకరించుకోవాలి తప్ప, యూసీసీ లాంటివి అవసరం లేదు.ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. నెంబర్ గేమ్ కోసమే బీజేపీ యూసీసీ బిల్లు ప్రతిపాదన చేస్తోంది.
డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి బాధ్యలెవరో తేల్చాలి. నిర్వాసితులకు ప్రకటించిన ప్యాకేజీ అమలుపై, ప్రాజెక్టు నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఒక కోటి 64 లక్షల కోట్ల అప్పులు చేసింది. కేంద్రం గురించి నోరెత్తే సాహసం ఎందుకు చెయ్యట్లేదు. రాష్ట్ర విభజన అసంబద్ధంగా జరిగింది. ఏపీ రెవెన్యూ లోటు భర్తీకి విభజన సమయంలోనే హామీ ఇచ్చి, నెరవేర్చలేదు. అన్ని ఇబ్బందులకు కారణం కేంద్ర ప్రభుత్వమే.. రాష్ట్రాల వాటా రాష్ట్రాలకు సక్రమంగా ఇస్తే సమస్యలుండవు.
మంచి రోజులు రావాలని కోరుకోవడం తప్ప చేయగలింగిందేమీ కనిపించడం లేదు విద్వేషాన్ని వ్యాపింపజేయడమే ప్రస్తుతం రాజకీయంగా మారింది.ఇన్నేళ్ల నుంచి పటిష్టంగా ఉన్న గొప్ప వ్యవస్థని నాశనం చేసే కుట్ర జరుగుతోంది.విద్వేష ప్రచారాలను తయారుచేసి ప్రజల్లోకి వదులుతున్న వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత మోదీపై ఉంది. గాంధీ, నెహ్రూలను కించపరిచేలా విద్వేష ప్రచారం చేస్తున్నారు.
గాంధీకి జాతిపిత బిరుదునిచ్చింది నేతాజీనే.గాంధీ-నెహ్రులతో నేతాజీకి సైద్ధాంతిక విబేధాలు తప్ప వేరే తగవులేమీ లేవు.