-దమ్ముంటే నన్ను అసెంబ్లీ కి రమ్మని చెప్పండి
-బీజేపీ కి RSS ఎలాగో ..కేసీఅర్ కి ఈ పోలీస్ లు అలాగా
-పోలీస్ లను కేసీఅర్ పనోళ్లుగా మార్చేశారు
-వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
ఇక నా మీద కేసులు పెడతారట…. నన్ను అసెంబ్లీ కి పిలుస్తరట.దమ్ముంటే నన్ను రమ్మని చెప్పండి.నడుచుకుంటూ వస్తా…కాలి నడకన వస్తా…తలెత్తుకొని వస్తా…ఎప్పుడు రమ్మంటారో చెప్పండి.మీరు డేట్ ఇస్తారా…నన్ను డేట్ తీ సుకోమంటారా..?అసెంబ్లీ లోపలకు రావాలా…అసెంబ్లీ ముందుకు రావాలా?అసెంబ్లీ ముందు కూర్చొని పబ్లిక్ గా మాట్లాడుత.పబ్లిక్ గా మాట్లాడుత.ఏమి అడుగుతారో నన్ను అడగండి. నేను ఏమి తప్పు మాట్లాడిన నో అడగండి.మీ అవినీతి గురించి …అక్రమాలు.. దౌర్జన్యాలు గురించి మాట్లాడుత.ఇక్కడ ఉన్నది పులి బిడ్డ.భయపడే రకం నేను కాదు.
నిరంజన్ రెడ్డి తల్లికి చెల్లికి తేడా తెలియదు అని మాత్రమే నేను అడిగా.ఈయనకు వీది కుక్క కు తేడా ఎంటి అని మాత్రమే అడిగా.మరదలు అని ఏ మహిళనైనా అనండి..చెప్పుతో కొడుతుంది.ఈ నిరంజన్ రెడ్డి కేసు పెడితే వెంటనే నాపై FIR ఫైల్ చేశారు.అదే నిరంజన్ రెడ్డి మీద మేము పిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు.మీరు అధికారం లో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా పిర్యాదు చేసుకోవచ్చా..?
పెట్టుకున్నారు కదా…కేసులు .దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసి చూపించండి.కేసీఅర్ కి సవాల్ విసురుతున్న… దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి.
వైఎస్సార్ బిడ్డ ఇక్కడ…. మీ బేడిలకు భయపడే రకం కాదు ఇక్కడ.మీ కేసులకు భయపడను…మీ బెదిరింపులకు భయపడను. ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయం తీసుకున్నా. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నా. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్ బిడ్డ నిలబడే ఉంటుంది.మీరు అవకాశం ఇచ్చిన రోజు నమ్మకంగా ముఖ్యమంత్రి స్థాయిలో సేవ చేస్తా.అవకాశం ఇచ్చే వరకు మీకోసమే పోరాటం చేస్తా. ముఖ్యమంత్రి బిడ్డను అయి ఉన్న నా ఫిర్యాదు నే తీసుకోలేదు.ఇక సాధారణ మహిళ పరిస్థితి ఏంటి?పోలీస్ లను కేసీఅర్ పనోళ్లు మార్చేశారు.బీజేపీ కి ఆరెస్సెస్ ఎలాగో ..కేసీఅర్ కి ఈ పోలీస్లు అలాగా.