సిమెన్స్ సంస్థతో కలిసి పనిచేసిన ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి కనిపించని అవినీతి జగన్ ప్రభుత్వానికే కనిపించడాన్ని ఏమనాలి?
• వ్యక్తిగత విద్వేషాలతో చంద్రబాబుకి కష్టం కలిగించారు కానీ, అంతిమంగా జగన్ ప్రభుత్వం రాష్ట్ర యువత జీవితాల్లో నిప్పులు పోసింది
• తమ తెలివితేటలతో తలరాత మార్చుకోవాలనుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాల యువత ఆశల్ని జగన్ సర్కార్ మొగ్గదశలోనే చిదిమేసింది
• అమెరికాలో 25 ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు 90 : 10 శాతం నిష్పత్తి ప్రకారమే సిమెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాయి
• అదే నిష్పత్తి ప్రకారం మన దేశంలో గుజరాత్, ఝార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలు చేశాయి
• ఆ నిష్పత్తి ప్రకారమే జర్మనీకి చెందిన సిమెన్స్ ఏజీసంస్థ కళాశాలలకు, స్కూళ్లకు, స్వచ్ఛందసంస్థలకు, అనేక ప్రభుత్వాలకు నిధులు అందించింది
• రాష్ట్రంలోని 40 శిక్షణా కేంద్రాల్లో అన్నిరకాల పరికరాలు.. సాఫ్ట్ వేర్ ఉన్నట్టు CITD నివేదిక ఉంది
• శిక్షణా కేంద్రాల ప్రిన్సిపాల్స్ తమకు అన్నిఅందాయనిచెబుతూ ఇచ్చిన లేఖలున్నాయి. శిక్షణా కేంద్రాల్లోని పరికరాలు సాఫ్ట్ వేర్ కు సంబంధించిన వీడియోలున్నాయి
• శిక్షణ పొందిన 2లక్షలమంది యువతకు ఇచ్చిన సర్టిఫికెట్లు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు కళ్లముందున్నారు
• ఏపీ ప్రభుత్వం అమలుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ను ప్రశంసిస్తూ కేపీఎంజీ, నీతి అయోగ్, సెంట్రల్ షిప్పింగ్ శాఖ ఇచ్చిన ప్రశంసాపత్రాలు ఉన్నాయి
• అవేవీ జగన్ ప్రభుత్వానికి, సీఐడీకి కనిపించవు.. ఎక్కడా జరగని, జరిగినట్టు చెప్పడానికి ఎలాంటి ఆధారాలులేని అవినీతి మాత్రమే కనిపిస్తుంది
• స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు మొదలు…తదనంతర పరిణామాలను అసెంబ్లీ ప్రాంగణంలో పాత్రికేయుల సాక్షిగా ఆధారాలతో సహా వాస్తవాలు ప్రజల ముందు ఉంచిన టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పయ్యావుల కేశవ్
“ గత 20 రోజలనుంచీ ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి అవాస్తవాలు… అసత్యాలు… అర్థసత్యాలను ప్రజలకు చెప్పడానికి నానా తంటాలు పడుతోంది. మొత్తం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ గురించి వివరించాలంటే 2, 3 గంటల సమయం పడుతుంది… కావున మొత్తం సమాచారాన్ని సంక్షిప్తంగా మీడియావారి సుముఖాన ప్రజలకు తెలియచేస్తున్నాం.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు.. దాని ఆవశ్యకత గురించి తెలుసుకునే ముందు గతంలోకి వెళ్లాల్సిన అవసరముంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరిం గ్ కళాశాలలు అనేవి అంత తేలిగ్గా అందుబాటులోకి రానివిగా కనిపించేవి. ఇంజనీరింగ్ చదవాలంటే కర్నాటక, గుల్బర్గా, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లాలనుకునే రోజుల్లో ఆనాడు అప్పుడప్పుడే కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్ర యువత అందిపుచ్చుకోవాలనే సత్సంకల్పంతో ఒకే ఒక్కపాలసీ నిర్ణయంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 350కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు రాష్ట్రానికి అందించారు.
ఇంజనీరింగ్ కళాశాల.. దానికి సంబంధించిన విద్య నేడు పెద్ద విశేషంగా కనిపించకపో వచ్చు గానీ, ఆనాడు అది చాలా విలువైనది.. గొప్పదని ప్రజలు, ముఖ్యంగా విద్యార్థు లు భావించేవారు. ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుచేసినందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకం టే ఆనాడు వారు ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరించారు. కానీ చంద్రబాబునాయుడు ఒక గొప్ప పాలసీ ఫ్రేమ్ వర్క్ తయారుచేసి, ఆ పాలసీ నిబంధనల ప్రకారం ఎవరు వచ్చినా అర్హులేనని స్పష్టం చేశారు.
నేడు చంద్రబాబునాయుడి అరెస్ట్ అక్రమమని నిరసిస్తూ రోడ్లపైకి వస్తున్న ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులంతా ఆనాడు చంద్రబాబు తీసుకొచ్చిన పాలసీ డెసిషన్ వల్ల ఉన్నతస్థానాల్లో నిలిచినవారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పై మేం చర్చకు పట్టుబడితే మాకు సినిమా చూపిస్తామని మంత్రులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు.
ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్ధతుగా ఆయన తప్పుచేయరని నినదిస్తూ ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి 3D లో సినిమా చూపిస్తున్నారు. చంద్రబాబు తీసుకున్న ఒక్కపాలసీ నిర్ణయం ఎంతమా ర్పు తీసుకొచ్చిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ తరహా విధానం కంటే మిన్నగా మరేదైనా గొప్పగా చేయాలని విభజనానంతర ఏపీలోని యువతను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు 2014లో ఆలోచించారు.
భావితరాలకు ఏది కావాలో దూరదృష్టితో ఆలోచించిన మేథావి చంద్రబాబు, దాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులు వీళ్లు
చంద్రబాబు నవ్యాంధ్ర యువత గురించి ఆలోచిస్తున్న సమయంలోనే సిమెన్స్ సంస్థ వారు వచ్చి గుజరాత్ లో తాము అమలుచేస్తున్న ప్రాజెక్ట్ గురించి చెప్పారు. చంద్రబా బులాంటి వ్యక్తి తమను గుర్తిస్తే, తమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని భావించి సిమెన్స్ సంస్థ వారే ఆయన వెంటపడ్డారు. వారి ప్రజంటేషన్ చూశాకే ఇక్కడి అధికారు ల్ని నాటి టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ అమలు తీరుతెన్నుల పరిశీలనకు గుజరాత్ పంపిం ది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనేది రాష్ట్రంలోని యువతకు కేవలం ప్లంబింగ్ … ఎలక్ట్రీషియన్… కార్పెంటర్ వంటి వృత్తులు నేర్పడానికి పెట్టింది కాదు.. సాంకేతిక పరిజ్ఞానంలో రాబోయే నెక్ట్స్ వేవ్ ను మన పిల్లలకు అందించాలనే ఆశయంతో మొద లు పెట్టింది.
ప్రపంచంలో వస్తున్న మార్పులు మనపిల్లలు అందింపుచ్చుకుంటే, ప్రపంచ వ్యాప్తంగా మనవారే అగ్రస్థానంలో ఉంటారన్న గొప్ప ఆశయంతో చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు శ్రీకారం చుట్టారు. ఇది నిజమని చెప్పడానికి రాజకీయాలకు అతీతంగా దీని గొప్పతనం వివరిస్తూ అబ్దుల్ కలాం గారు రాసిన లేఖే నిదర్శనం. ఇది అనుకున్నవిధంగా సమర్థవంతంగా అమలైతే భారతదేశంలోనే 50 కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పడంతో పాటు, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ శిక్షణ ను పదో తరగతి నుంచే ఇంప్లిమెంట్ చేయాలని కూడా కలాం గారు సూచించారు.
ఒక నెక్స్ట్ జనరేషన్ కు ఏం కావాలో ముందే విజువలైజేషన్ చేసిన మేథావి చంద్రబాబు నాయుడు అయితే, దాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు. వీళ్లు వ్యక్తిగత విద్వేషాలతో చంద్రబాబుకి కష్టం కలిగించారు కానీ, అంతిమంగా భర్తీ చేయలేని నష్టం జరిగింది రాష్ట్ర యువతకే.
మన యువత జీవితాల్లో ఈప్రభుత్వం నిప్పులు పోసింది. రైతులు, కూలీలు, చేతివృత్తిదారుల బిడ్డలు తమ తెలివితేటలతో తలరాత మార్చుకునేలా చేసే పరిజ్ఞానాన్ని చేజేతులా నాశనంచేశారు. యువతీ యువ కుల కలల్ని, వారి ఆశయాల్ని మొగ్గదశలోనే చిదిమేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనుకున్నట్టు సక్రమంగా అమలైతే ఇంజనీరింగ్ చదివిన వారితో పాటు.. పది, ఇంటర్, డిగ్రీ చదివిన యువతకు కూడా మంచి భవిష్యత్ ఏర్పడేది.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పెట్టారా.. 90 : 10 శాతం వాటా అనేది ఈ రాష్ట్రానికే పరిమితం చేశారా… అంటే, కానేకాదు. నేను దీనిపై కొంత పరిశోధన చేశాను. జర్మనీలో ఉండే సిమెన్స్ ఏజీ అనే సంస్థ … ప్రతి దేశంలో సిమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్ వేర్, డిజిటల్ సాఫ్ట్ వేర్ అమలు చేయాలని భావిం చి, రెండు.. మూడు అనుబంధ సంస్థలు ప్రారంభించారు. వారి పరిధిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని దేశాలకు అందించడంకోసం 90 : 10 నిష్పత్తి ప్రతిపాదన తీసుకొ చ్చారు.
ఆ నిష్పత్తి ప్రకారం సిమెన్స్ ఏజీసంస్థ నిధులు కళాశాలలకు, స్కూళ్లకు, స్వచ్ఛందసంస్థలకు, ప్రభుత్వాలకు అందిస్తున్నారు. నేను వ్యక్తిగతంగా కొనాలంటే కోటి రూపాయలు అయ్యే సాఫ్ట్ వేర్ ను కేవలం రూ.10లక్షలకే అందిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్ లో వారి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికే డిమాండ్ ఉండాలనే ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఇదే విధమైన ఆలోచనలతో ముందుకెళ్తుంటాయి.
జర్మనీ సిమెన్స్ ఏజీ సంస్థ అందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికాలో దాదాపు 25 ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు వినియోగించుకున్నాయి. ఆ విద్యాసంస్థలన్నీ 90 : 10 నిష్పత్తినే అనుసరించాయి. అలాంటప్పుడు అక్కడకూడా అవినీతి జరిగినట్టేనా? మనదేశంలో తొలుత గుజరాత్ రాష్ట్రంలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకొని, ఆ రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించారు. ఆ లెక్కన ఆ రాష్ట్రంలోకూడా అవినీతి జరిగినట్టేనా? తరువాత 5 రాష్ట్రాలు అమలు చే శాయి.. అవి కూడా అవినీతి చేశాయా? వీటన్నింటినీ మించి గవర్నమెంట్ ఆఫ్ ఇండి యాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ వారు 90 : 10 కింద ఈ ప్రాజెక్ట్ అమలు చేశారు.
ముంబైలో, విశాఖపట్నంలో ట్రైనింగ్ సెంటర్లు పెట్టి, షిప్ టెక్నాలజీపై శిక్షణ అందించా రు. దాని ఫలితాలు చూశాకే, షిప్పింగ్ శాఖ కార్యదర్శి కేంద్రప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. తాము అమలుచేసింది ఎంతో మంచి కార్యక్రమమని, కేంద్రప్రభుత్వంలో అనేక శాఖలు ఉన్నాయి కాబట్టి.. మినిమమ్ కాంట్రిబ్యూషన్ తో వాటిలో కూడా అమలయ్యే లా చేస్తే, అద్భుతమైన పరిజ్ఞానంతో కూడిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తయారుచేయవ చ్చని లేఖలో పేర్కొన్నారు.
ప్రపంచంలో ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి కనిపించని అవినీతి జగన్ ప్రభుత్వానికే కనిపించడాన్ని ఏమనాలి?
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ప్రపంచంలో ఏ దేశానికి, భారత ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు కనిపించని లోపాలు.. అవినీతి కేవలం జగన్ రెడ్డి ప్రభుత్వానికే కనిపించింది. కారణం ఏమిటంటే లేనిది ఉన్నట్టు ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి. ఫలానా వ్యక్తి జేబులోనుంచి ఫలానా వ్యక్తి 100 రూపాయలు తీస్తుంటే, ఫలానా వ్యక్తి చూశాడు….. ఆ సొమ్ము మరో వ్యక్తికి ఇదిగో ఇలా చేరింది.. ఇదిగో ఆ 100 రూపాయ లు అని చెప్పగల ఆధారాలు లేవు.
ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అనేది రికవర్ కావాలి. రికవర్ అయితేనే కేసు అనేది ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టు. కానీ ఈ ప్రభుత్వం ఆరోపిస్తు న్న స్కిల్ డెవల్ మెంట్ కేసులో రూపాయి బయటకు పోయినట్టు ఎక్కడా నిరూపణ కాలేదు.. అది తిరిగి టీడీపీనేతలకు వచ్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. ఇవేవీ లేకుండానే ముందు అరెస్ట్ చేస్తాం.. తరువాత విచారణ చేస్తామనే రివర్స్ ప్రాసెస్ ఈ ప్రభుత్వం అవలంభిస్తోంది. రివర్స్ టెండరింగ్ మాదిరే రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.
2014లో టీడీపీప్రభుత్వం వచ్చాక గుజరాత్ లో అమలవుతున్న స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పనితీరు పరిశీలనకు నలుగురు అధికారులతోకూడిన బృందం ఆ రాష్ట్రానికి వెళ్లింది. వారు తిరిగొచ్చి నివేదిక ఇచ్చాకే ఏపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెం ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జీవో ఇచ్చింది. 10-09-2014న కార్పొరేషన్ ఏర్పా టుకు సంబంధించి జీవోనెం : 47 విడుదలచేశారు. తరువాత 26-09-2014న జీవో నెం : 48ని హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ద్వారా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి నీలం సహానీ జారీ చేశారు.
ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొ రేషన్ కు అంకురార్పణ జరిగింది. సిమెన్స్ సంస్థ కార్యకలాపాలు భారతదేశంలో 1980 లనుంచే జరుగుతున్నాయి. 1997 తర్వాత వారి కార్యకలాపాలు మరింత విస్తృతమ య్యాయి. 2013లో గుజరాత్ ప్రభుత్వంతో పాటు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో నైపుణ్యా భివృద్ధికి సంబంధించిన ఒప్పందాలను సిమెన్స్ సంస్థ కుదుర్చుకుంది. ఫిబ్రవరి 09, 2015న ఒక ప్రజంటేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అమలుచేసినట్టే ఆంధ్రప్రదేశ్ లో కూడా స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించేందుకు సిమెన్స్ సంస్థ ప్రతిపా దనలు పెట్టింది.
రూ.546,84,18,908లతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని (COE), 5 టెక్నికల్ స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్స్ (TSDI) తో కూడిన 6 క్లస్టర్లను ఏర్పాటు చేస్తూ తొలుత గుజరాత్ ప్రభుత్వం జీవోనెం : 4 ను 30 జూన్ 2015 విడుదలచేసింది. ప్రతి క్లస్టర్ని సిమెన్స్ మరియు డిజైన్ టెక్ వారు సంయుక్తంగా గ్రాంట్ –ఇన్-ఎయిడ్ రూ. 491,84,18,908లు (90శాతం వాటా) తో పాటు ప్రభుత్వ వాటా రూ.55,00,00,000 లు (10శాతం) వాటాతో ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం ఆమోదించింది.
అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా నాటి రాష్ట్రప్రభుత్వం సిమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకొని స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలు ప్రారం భించింది. గుజరాత్ లో తొలుత ఒక క్లస్టర్ పెడితే, ఏపీలో 6 క్లస్టర్లు పెట్టాలని నిర్ణయిం చారు. దానిలో భాగంగా 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు, 34 టెక్నికల్ స్కిల్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్లతో మొత్తం 40 సెంటర్లు ఏర్పాటుచేశారు.
సెలక్షన్ అండ్ మానిటరింగ్ కమిటీల్లో నాడు సభ్యులుగా ఉన్న అధికారులే, నేడు జగన్ ప్రభుత్వంలో కీలకస్థానాల్లో ఉన్నారు. వారిని ఈ ప్రభుత్వం ఎందుకు విచారించడంలేదు?
ఇదంతా అనుకున్నాక ఊరికే ఏదో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు పెట్టామంటే పెట్టామని కాకుండా నాటి టీడీపీ ప్రభుత్వం కొందరు ఐ.ఏ.ఎస్ అధికారులతో సెలక్షన్ అండ్ మానిటరింగ్ కమిటీ కూడా వేసింది. దానిలో అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్, రవిచంద్ర, గంటా సుబ్బారావు, ఉదయలక్ష్మి, కే.లక్ష్మీనారాయణ, సిమెన్స్ సంస్థ ప్రతినిధి ప్రకాశ్ తోలే, డిజైన్ టెక్ ప్రతినిధి సచిన్ చౌగే ఉన్నారు. ఈ మానిటరింగ్ కమిటీ కంటే ముందు ప్రాజెక్ట్ తీరుతెన్నుల పరిశీలనకు గుజరాత్ వెళ్లిన కమిటీలో సభ్యులుగా ఎల్. ప్రేమచంద్రారెడ్డి, కే.సునీత, కే.లక్ష్మీనారాయణ, గంటాసుబ్బారావు ఉన్నారు. ఈ రెండు కమిటీల్లో కీలకంగా వ్యవహరించిన ప్రేమచంద్రారెడ్డి, అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కీలకస్థానాల్లో ఉన్నారు.
అవినీతి జరిగిందంటున్న ఈ ప్రభుత్వం వారిని మాత్రం ఒక్కసారి కూడా విచారించలేదు. అలానే గుజరాత్ వెళ్లిన కమిటీలో సభ్యురాలైన శ్రీమతి సునీత గారు తాను ఈప్రాజెక్ట్ వద్దంటే ప్రభుత్వం అమలుచేసిందని, వీళ్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆనాడు ఆమె వద్దని చెప్పలేదు.. చాలా స్పష్టంగా నోట్ ఫైల్ లో “ముందు ఒక సెంటర్ పెట్టి అమలు తీరు తెన్నులు చూశాక, మిగిలిన సెంటర్లు పెట్టాలి” అని తన అభిప్రాయం రాశారు. కానీ ఆమెపై అధికారి “మొత్తం రాష్ట్రంలోని యువతకు శిక్షణ అందాలంటే అనుకున్న విధంగా అన్ని సెంటర్లు పెట్టాల్సిందే” అని తన అభిప్రాయం వెలిబుచ్చారు. దానిలో వీళ్లకు అవి నీతి ఎక్కడ కనిపించింది? ఎక్కువ మంది యువతకు శిక్షణ ఇవ్వడం తప్పా?
శిక్షణా కేంద్రాల్లో అన్నిరకాల పరికరాలు.. సాఫ్ట్ వేర్ ఉన్నట్టు CITD నివేదిక ఉంది. శిక్షణా కేంద్రాల ప్రిన్సిపాల్స్ తమకు అన్నిఅందాయనిచెబుతూ ఇచ్చిన లేఖలున్నాయి. శిక్షణా కేంద్రాల్లోని పరికరాలు సాఫ్ట్ వేర్ కు సంబంధించిన వీడియోలున్నాయి… శిక్షణ పొందిన 2లక్షలమంది యువతకు ఇచ్చిన సర్టిఫికెట్లు ఉన్నాయి. కానీ ఇవేవీ ఈ ప్రభుత్వానికి కనిపించవు.
ఇక వీళ్లు చేస్తున్న ప్రధాన అభియోగం రూ.371కోట్లు కేటాయించారు…దానిలో కొంత సొమ్ము పక్కదారి పట్టిందని. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటయ్యాక గుజరా త్ ప్రభుత్వం తొలిరోజునే మొత్తం సొమ్ము చెల్లించింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలా చేయలేదు. నాడు నిధులు విడుదల చేసిన ఎల్.ప్రేమచంద్రారెడ్డి ముందుగా సిమె న్స్ , డిజైన్ టెక్ వారితో ఒకమాటన్నారు. ముందు ప్రాజెక్ట్ ఒప్పందం ప్రకారం 50శాతం నిధులుచెల్లించి తరువాత మిగిలినవి ఇస్తామన్నారు. దానిలో భాగంగా శిక్షణా కేంద్రాలకు మీరు అందించే పరికరాలు సాఫ్ట్ వేర్, తదితరాలు ఎంత విలువచేస్తాయో నాకు తెలియదు కాబట్టి, కేంద్రప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CITD) వారితో పరికరాలు, ఇతరాలను మదింపు చేయించి, తరువాత మిగిలిన 50శాతం నిధులు ఇస్తామన్నారు.
18 డిసెంబర్ 2015న ప్రాజెక్ట్ వ్యాల్యుయేషన్ కోరుతూ ప్రేమచంద్రారెడ్డి సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారికి లేఖరాశారు. ప్రాజెక్ట్ లోని ఒక్కో క్లస్టర్ నిర్వహణకు అవుతుందనుకున్న వ్యయం రూ.559.33కోట్లు సబబేనని నిర్ధారిస్తూ CITD వారు వ్యాల్యుయేషన్ నివేదికను 22 మార్చి 2016న సమర్పించారు. ఇదంతా సక్రమంగా జరిగాకే తరువాత 5 విడతలుగా సిమెన్స్ సంస్థ కు రాష్ట్రప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన నిధులు చెల్లించారు. CITD వ్యాల్యుయేషన్ నివేదికలో సర్వీసెస్ కు ఎంత.. డిజిటల్ కోర్సులకు ఎంత… సాఫ్ట్ వేర్ కు ఎంత… హార్డ్ వేర్ కు ఎంత అనే వివరాలు కూడా క్షుణ్ణంగా ఉన్నాయి.
ఈ ప్రభుత్వం తప్పు జరిగింది అంటున్న 40 సెంటర్లలో నట్లు, బోల్టులు సహా అన్ని పరికరాలు, సాఫ్ట్ వేర్ ను వీడియో తీయడం కూడా జరిగింది. ఒక్కో సెంటర్ వీడి యో నిడివి 30 నుంచి 40 నిమిషాలు ఉంటుంది. 40 సెంటర్లకు పరికరాలు, సాఫ్ట్ వేర్, ఇతరాలు మొత్తం అందించాక ఆయా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ నుంచి సర్టిఫికెట్ ఆప్ అసెట్ కంప్లీషన్.. హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ది అసెట్స్ కు సంబంధించి ధృవీకరణ పత్రాలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రిన్సిపాల్ సంతకంతో కూడిన ధృవీకరణ పత్రాలకు తోడు, ఆయాకేంద్రాల్లో తీసిన వీడియోలు కూడా ఉన్నాయి.
తరువాత యువత శిక్షణ పొందడం, సర్టిఫికెట్లు పొందడం.. ఉద్యోగాలు పొందడం కూడా జరిగింది. 2లక్షల మంది విద్యార్థులకు ఏ ఏకోర్సుల్లో ఎన్నాళ్లు శిక్షణ పొందారో తెలియచేస్తూ ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఈ వివరాలన్నీ టీడీపీ విడుదలచేసిన వెబ్ సైట్లో ఉంచాము. ఇంత జరిగినా ఈ ప్రభుత్వం నిరాధార ఆరోపణలతో డబ్బులు పోయాయని చెప్పడాన్ని ఏమనాలి? వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో గతంలో సొమ్ములు పోనాయ్ నానేటి సేత్తాను అన్న బొత్స సత్యనారాయణ కూడా దీనిపై మాట్లాడుతున్నాడు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఈ ప్రాజెక్ట్ ను వైసీపీ ప్రభుత్వం నాశనంచేయకుండా, సక్రమంగా నిర్వహిం చి ఉంటే, ఈ పాటికే మనరాష్ట్ర పిల్లలు ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ లెవల్లో ఉండేవారు.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ను ప్రశంసిస్తూ కేపీఎంజీ, నీతి అయోగ్, సెంట్రల్ షిప్పింగ్ శాఖ ఇచ్చిన ప్రశంసాపత్రాలు జగన్ ప్రభుత్వానికి, సీఐడీకి కనిపించవు 90 : 10 నిష్పత్తి ప్రకారం నిధులు చెల్లించడం దేశవ్యాప్తంగా జరిగింది దేశంలో ఎక్కడా తప్పుకానిది ఇక్కడెలా తప్పు అవుతుంది?
వైసీపీప్రభుత్వం వచ్చాక కూడా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్ 2021లో ప్రాజెక్ట్ ను డిజైన్ టెక్ సంస్థ అద్భుతంగా అమలుచేసిందని ప్రశంసిస్తూ అభినందనపూర్వక లేఖను కూడా ఇచ్చారు. లక్షలాది యువతకు శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందించి వారిని ఉద్యోగులకు సిద్ధం చేశారని కూడా ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అమలుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అద్భుతంగా ఉందని, అత్యుత్తమ ఫలితాలు వెలువడుతున్నాయని కేపీఎంజీ, నీతిఅయోగ్ వంటి విభాగాలు ప్రశంసించాయి.
నీతి అయోగ్ కేంద్రప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ అమలుచేయాలని సూచించింది. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ వారు తాము అమలుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో కూడా 90 :10 శాతం నిష్పత్తి ప్రకారమే నిధులు కేటాయించామని చెప్పారు. కేంద్రప్రభుత్వంలోని షిప్పింగ్ శాఖ వారు అయినా, గుజరాత్, ఝార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక అన్నిరాష్ట్రాలు అదే నిష్పత్తి ప్రకా రం నిధులు కేటాయించాయి. ఆయా రాష్ట్రాల్లో వేటికీ కనిపించని తప్పు జగన్ ప్రభు త్వానికి కనిపించింది. 90శాతం నిధులిచ్చి యువతకు శిక్షణ అందిస్తామంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు..కానీ వీళ్లు మాత్రం అదే తప్పంటున్నారు.
ఈ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అంటున్న వైసీపీప్రభుత్వ వాదనను, సీఐడీ చేస్తున్న పసలేని ఆరోపణలను హైకోర్టులో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే కూడా తీవ్రంగా ఖండించారు. జరుగుతున్న పరిణామాలను “రాష్ట్రప్రభుత్వ ప్రతీకార చర్య” గా ఆయన అభివర్ణించారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలై యువత శిక్షణపొంది, ఉద్యోగాలు పొందాక, అంతా అయిపోయా క నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మాట్లాడటాన్ని కూడా ఆయన హైకోర్టుకు తెలియచేశా రు.
అవినీతి జరిగితే సిమెన్స్ సంస్థను వైసీపీప్రభుత్వం, సీఐడీ ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదు… పాలకుల కుట్ర బట్టబయలు అవుతుందనా?
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగింది అంటున్న వైసీపీ ప్రభుత్వం సిమె న్స్ సంస్థను ఎందుకు ప్రతివాదిగా చేర్చి విచారించలేదు? సిమెన్స్ సంస్థ వస్తే ఇందులో ఏం జరిగిందో, ఈ ప్రభుత్వ కుట్ర ఏమిటో బట్టబయలవుతుంది. సిమెన్స్ సంస్థకు తెలి యకుండా రాష్ట్రప్రభుత్వంతో తానే ఒప్పందం చేసుకున్నాననే తప్పుడు ప్రచారాన్ని కూడా సుమన్ బోస్ ఖండించారు. నాకంటే ముందు ఏపీప్రభుత్వంతో ప్రాజెక్ట్ అమలు కు సంబంధించి జరిగిన అన్ని వ్యవహారాల్లో సిమెన్స్ ప్రతినిధులు పాల్గొన్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. డిజైన్ టెక్ సంస్థకు చెందిన వికాస కన్వేల్కర్ తమకు పరికరాలు అందించిన వెండార్స్ కు తాము ట్యాక్స్ లు చెల్లించామని, కానీ వాళ్లు వారి కింది వారికి చెల్లించడంలో కొంత గందరగోళం నెలకొందని, దాంతో జీఎస్టీ చెల్లింపుల సమస్య తలెత్తిందని స్పష్టంగా చెప్పారు.
ఈ వ్యవహారానికి సంబంధించి జీఎస్టీ చెల్లింపులు జరగలేదని 2017లో పెట్టిన కేసు నేటికీ రుజువు కాలేదు. డిజైన్ టెక్ సంస్థ తమకు పరికరాలు, సాఫ్ట్ వేర్ అందించిన 3, 4 సంస్థల్లో ఏదో ఒకసంస్థ జీఎస్టీ చెల్లింపు ల్లో సక్రమంగా వ్యవహరించకపోతే దానికి ఏపీ ప్రభుత్వానికి (నాటి టీడీపీప్రభుత్వం) ఏ మిటి సంబంధం? ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇసుక సరఫరాకు ఒకరితో, ఇనుము సరఫరాకు మరొకరితో, టైల్స్ వేయడానికి మరొకరితో, ఇలా ఒప్పందాలు చేసుకుంటే, వారిలో ఎవరో ఒకడు, వేరే ఎవరికో డబ్బులు చెల్లించకపోతే ఇంటి యజమాని బాధ్యు డు అవుతాడా? నేను చేసుకున్న ఒప్పందం ఏమిటి.. నేను అడిగిన మెటీరియల్ అను కున్న విధంగా, చెప్పిన క్వాలిటీ ప్రకారం అందించాడా లేదా అని మాత్రమే.
అలానే డిజై న్ టెక్ సంస్థ వారు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలకు ఒప్పందంలో పేర్కొన్న విధంగానే అన్నిరకాల పరికరాలు సాఫ్ట్ వేర్ అందించారు. డిజైన్ టెక్ సంస్థ తమ వెం డార్స్ కు చేసిన చెల్లింపులను ఈ ప్రభుత్వం షెల్ కంపెనీలు అని చెప్పడం ఎలాంటి వి ధానమో సీఐడీనే చెప్పాలి. ఈ విధంగా నాటి టీడీపీ ప్రభుత్వం ఏపీ యువత భవిష్యత్ కోసం సమర్థవంతంగా అమలుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ను.. జగన్ రెడ్డి తన కక్షసాధింపులకు బలిచేసి కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ గా మార్చాడు.
విలేకరుల ప్రశ్నలకు పయ్యావుల స్పందన…
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అంతా తామై సర్వం నడిపించిన అధికారులు ఎవరూ తప్పుచేయలేదని, రూ.370కోట్లు వెంటనే విడుదల చేయాలని చంద్రబాబునాయుడు ఒత్తిడిచేశారని ముఖ్యమంత్రి, సీఐడీ చెప్పడం విడ్డూరం. అందుబాటులోఉన్న నిధుల్ని ఏ ప్రాజెక్ట్ కు ఎంత కేటాయించాలి.. ప్రాధాన్యతా క్రమంలో దేన్ని తొలుత అమలు చేయాలని నిర్ణయించే అధికారం ముఖ్యమంత్రిది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ నా తొలి ప్రాధాన్యత అని చెప్పడం ముఖ్యమంత్రి ఛాయిస్. ఆయనతో పాటు ఆయన నిర్ణయా న్ని కేబినెట్ సహచరులు పరిశీలిస్తారు. దానిలో తప్పేముంది?
జగన్ రెడ్డికి విశాఖప ట్నం రుషికొండలో గెస్ట్ హౌస్ కట్టుకోవడం తన తొలిప్రాధాన్యత కావచ్చు. చంద్రబాబు కి రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం తొలిప్రాధాన్యత కావచ్చు. ఇలా ఎవరి ప్రాధాన్యతలు వారివి. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు నిధులు విడుదలచేసిన ఐ.ఏ. ఎస్ అధికారి పీవీ.రమేశే “ఇందులో ఎలాంటి తప్పు జరగలేదు” అన్నారు. గతంలో ఈ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వీ.సుబ్రహ్మణ్యం ఈ ప్రభుత్వం చేసిన దానితో “భవిష్యత్ లో ఏ అధికారి.. ఏ ముఖ్యమంత్రి తనకు తానుగా సొంత నిర్ణయాలు తీసు కోలేడు” అని చెప్పారు.
అందుకే 17 ఏ క్లాజ్ అమలుచేశారు. ఆ క్లాజ్ లో ఏముంది అంటే ఒకస్థాయి అధికారి తప్పు చేశాడని భావించి అతనిపై కేవలం విచారణ మాత్రమే జరపాలంటే, అతని కంటే పై అధికారి, లేదా అతనికి జీతమిచ్చే అధికారి అనుమతి తీసుకోవాలని స్పష్టంగా ఉంది. అలానే ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో నిజంగా తప్పు జరిగిందని భావిస్తే, కేబినెట్ తప్పుచేసిందని నిర్ధారణకు వస్తే, దానిపైనుండే వ్యవస్థ అయిన గవర్నర్ అనుమతి తప్పనిసరి.
వైసీపీప్రభుత్వం ఈ పనిచేసిందా? గవర్నర్ అనుమతి తర్వాతే విచారణ చేపట్టాల్సిన దాన్ని, వీళ్లకు నచ్చినట్టు చేయడం, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి, విచారించి ఆధారాలు సంపాదిస్తామని చెప్పడం ముమ్మాటికీ కక్షసాధింపే.” అని పయ్యావుల తేల్చిచెప్పారు.