Suryaa.co.in

Andhra Pradesh

అమెరికాలో ఎన్‌ఆర్‌ఐల ‘బాబుతో నేను’

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకించాలని టీడీపీ పార్టీ పిలుపునిచ్చింది. ‘బాబుతో నేను’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగం గా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల టాంపా నగరంలో NRI TDP టాంపా ఆధ్వర్యంలో ‘బాబుతో నేను’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నారై టీడీపీ టాంపా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువకులు,టీడీపీ సానుభూతిపరులు, ఐటీ ఉద్యోగులు తరలి వచ్చారు. ప్లకార్డులు ప్రదర్శన సాఫీగా కార్యక్రమం సాగిపోయింది.

చంద్రబాబు చేసిన తప్పు ఏంటి? అంటూ ప్రజలకు ప్లకార్డులు సందేశం ప్రదర్శసించారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలతో మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం నేరమా అంటూ ప్లకార్డులు సందేశం ప్రదర్శసించారు. కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం అంటూ పగలు, రాత్రి కష్టపడటం తప్పా?.. ప్రజా సమస్యలు కోసం రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీయడం అపరాధమా?.. అవినీతిపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పాపమా? రాజకీయ కక్షతో చంద్రబాబు గారిపై పెట్టిన కేసును ఖండిద్దాం.. తప్పుడు కేసులపై గళమెత్తుదాం.. జగన్ కుట్రను ఎండగడదాం.. ‘బాబుతో నేను’ అని చాటి చెపుదాం అని రాసి ప్లకార్డులు చేతబటార్రు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు చంద్రబాబు గారి మద్దతుదారులు ఎన్నారై టీడీపీ టాంపా కమిటీ సభ్యుల బృందాన్ని మనస్పూర్తిగా అభినందించారు. ఎన్‌ఆర్‌ఐ టిడిపి టాంపా కమిటీ ముందు నిలబడి దీనిని ని విజయవంతం చేసారు.

LEAVE A RESPONSE