హైకోర్టు తీర్పులోని అస్పష్టతపై ఉన్నత న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం

Spread the love

• చంద్రబాబుని నిర్దోషిగా నిరూపించి ప్రజలముందుకు తీసుకొస్తాం
టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, మంతెన రామరాజు

స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి ప్రభుత్వం తరుపున హైకోర్టులో వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కేసులో యాక్ట్ 17 (ఏ) వర్తిస్తుందని చెప్పి, చంద్రబాబు విషయంలో అది వర్తించదని చెప్పడం చూస్తే భారతదేశంలో తీర్పుతీర్పులకు మార్పులు ఎలా ఉంటాయనే సందేహం ప్రజలకు కలుగు తోందని టీడీపీ శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…!

“హైకోర్ట్ జడ్జిమెంట్ లోని పేజీ నెం -5 లో 2014-15 నుంచి 2018-19 వరకు సీఐడీ విచారణ జరిగిందని చెప్పారు. పేజీనెం-29లో ఈ కేసు విచారణ 2015 నుంచి అని మెన్షన్ చేశారు. అవకతవకలు 2019 మార్చి వరకు జరిగాయని ఫిర్యాదుదారు, ఫోరెన్సిక్ ఆడిట్ వారు చెప్పారు. అలాంటప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి 17 (ఏ) యాక్ట్ వర్తిస్తుందని మేము భావిస్తున్నాం. ఈ కేసువిచారణలో న్యాయమూర్తులు సరైన ధృక్ఫథంలో ఆలోచించలేదన్నది తమ అభి ప్రాయం. కాబట్టి ఈ కేసులో కిందికోర్టు ఇచ్చిన తీర్పులపై తాము ఉన్నత న్యాయ స్థానా లను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాం.” అని బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.

న్యాయస్థానాల్లో చంద్రబాబును నిర్దోషిగా నిరూపించి ప్రజలముందుకు తీసుకొస్తాం : ఏలూరి సాంబశివరావు
“టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై అక్రమ కేసు పెట్టి, ఆయన్ని దోషిగా చిత్రీకరించ డానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చించకుండా, తమకు మాట్లాడే అవకాశమివ్వకుండా వందలమంది మార్షల్స్ సాయంతో సభను నడపాలని ప్రయత్నించారు. ఆ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాపై తిట్లదండకం మొదలుపెట్టి, దౌర్జన్యకాండకు దిగారు. ఒక కల్పిత కేసుతో చంద్రబాబుపై బురదజల్లడానికి ఈ ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది.

ఎటువంటి ఆధారాలు.. సాక్ష్యాలు లేని కేసులో తమ అధినేత తరుపున హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. అయినప్పటికీ న్యాయవ్యవస్థపై తమకు ఉన్న అచంచల విశ్వాసం చెక్కుచెదరదు. ఉన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపిం చి, చంద్రబాబుని నిర్దోషిగా ప్రజలముందు ఉంచుతాం. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చాలామందికి ఇప్పటికే యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చాయి. అనేకమంది రిమాండ్ రిజక్ట్ అయ్యింది.

అలాంటి కేసులో చంద్రబాబుని 37వ ముద్దాయిగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం.. ఆయన్ని మానసికంగా వేధించడం, అసత్యాలు ప్రచారం చేయడం చేస్తున్నా రు. జగన్ రెడ్డి 38కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అవినీతి కేసుల విచారణకు హాజరు కాకుండా బయట తిరుగుతున్నాడు. వైసీపీప్రభుత్వ, జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలియచేసి, ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతాం.” అని సాంబ శివరావు తెలిపారు.

కక్షసాధింపుల్లో భాగమే ఒక కేసు తర్వాత మరో కేసు : మంతెన రామరాజు
చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై తాము అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెడితే, తమ కు మాట్లాడే అవకాశమివ్వలేదు. వైసీపీఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టారు. మా తీర్మానంపై చర్చించలేదు సరే.. కనీసం ప్రజల సమస్యలపై అయినా చర్చించారా అంటే అదీ లేదు. అటువైపు న్యాయస్థానాల్లో చంద్రబాబుకు బెయిల్ రాకూ డదని ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది.

ప్రభుత్వం తరుపున వాదించే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సీఐడీ చీఫ్ ప్రభుత్వ ఆదేశాలప్రకారమే పనిచేస్తూ, కక్షసాధింపుల కోసమే ఒక కేసు తర్వాత మరో కేసు వేస్తున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ పై మాట్లా డుతున్నారు… దాని అలైన్ మెంట్ మారింది అంటున్నారు. దానికంటే ముందు రాజధాని అమరావతికాదని మూడు రాజధానులని స్వలాభం కోసం ఇష్టమొచ్చినట్టు ప్రకటనలు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ప్రభుత్వంపై, అధికారులపై భూములిచ్చిన రైతులు ఎందుకు న్యాయస్థానాల్ని ఆశ్రయించకూడదు? ప్రజలు ఆశీస్సులతో చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారు.” అని రామరాజు ఆశాభావం వ్యక్తంచేశారు.

Leave a Reply