మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలని తపనతో నిద్రాహారాలు మాని పనిచేస్తున్న నా భర్తకి ఇచ్చే బహుమానం ఇదా?
ప్రజలంటే ఆయనకి పిచ్చి ప్రేమ
45 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా.. ఆయన ఉండేది మాత్రం జనం మధ్యనే
మా కుటుంబం కంటే ఎక్కువ సమయం ప్రజలతోనే ఆయన గడిపారు
నా కుటుంబ సభ్యులకు జగమంత కుటుంబం ఉందని మురిసిపోతుంటా
ఆ జనం మధ్య నుంచి మా పెళ్లి రోజునే నా భర్తను నిర్బంధించారు
మా ట్రస్టు ద్వారా మా నిధులతో ఇన్ని సేవలు అందిస్తున్న మేము అవినీతికి పాల్పడుతామా?
నా తండ్రి నా భర్త, నా కొడుకు తప్పు చేశారని వేలెత్తి చూపించే అర్హత లేని అవినీతి రాక్షసులు నా భర్తని అక్రమంగా అరెస్ట్ చేయించారు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి నారా భువనేశ్వరి బహిరంగ లేఖ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ నా నమస్కారాలు..
నా పేరు నారా భువనేశ్వరి
నా కన్నీటిని సిరాగా మార్చి మీ ముందు ఉంచుతున్నాను… ఇది నాకు వచ్చిన కష్టమని స్పందించటం లేదు. నాకు నష్టం జరిగిందని ఈ లేఖను రాయటం లేదు.. నిస్వార్థ ప్రజా సేవకులపై కక్ష సాధింపు ఆ వ్యవస్థలకే శ్రేయస్సు కరం కాదు… నా భర్త నారా చంద్రబాబు గారిపై తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టు చేసింది ఈ ఫ్యాక్షన్ ప్రభుత్వం. ప్రజలంటే ఆయనకి పిచ్చి ప్రేమ.. రాష్ట్ర అభివృద్ధి మరియు భావితరాలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలని తపనతో దశాబ్దాలుగా నిద్రాహారాలు మాని పనిచేస్తున్న నా భర్తకి ఇచ్చే బహుమానం ఇదా?
అభివృద్ధి పనులు ప్రారంభమే మా వారికి పండుగ ప్రజలకు సంక్షేమం అందించటమే ఆయనకు సంబరం 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ఉండేది మాత్రం జనం మధ్యనే.. ఆ జనం మధ్య నుంచి మా పెళ్లి రోజునే నా భర్తను నిర్బంధించారు. ఆయన కర్మయోగి గెలుపు ఓటమిలో ఆయన కార్యదక్షని, కార్యదీక్షని సడలించలేవు. కుట్రలు, కుతంత్రాలు ఆయన లక్ష్యాన్ని మార్చలేవు… తప్పుడు కేసులు అక్రమ అరెస్ట్ లు కోట్లాది ప్రజల నుంచి ఆయనను దూరం చేయలేవు… నిజాయితీకి నిలువెత్తు రూపమైనా నా భర్త చంద్రబాబు గారి కోసం కోట్లాది అభిమానులు తల్లడిల్లారు.. మీ మద్దతు మాకు కొండంత బలం.. మా కుటుంబం కంటే ఎక్కువ సమయం ప్రజలతోనే ఆయన గడిపారు.
ప్రజలే ఆయనకు దేవుళ్ళు రాష్ట్రమే ఆయన ఇల్లు.. జనం కోసం పుట్టాడు జనం కోసమే బ్రతుకుతున్నాడు జనం మనిషిని కాపాడుకోవాల్సిన బాధ్యత జనం పైనే ఉంది.. తెలుగు వారందరూ అన్నగారు అని ఆప్యాయంగా పిలుచుకునే ఎన్టీఆర్ గారి కుమార్తెను, విజనరీ లీడర్ గా ప్రపంచ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న నారా చంద్రబాబునాయుడు గారి భార్యని, విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి వరల్డ్ బ్యాంకులో కొలువులు వదులుకొని తాత తండ్రి బాటలో ప్రజాసేవకై అడుగులు వేసిన యువ గళం నారా లోకేష్ తల్లిని… నా తండ్రి ముఖ్యమంత్రి, నా భర్త ముఖ్యమంత్రి, నా కొడుకు మంత్రిగా చేశారు. ఈ ముగ్గురి హాయంలో నేను కాదు నా కుటుంబ సభ్యులలో ఒక్కరో కూడా మా సొంతానికి ప్రభుత్వాన్ని, అధికారాన్ని వాడుకోలేదు. ఒక రూపాయి లబ్ధి పొందలేదు.
నా తండ్రి మహానాయకుడు ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవం పతాకం అయితే నా భర్త చంద్రబాబు తెలుగుజాతి కీర్తి కిరీటం. తెలుగు ప్రజల సేవకు ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ అంకితమయ్యారు.. నా కుటుంబ సభ్యులకు జగమంత కుటుంబం ఉందని మురిసిపోతుంటాను… దశాబ్దాలుగా నా భర్త చంద్రబాబు ఆశా, శ్వాస ప్రజలే…దేశ రక్షణ కోసం చాలామంది తమ పిల్లలని పంపిస్తార.. నేను రాష్ట్ర రక్షణకి ప్రజాసేవ కి నా భర్త, కొడుకుని త్యాగం చేశాను నేను రాజకీయాలకు దూరంగా ఉంటూ నాకు చేతనైన సేవలు ప్రజలకు అందిస్తున్నా.
ప్రకృతి విపత్తుల సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా సహాయం చేశాను ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా వేలాది మంది నిరుపేదలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాము.. బ్లడ్ బ్యాంకు ద్వారా ప్రతిరోజు వేలాది ప్రాణాలను నిలుపుతున్నాము.. నా సోదరుడు బాలకృష్ణ మా తల్లిగారి స్మారకార్థం నిర్మించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకి పునర్జన్మ ప్రసాదిస్తున్నాము. ఉపాధి శిక్షణ అందిస్తున్నాము.ఉద్యోగాలు కల్పిస్తున్నాము. నిస్వార్ధంగా ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా మా ట్రస్టు ద్వారా మా నిధులతో ఇన్ని సేవలు అందిస్తున్న మేము అవినీతికి పాల్పడుతామా..?
నా తండ్రి నా భర్త, నా కొడుకు తప్పు చేశారని వేలెత్తి చూపించే అర్హత లేని అవినీతి రాక్షసులు నా భర్తని అక్రమంగా అరెస్ట్ చేయించారు.. నా కొడుకు పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.. ఈ విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తెలియనివి కావు… చంద్రబాబు లాంటి అరుదైన ప్రజాసేవకున్ని కాపాడుకుందాం మీ భవిష్యత్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన దార్శినికుడు…. ప్రజాస్వామ్య ప్రేమికుడు చంద్రబాబు గారికి అండగా నిలబడాలని కోరుతున్నాను.
ఇట్లు
నారా భువనేశ్వరి