సమాజంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు అవకాశం వస్తే, సమాజాన్ని (కొంతమంది) వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం సహజంగా జరుగుతుంది. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం కూడా చట్ట ప్రకారం అదే దారిలో పయనిస్తుంది. ఇది మనకందరికీ తెలిసిన విషయమే .
అదలా ఉంటే ఈరోజు జరిగిన సంఘటన గురించి …ముఖ్యమంత్రి జూన్ 14న శ్రీ సత్య సాయి జిల్లాలో చెన్నె కొత్తపల్లి బహిరంగ సభలో పాల్గొన్నారు .ప్రకాష్ అనే కానిస్టేబుల్ అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో అమరవీరుల స్తూపం వద్ద.. మాకు రావలసిన బకాయిలు చెల్లించాలంటూ ప్లే కార్డు ప్రదర్శించారు. అదే వారు చేసిన తప్పు. ఏపీ సీఎం జగన్ సార్ ,సేవ్ ఏపీ పోలీస్ గ్రాంట్ , ఎస్ ఎల్ ఎస్, ఏఎస్ఎల్ఎస్ ఎరియర్స్ ప్లీజ్ అని ప్లే కార్డు రూపంలో సమాజానికి తెలియజేశారు. వెంటనే ప్రభుత్వం పోలీసులకు రావాల్సిన బకాయిలన్నీ ఆరోజే చెల్లించడం జరిగింది .పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సంతోష పడ్డారు. ప్రకాష్ ను అభినందించారు కూడా.
అయితే 2019లో జూన్ 22న గ్రీవెన్స్ డే కు వచ్చిన ఒక మహిళ బి . లక్ష్మి తో, ప్రకాష్ పరిచయం పెంచుకొని.. ఆమె నుంచి పది లక్షల నగదు ,30 తులాలు బంగారం తీసుకున్నారని డిపార్ట్మెంట్ విచారణ జరిపి అతనిని డిస్మిస్ చేశారు . ప్రభుత్వం పని చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు 1,50,000 కోట్లు వరకు బాకీలు ఉన్నాయని సి ఎఫ్ ఎం ఎస్ ద్వారా తెలుస్తుంది . అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల టి ఏ లు ,డిఏలు వేలకొట్లే బాకీలు ఉన్నాయి .ఆ మధ్యన ప్రభుత్వం ఉద్యోగస్తుల పిఎఫ్ ను వాడుకున్న సందర్భం మనం చూసాం . ప్రభుత్వం వారికి ఇవ్వవలసిన బాకీలు సక్రమంగా ఇచ్చి ఉంటే, ఎవరు ప్రభుత్వాన్ని నిందించే పనిలేదు. అడిగే అవసరం లేదు .కోర్టులకు పోయే పని అంతకన్నా లేదు.
ఈ తప్పు ఎవరిది అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మరి బకాయిలు ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు.. మీకు అధికారం ఉందని అతనిని వేరే తప్పు వెతికి డిస్మిస్ చేశారు కదా! మరి ఏదో ఒక రకమైన కేసులు,ఇదే కోవకు వచ్హిన తప్పులు ఉన్న ఉద్యోగస్తులందరినీ, శాఖ పరమైన విచారణ జరిపి డిస్మిస్ చేస్తారా? దైర్యం ఉందా. ! పోలీస్ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయొ చూడాలి.
ప్రకాష్ మీద ఆరోపణలు నిజమైతే ఎవరూ సహించరు. కానీ అంతకన్నా . పెద్ద పెద్ద తప్పులు చేసిన(ప్రభుత్వం వల్ల రక రకాలుగా ఇబ్బందులు పడుతున్నవారు) ప్రభుత్వము మీద ఎవరు చర్యలు తీసుకోవాలి. అన్ని శాఖల కంటే పోలీస్ శాఖ లోనే ప్రజలను లోబరుచుకుని, వ్యక్తిగత అవసరాలకు వాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది జగమెరిగిన సత్యం . కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో చిట్ట చివరి ఉద్యోగం కానిస్టేబుల్. సాధారణంగా చూస్తే ఎక్కువగా అవసరపడేది, అవసరముండేది, కష్టపడేది, నిందలు భరాయించేది వారే.
మరి వారిలో జరిగిన ఈ సంఘటనను వ్యక్తిగతంగా భావించి, వారు ప్రభుత్వం మీద బయటకు చెప్పకపోయినా, సరిగా సహకరించని రోజున ( గతంలో విజయవాడలొ ప్రభుత్వ ఆంక్షలు ఉన్న బ్యారికేడ్లు దాటుకొని ఉద్యమకారులు రోడ్డు మీదకు వస్తున్నా పోలీసులు నిశ్చేష్టులుగా , కిమ్మనకుండా ఉన్న విషయం మనం మరిచిపోలేదు) ప్రభుత్వం ఏమవుతుందో కూడా ఆలోచించాలి .

బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877