Suryaa.co.in

Andhra Pradesh

ఫోన్ ట్యాపింగ్ పై సొంతపార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు?

– ప్రతిపక్షనేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్న ఈ ప్రభుత్వం ఫాసిస్ట్ ప్రభుత్వం.
• ఫోన్ ట్యాపింగ్ కుపాల్పడుతున్న ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలి
• ట్యాపింగ్ వ్యవహారంలో కీలకసూత్రధారి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వెంటనే తనపదవికి రాజీనామా చేయాలి
• ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతిక విలువులున్నా, ప్రజాస్వామ్యవిరుద్ధంగా తనప్రభుత్వంలో జరిగిన దానికి బాధ్యత వహిస్తూ, తనపదవికి రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది
• అవినాశ్ రెడ్డి వ్యవహారంలో చట్టం గెలుస్తుందో, ముఖ్యమంత్రి చుట్టరికపు బలం గెలుస్తుందో చూద్దాం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

టీడీపీఅధినేత చంద్రబాబుసహా, ప్రతిపక్షనేతల ఫోన్లు ట్యాప్ చేసే అధికారం, హక్కు ఈ ప్రభు త్వానికి ఎవరిచ్చారని, ఫోన్లు ట్యాప్ చేయడంలేదంటూ ఇన్నాళ్లుగా బుకాయిస్తున్న జగన్ సర్కార్, వైసీపీఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతుందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య నిలదీశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …

ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న ఈ ప్రభుత్వం.. మురికి ప్రభుత్వం, ఫాసిస్ట్ ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేస్తోంది. ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు, అన్నిపార్టీల ముఖ్యనేతల ఫోన్లు ట్యాపింగ్ లో పెట్టింది. ప్రతిపక్ష నేతల సంభాషణలు వినే అధికారం మీకు ఎవరిచ్చారు? ఏ అధికారంతో ఇలాంటి పను లు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని మేం మూడేళ్లుగా గగ్గోలుపెడుతున్నా, పాలకుల్లో స్పందనలేదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న ఈ ప్రభుత్వం మురికిప్రభుత్వం, ఫాసిస్ట్ ప్రభుత్వం. సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి, ఇంటిలి జెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు దీనిపై సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలన్న కుతూహలం సజ్జలకు ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూకూడా ఫోన్లు ట్యాప్ చేయలేదు. పెగాసస్ వ్యవహారంపై ఈ ప్రభుత్వం కొండ ను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయింది. ఫోన్లు మాట్లాడుకునే అవకాశం లేకుం డా, ప్రతిపక్షనేతల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నారో సమాధానం చెప్పాలి?

ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నైతికబాధ్యత వహిస్తూ, ఏమాత్రం నైతికవిలువలున్నా ముఖ్యమంత్రి తక్షణమే తనపదవికి రాజీనామా చేయాలి
ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని తాము అనడంలేదు. సాక్షాత్తూ వైసీపీఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డే, తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. “నా ఫోన్ 8 నెలల నుంచి ట్యాప్ చేస్తున్నారు, అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు ఇలాంటివి చేస్తారుకానీ, వైసీపీ ఎమ్మెల్యే అయిన నాపై నిఘాపెట్టడం ఏమి టి, ఇప్పటికే 11 సిమ్ లు మార్చాను”, అని శ్రీధర్ రెడ్డి వాపోయాడు. శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇదేమీ ఆషామాషీ విషయం కాదు. శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలకు నైతిక బాధ్యతవహిస్తూ, ఏమాత్రం నైతిక విలువలు ఉన్నాకూడా ముఖ్యమంత్రి తక్షణమే తనపదవికి రాజీనామాచేయాలి. అలానే ఫోన్ ట్యాపింగ్ జరు పుతున్న ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల్ని ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేయాలని, ఈ వ్యవహారంలో కీలకసూత్రధారి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి తక్షణమే సలహాదారు పదవినుంచి దిగిపోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఇంటిలిజెన్స్ చీఫ్ కి ఫోన్ ట్యాపింగే పెద్ద పని అయిపోయింది. చంద్రబాబు అలా మాట్లాడాడు… ఇంకొకా యన ఇలా మాట్లాడాడని ముఖ్యమంత్రి చెవికొరకడమే ఆయనకు పనిగా మారింది. మా ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేం అరెస్ట్ అయి జైల్లో చిప్పకూడు తిన్నవాళ్లమా?.. ప్రతిశుక్రవారం కోర్టుకు వెళ్లేవాళ్లమా.. పరిస్థితులు అటూఇటూ అయితే మరలా జైలుకెళ్లేవాళ్లమా?

ప్రతిపక్షనేతల ఫోన్లు ట్యాప్ చేస్తే ఏమొస్తుంది.. ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేయండి… జగన్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా, అవినాశ్ రెడ్డిని కాపాడలేడు
ప్రతిపక్షనేతల ఫోన్లు ట్యాప్ చేస్తే ఏమొస్తుంది.. చేస్తే ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేయండి. సీతారామాంజనేయులుకి తనవృత్తిపట్ల నిబద్ధత ఉంటే, ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేసి, ఆయన ఎందుకు ఢిల్లీ వెళ్తున్నాడో చెప్పాలి. అధికారిక పనిమీదనో, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికో, దౌత్యవేత్తలతో మాట్లాడటానికో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లడంలేదు. వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ను ఏ శక్తి తప్పించలేదని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి ఎంత ప్రజాధనం వృథా చేసి, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా కూడా తన సోదరుడు అవినాశ్ రెడ్డి అరెస్ట్ ను ఆపలేడని ఛాలెంజ్ చేస్తున్నా. అవినాశ్ రెడ్డికోసం అవసరమైతే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు. ప్రజల ఓట్లతో గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ పాదుషాల పాదాలముందు మోకరిల్లచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీయాత్ర, అవినాశ్ రెడ్డి కోసమేనని వైసీపీవారే నర్మగర్భంగా చెబుతున్నారు. కాదని ముఖ్యమంత్రి చెప్పగలరా? ఎందుకంటే అవినాశ్ రెడ్డి నేరస్తుడు. తాను దొరికిపోతాననే హత్యజరిగిన నాడు సాక్ష్యాధారాలు మాయం చేయడానికి ప్రయత్నించాడు. వివేకాహత్యకేసు గురించి ఇంకా తెలియాలంటే ముఖ్యమంత్రి ఫోనే ట్యాప్ చేయాలి.. ఢిల్లీవెళ్లి ఎవరితో, ఏం మాట్లా డాడో బయటపెట్టాలి. అవినాశ్ రెడ్డి వ్యవహారంలో చట్టం గెలుస్తుందో, ముఖ్యమంత్రి చుట్టరికపు బలం గెలుస్తుందో చూద్దాం. ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ ను తక్షణమే నిలిపేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఎదుటివారి వ్యక్తిగత వివరాలు తెలుసుకోవ డానికి ఈ ప్రభుత్వానికి ఏం హక్కుంది? ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం, పారదర్శకత లేని ప్రభుత్వం. దొంగచాటుగా ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు న్న ఈ ప్రభుత్వానికి ప్రజల్ని పాలించే అర్హతలేదు.” అని రామయ్య స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE