Suryaa.co.in

Telangana

నువ్వు చేసేది పాదయాత్ర కాదు.. పాపపు యాత్ర..పశ్చాత్తాప యాత్ర!

– హైదరాబాద్ లో ఇల్లు కూలగొట్టి వలిగొండలో పాదయాత్ర చేస్తావా?
– దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా పాదయాత్ర చేయాలి
– సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి సవాల్

హైదరాబాద్: రేవంత్ రెడ్డి చేసేది పాదయాత్ర కాదు. ముందు యాదగిరి నరసింహ స్వామి దగ్గరికి రేవంత్ రెడ్డి మొకాళ్ళ యాత్ర చేయాలి. అయినా నువ్వు చేసేది పాదయాత్ర కాదు పాపపు యాత్ర, ప్రాయశ్చిత్త యాత్ర, పశ్చాత్తాప యాత్ర. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణా ప్రజలకు ప్రతినిధి గా ఉంటూ ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తా అని రైతులకు హామీ ఇస్తూ.. ఏకంగా లక్ష్మి నరసింహ స్వామీ మీద ఒట్టేసిండు.

రాజ్యాన్ని పాలించే రాజు ఒట్టేసే మాట తప్పితే, ఆ ప్రభావం, ధైవాగ్రహం ప్రజల మీద పడ్తది. అందుకే, తెలంగాణ ల గత వర్షాకాలం వర్షాలు ఆలస్యంగా పడ్డాయి. ములుగు అడవులు కూడా ఎన్నడూ జరగని విధంగా విధ్వంసం అయ్యాయి. ధామగుండం లో చెట్లు పోతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నాశనం అయింది. రియల్ ఎస్టేట్ రంగం, వ్యాపారాలు, కొనుగోలు అమ్మకాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి, మార్కెట్లో రూపాయి తిరిగే పరిస్థితి లేదు.

మూసి పుట్టిన వికారాబాద్ లో అసువులు ధ్వంసం చేసి మూసి ప్రవహించే హైదరాబాద్ లో ఇల్లు కూలగొట్టి వలిగొండ లో పాదయాత్ర చేస్తావా? అయినా పాదయాత్ర చేయాల్సింది రైతుల కల్లాల కాడికి, ఛిద్రమైన మా పోచంపల్లి చేనేతల మగ్గాల కాడికి, నిత్యం ఆసుపత్రుల పాలవుతున్న మా గురుకుల విద్యార్థుల దగ్గరకి.

ప్రజల మద్దతు ఉంటే మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి , కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ను, ఇతర నాయకులను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నావ్? ప్రజల నిలదీస్తారని ఈ కథలు పడుతున్నావ్. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా పాదయాత్ర చేయాలి.

LEAVE A RESPONSE