అప్పు చేసైనా
మొబైల్ కొనేది
వాట్సాప్పు కోసమే..
అలాంటి ఆ వాట్సాప్పే ఆగిపోతే..
అవని స్తంభించిపోదా..
సమాచార విప్లవం..
ఆరిపోయే దీపం..
మానవ జీవితం
సువాసన కొరవడే ధూపం!
అకస్మాత్తుగా
వాట్సాప్పుకు బ్రేకు
ఎంత బెంగ..
ఇంకెంత కలవరం?
అన్నీ మిస్సు..
వాటితో పాటు పక్కనే
మిసెస్సు కస్సు బస్సు కూడా!
అఫ్కొర్స్..ఆమె కూడా
అదే బాధలో..
అయినా నీకే వాట్సప్ పిచ్చి
అంటూ ఓ నొక్కుడు..
ఒకటే సణుగుడు..!
ఫార్వర్డులు..గాసిప్పులు..
సెటప్పులు..క్లిప్పులు..
మద్దిమద్దిలో తప్పులు..
అన్నిటికీ విరామమా..
ఆగి ఆగి చెకింగు
ఇంకా రాలేదని నిట్టూర్పులు..
వచ్చేసిందని సంబరం..
పోయిన మనిషి
బ్రతికి వచ్చినట్టు..
ఉన్న ప్రాణం లేచివచ్చినట్టు..!
అతిగా ఫేస్బుక్కు
వాడే మగాడు..
అతిగా వాట్సాప్పు చూసే
ఆడది సుఖపడినట్టు
చరిత్రలో లేదు..
ఇది గుర్తు పెట్టుకో!
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286