– సంపద సృష్టి అంటే పెన్షన్లకూ అప్పులు చేయడమేనా?
– క్యూఆర్ కోడ్ ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి
సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ లో ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం లో మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు
విజయవాడ: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని గుర్తుకు చేస్తూ…. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని మాజీ శాసనసభ్యులు, మాజీ ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ వైయస్సార్ సీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు సెంట్రల్ నియోజకవర్గం లో ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ’ లో కార్యక్రమంలో భాగంగా మంగళవారం 60వ డివిజన్ లో ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్బంగా బాబు మోసాలను వివరిస్తూ వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ను వీడియో రూపంలో ప్రదర్శించారు.అనంతరం డివిజన్ నాయకుల, కార్యకర్తల సమక్షంలో క్యూఆర్ కోడ్ ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గం లో 3 క్లస్టర్స్ లో విస్తృతంగా తీసుకెళ్లామన్నారు.
చంద్రబాబు పాలనలో ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి,జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తాననీ చెప్పి, 2024 జూలై నుంచి ప్రజల అందరికీ అకౌంట్ లో డబ్బులు పడతాయని చెప్పి మోసం చేశారన్నారు.అనేక వాగ్దానాలు చేసి ప్రజల మీద అధిక పన్నులు వేసిన ఘనత ఒక చంద్రబాబుదేనన్నారు.
ప్రజల చేత ఓటీపీలు, మిస్డ్ కాల్స్, కరెంటు చార్జీలు, బాండ్స్ చెప్పారని అవన్నీ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.ఈ సంవత్సర కాలంలో సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు చేయలేదని, కేవలం ప్రజలను మభ్యపెడతానికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారని ఎద్దేవా చేశారు.
ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు 7వేల కోట్ల రూపాయలు అప్పుతెచ్చి పెన్షన్లు ఇచ్చారని ఎద్దేవ చేశారు. జగన్ హయాంలో ఈ ఐదు సంవత్సరాలలో 60వ డివిజన్ లో హాస్పటల్ కట్టాం, సచివాలయం బిల్డింగ్ కట్టాం, వాటర్ లైన్లు ఏర్పాటు చేశాం, 10 కోట్ల రూపాయలతో సెంట్రల్ పార్క్ కూడా నిర్మించామనీ అక్కడ బస్టాండ్ కు స్థలాన్ని కేటాయిస్తూ జీవో కూడా తీసుకొచ్చామని తెలియజేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బస్టాండ్ తీసేసి చేపల మార్కెట్ పెడతానని చెబుతుంటే తెలుగుదేశం పరిపాలన తీరు ఎలా ఉందో అందరికీ అర్థం అవుతుందని చెప్పారు.
జగన్ హయంలో ఈ డివిజన్లో ఆసరా పథకం క్రింద 2,174 మందికి 7కోట్ల 14లక్షల రూపాయలను, అమ్మ ఒడి క్రింద 2,344 మందికి 7కోట్ల 59 లక్షల రూపాయలను, చేదోడు కు 23లక్షల రూపాయలను, ఇలా అనేక పథకాలు ఇచ్చామని మొత్తం 18,231 మందికి 56 కోట్ల 69లక్షల రూపాయలు ఇచ్చామని తెలియజేశారు. ప్రతి డివిజన్లో నవరత్నాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేశామని ప్రతిదీ సచివాలయంలో రికార్డు ఉందని తెలిపారు. ఈ ప్రభుత్వం హయంలో మొదటి సంవత్సరంలోనే ఈ డివిజన్ లో 10కోట్లను నష్టపోయారని చెప్పారు. అదే జగన్ ఉండి ఉంటే ఈ 10 కోట్ల రూపాయలు ఈ డివిజన్ ప్రజలకు అందేవని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజా రెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ డి బాబు, జిల్లా కార్యదర్శి ఇస్మాయిల్, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు హరేంద్ర, క్లస్టర్ అధ్యక్షులు ఏసు, ఫాతిమా, సిరి శెట్టి రాజా, ఫణి, షేర్ అలీ, అన్నపురెడ్డి స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.