-హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలి !
-మరుగు దొడ్లకూ దిక్కు లేదా ?
-బిజెపి-వైసిపి పాలక ప్రజావ్యతిరేక ద్వంద వైఖరి విధానాలను తిప్పి కొట్టండి
-ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
అరకు : మహిళా డిగ్రీ కళాశాలలో వసతులు కల్పించాలని, హాస్టళ్లలో తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. కళాశాలలో మరుగు దొడ్ల కూ దిక్కు లేదా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తక్షణమే ప్రకటించాలని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని 5వ షెడ్యూల్డ్ ఆదివాసీ యువత అభివృద్ధికితోడ్పటైన జి.ఓ.నెంబర్”3″కు చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
మాతృభాష వాలంటీర్లను, ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లను తక్షణమే రెన్యూవల్ చేయాలని, రాష్ట్రంలో ప్రతి ఐటీడీఏలో స్పెషల్ డిఎస్సీ, బ్యాక్ లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ ఐ సీ, బీపీసీఎల్, హెచ్ పీ సీ ఎల్, ఐ ఓ సీ చమురు సంస్థలు, భారత రైల్వే ప్రైవేటికరణ ఆపాలని కోరారు. నూతన విద్యా హక్కు చట్టం 2022ను తక్షణమే రద్దు చేయాలని, 3,4,5 తరగతులు విలీన ఉన్నత పాఠశాలకు ప్రక్రియ జి.ఒ నెంబర్ 117 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేయాలని, రాష్ట్రం అంతటా ఇల్లు పట్టాలు ఇచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వము ఇల్లులు కట్టి ఇవ్వాలన్నారు. పాఠశాలలు జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయులు అధ్యాపకులను పూర్తిస్థాయిలో నియమించాలి. కనీస మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలన్నారు.
సిపిఎస్ విధానం రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఏపీ టూరిజం, గిరిజన సహకార సంస్థ (జిసిసి), హెచ్.ఎన్.టి.సి, ఐటీడీఏ పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగులకు సి ఆర్ టి ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనము కల్పించాలన్నారు. అగ్నిపథ్ ను రద్దు చేయాలని, త్రివిధ దళాలలో పాత విధానంతోనే రిక్రూట్మెంట్ జరపాలన్నారు. గిరిజన ప్రాంతంలో చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులకు 1.5 సెంట్లు భూమి రాష్ట్ర ప్రభుత్వం హక్కు పత్రాలు ముఖ్యమంత్రి కార్యాలయ మెమోను తక్షణమే విరమించుకోవాలని, 1/70 చట్టం గిరిజన ప్రాంతంలో పటిష్టంగా అమలు చేయాలనిర్ కోరారు.
నూతన అటవీ హక్కు చట్టం 2022ను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో ముందు మంచి నీరు, సాగునీరు, విద్యా, వైద్యం, రహదారి, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం బడుగు బలహీన వర్గాల, పేద విద్యార్థుల బెస్ట్ అవైల్బుల్ స్కూల్ విద్యను రద్దు చేసిన పథకాన్నిఈ విద్యా సంవత్సరం (2022 -23 ) నుండి పునర్ ప్రారంభించాలన్నారు.
బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థుల ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్యను రద్దు చేసిన పథకాన్ని ఈ విద్య సంవత్సరము (2022-23) నుండి పునర్ ప్రారంభించాలన్నారు. 19 గిరిజన ప్రాంతంలో ఉన్న ఆసుపత్రులన్నిటికీ సరిపడా సిబ్బంది వైద్యులు మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలని, బిజెపి తీసుకు వచ్చిన పౌష్టిక ఆహార భద్రత జిఎస్టిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో గిరిజన చట్టాలను ఉల్లంఘించి తవ్వకాలు జరుపుతున్న మైనింగ్ తక్షణమే నిలుపుదల చేయాలని, చింతపల్లి మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణము తక్షణమే నిలుపుదల చేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీనేత రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేస్తున్న భారత్ జోడో యాత్రను జయప్రదం చేయాలని కోరారు. పాలక పార్టీలను తరిమి కొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.