Suryaa.co.in

Political News

ఎక్కడి కాంగ్రెస్! ఎక్కడి ‘పీకే’!హతవిధీ!!

కాంగ్రెస్. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్య్రం రావడానికి 62 సంవత్సరాల క్రితమే -1885 లో పురుడు పోసుకున్న పార్టీ.మహాత్మా గాంధీ స్వయంగా సారధ్యం వహించిన పార్టీ . భారతీయుల నర నరానా జీర్ణించుకు పోయిన పార్టీ, కాంగ్రెస్ .దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల కాలం లో దాదాపు 54 సంవత్సరాల పాటు కేంద్రం లో అధికారం లో ఉన్న పార్టీ -కాంగ్రెస్ . ఈ పార్టీ నుంచి ఆరుగురు మహామహులు దేశానికి ప్రధాని హోదాలో -దిశానిర్దేశం చేశారు. . మహాత్మా గాంధీజీ తో పాటు; సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్, ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్, చక్రవర్తి రాజగోపాల చారి, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య క్రిపలానీ, మౌలానా అబ్దుల్ కలాం అజాద్, ఇందిరా గాంధీ, ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య సంజీవరెడ్డి, పీ వీ నరసింహారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి ‘నిజమైన’నేతలు కాలానుగుణంగా కాంగ్రెస్ తో మమేకమై దేశానికి సేవలు అందించారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఫారెనర్స్, హాఫ్ ఫారెనర్స్ చేతిల్లో చిక్కి, సళ్యమా ఎక్కడి కాంగ్రెస్! ఎక్కడి ‘పీకే’!హతవిధీ!!

కాంగ్రెస్. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్య్రం రావడానికి 62 సంవత్సరాల క్రితమే -1885 లో ఇది పురుడు పోసుకుంది. మహాత్మా గాంధీ స్వయంగా సారధ్యం వహించిన పార్టీ ఇది. భారతీయుల నర నరానా జీర్ణించుకు పోయిన పార్టీ ఇది.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల కాలం లో దాదాపు 54 సంవత్సరాల పాటు కేంద్రం లో అధికారం లో ఉన్నది. ఈ పార్టీ నుంచి ఆరుగురు మహామహులు దేశానికి ప్రధాని హోదాలో -దిశానిర్దేశం చేశారు. . మహాత్మా గాంధీజీ తో పాటు; నేతాజీ సుభాష్ చంద్ర బోస్,సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్, ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్, చక్రవర్తి రాజగోపాల చారి, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య క్రిపలానీ, మౌలానా అబ్దుల్ కలాం అజాద్, ఇందిరా గాంధీ, ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య సంజీవరెడ్డి, పీ వీ నరసింహారావు వంటి ‘నిజమైన’నేతలు కాలానుగుణంగా కాంగ్రెస్ తో మమేకమై దేశానికి సేవలు అందించారు.అటువంటి ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ ‘ ఇప్పుడు ఫారెనర్స్, హాఫ్ ఫారెనర్స్ చేతిలో చిక్కుకుపోయింది.

‘నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని ‘ అని చెప్పుకోడానికి గర్వించే దశనుంచి….’నేను కాంగ్రెస్ పార్టీ వాడిని ‘ అని చెప్పుకోడానికి సిగ్గుపడే దశకు కాంగ్రెస్ పార్టీని తీసుకు వచ్చారు . దేశాన్ని అప్రతిహతంగా 54 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్….;ఇప్పుడు దేశం లోని రెండు రాష్ట్రాల పాలనకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అంటే – జన్మతః ఇటాలియన్ అయిన సోనియా, ఆమె ఇద్దరు పిల్లలే అన్నట్టుగా తయారైంది. కాంగ్రెస్ ను వారు నడపలేరు. ఇతర నాయకులను నడపనివ్వరు.ఆంధ్రప్రదేశ్ ని విభజించిన తీరే వారి సమర్ధతకు అద్దం పడుతున్నది.

నిజానికి, కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా, ఆమె పిల్లలు వైదొలగి ;దానిని దేశీయులకు అప్పగించవచ్చు. తమకు నచ్చిన ప్ర’దేశం’ లో స్థిరపడి…., హ్యాపీ గా కాలం గడిపేయవచ్చు. డబ్బుకు లోటు లేదు కదా!
సోనియా కు ఇప్పటికే 75 సంవత్సరాలు వచ్చాయి . నిజంగా ఇది ఆమె విశ్రాంతి తీసుకోవలసిన సమయం. అలాగే, ఆమె కుమారుడు రాహుల్ కు 51 సంవత్సరాలు. వివాహం చేసుకోలేదు. అంటే – ఇక, ఆ కుటుంబ వారసులు ఉండరు. అందుకే, ప్రజలను పట్టించుకోవడం వారు మానేశారు.
కందకు లేని దురద పెండలానికి ఎందుకు అన్నట్టుగా – ఆ ముగ్గురికీ లేని ఆసక్తి తమకు మాత్రం ఎందుకూ అనుకుంటూ…,ప్రజలు కూడా కాంగ్రెస్ ను పట్టించుకోవడం మానేశారు.

మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నుంచీ కాంగ్రెస్ లో పాతుకు పోయిన కొంత మంది (వి) నాయకులకు తమ పార్టీ పరిస్థితి చూసి, దుఃఖం పొంగుకు వచ్చి, ఏవో సలహాలు ఇవ్వబోతే… తల్లీ పిల్లలకు ముక్కులు పొడుచుకు వచ్చాయి . వారిని వెలివేసినంత పని చేస్తున్నారు.వారి నాయకత్వంలో… వారి కనుసన్నల్లో… ఒక నడవడిక అంటూ లేకుండా… రాజకీయ బికారిగా తయారైన కాంగ్రెస్ పార్టీని తిరిగి పట్టాలెక్కించడం ఎలాగో వారికి తెలియడం లేదు. అయినా పార్టీ తమ అదుపాజ్ఞల్లోనే ఉండాలనేది వారి అభిమతం.

పార్టీ పగ్గాలు తమ కను సన్నల్లోనే ఉండాలనే స్వార్ధం కొంచెం వదిలేసి, కొంచెం ఇంగిత జ్ఞానంతో నడుం బిగిస్తే ; కాంగ్రెస్ కు పూర్వ స్థితిని తీసుకు రావడం అంత కష్టం కాకపోవచ్చు. కావలిసిందల్లా – ‘ ఎస్. మనం (‘మేము’ కాదు )చేయగలం’ అనే దృక్పధం తో పాటు ; ఆత్మ విశ్వాసం, చిత్త శుద్ధి.

నిజానికి ఈ దిశగానే రాహుల్ ఆలోచిస్తున్నట్టు ఓ వార్త వచ్చింది. కాంగ్రెస్ కు దేశ వ్యాప్తంగా నాలుగున్నర కోట్ల మంది సభ్యులు ఉన్నారట. ఇది చిన్న విషయం ఏమీ కాదు. మండల, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో ‘నామినేటెడ్ ‘ సంస్కృతికి స్వస్తి చెప్పి, సభ్యులనే ఆన్ లైన్ లో తమ గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర నేతలను ఎన్నుకునే వాతావరణం కల్పిస్తే ; కాంగ్రెస్ కు పట్టిన జడత్వం సగం వదులుతుంది.

రాష్ట్రాల కార్యవర్గాలే – జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కార్యావర్గాన్ని ఎన్నుకుంటే – కాంగ్రెస్ -అన్ని స్థాయిలలో బలోపేతమవుతుంది.సమర్ధులైన నాయకులు పార్టీకి దొరుకుతారు. మట్టి లో నుంచి మాణిక్యాలు పుట్టుకు వస్తాయి.పార్టీ యంత్రాంగం మొత్తం వైబ్రాంట్ గా తయారవుతుంది. పైరవీ కారులకు, పడక్కుర్చీ నాయకులకు విశ్రాంతి ఇచ్చినట్టు అవుతుంది. కొత్త జవసత్వాలతో పార్టీ నిలువెల్లా తొణికిసలాడుతూ ఉంటుంది. సోనియా, రాహుల్, ప్రియాంక పదవులు ఈ విధానం లో కూడా పదిలంగానే ఉంటాయి . వారిని కాదని కాంగ్రెస్ మరికొంత కాలం మనుగడ సాగించలేదు. ఈ విధంగా బలోపేతం అయ్యే కాంగ్రెస్ ను బీజేపీ ఎదుర్కొనలేదు.

ఈ సింపుల్ టెక్నిక్ ని అమలు చేస్తే సరిపోయే దానికి ; ఏమాత్రం ‘పొలిటికల్ క్యారెక్టర్’ లేని ప్రశాంత్ కిషోర్ అనే ఓ రాజకీయ వ్యాపారి వెనుక – ఆమె, ఆమె పిల్లలు పరుగులు తీయడం ఏమిటో అర్ధం కావడం లేదు.
కాంగ్రెస్ కు బద్ద విరోధి అయిన బీజేపీ కి గుజరాత్ లో బోలెడన్ని కుళ్ళు ఐడియాలు ఇచ్చి, మోదీ ముఖ్యమంత్రి కావడానికి తోడ్పడిన వ్యక్తి అతను.. 2014 లో మోదీ ప్రధాని కావడానికి కూడా పీకే మురికి ఐడియాలు పనికొచ్చాయి. బీజేపీ కి బద్ద విరోధి అయిన తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ లో గెలవడానికి – మమతా బెనర్జీ కి సాయపడ్డాడు. బీహార్ లో నితీష్ కుమార్ కు, ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు చెప్పిన ఐడియా చెప్పకుండా చెప్పాడు. రేపు 2024 కు కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇస్తున్నట్టు జగన్ ప్రకటించారు.

ఇటు బీజేపీ కాంగ్రెస్ పైకి కాలు దువ్వుతున్న తెలంగాణ సీ ఎం – కేసీర్ తో భుజం భుజం రాసుకుంటూ తిరగడం మొదలు పెట్టాడు. ఇంతలోనే – కాంగ్రెస్ కు సాయం చేస్తా అంటూ తయారయ్యాడు.
మరి, జగన్ ను, కేసీఆర్ ను ఏం చేస్తాడు? మిడిల్ డ్రాపా? వీరెవరికీ ప్రశాంత్ కిషోర్ ఉచితంగా సలహాలు ఇవ్వడం లేదు. ఒక్కొక్కరి దగ్గర మూడు వందల కోట్లు…., నాలుగు వందల కోట్లు (రూపాయలే! ) అంటూ మీడియా ప్రచారాలు. అలాటిది, కాంగ్రెస్ కు ఉచితంగా సేవలు అందిస్తాను అనడం లోనే అసలు కిటుకు ఉంది.

కాంగ్రెస్ లో ఇప్పుడు అధికార పీఠం ఒకటే ఉంది. ఆ ముగ్గురూ కలిపి ఒకటే అధికార పీఠం. ప్రశాంత్ కిషోర్ వేలు పెడితే ; ఆయన మరో అధికార పీఠం గా విరాజిల్లవచ్చు . మొదటి అధికార పీఠం తో పాటు, దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, శ్రేణులను గంగిరెద్దులను చేసి ఆడించవచ్చు. తన మాట వినని వారిని కాంగ్రెస్ నుంచి బయటకు పంపించవచ్చు. తన అభీష్టం మేరకు టికెట్స్ కేటాయించవచ్చు. మొదటి అధికార పీఠాన్ని డమ్మీ చేసేయవచ్చు. 130 కోట్ల జనాభా, 29 రాష్ట్రాలుగా విస్తరించి ఉన్న దేశం లో రెండవ జాతీయ పార్టీ ని చేజిక్కించుకోవచ్చు.అసలు ఈ దుస్థితి కాంగ్రెస్ కు ఎందుకు దాపురించింది?

కాంగ్రెస్ లో తెలివైన వ్యూహకర్తలు లేకనా? క్రెడిబిలిటీ, కమిట్మెంట్ ఉన్నవారు లేకనా? నిర్వహణ సామర్ధ్యం ఉన్నవారు లేకనా? అందరూ ఉన్నారు. మాట వరుసకు, డ్వాక్రా మహిళా గ్రూప్ లకు రూపకల్పన చేసి, పెద్దమహిళల జీవితాలలో ఆర్ధిక విప్లవానికి బీజం వేసిన పూర్వపు ఐ ఏ ఎస్ అధికారి -రాజు, ఇప్పుడు కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం లోనే ఉన్నారు. జే. డీ శీలం అక్కడే ఉన్నారు. వెనుక నుంచి పార్టీ కి జవసత్వాలు అందించగల కేవీపీ రామచంద్రరావు లు రాష్ట్రనికి ఒకరు ఉన్నారు.ఇలాంటి వారేందరో కాంగ్రెస్ మొదటి కుటుంబానికి అందుబాటులో లో ఉన్నారు.కానీ, ఆ కుటుంబానికి లేనిదల్లా…. వారి నైపుణ్యం పైన, సామర్ధ్యం పైన, అంకిత భావం పైన – నమ్మకం మాత్రమే.

పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదనే నానుడి ఉండనే ఉన్నది కదా!
లోక సభలో ఉన్న 543 స్థానాలలో ఓ 240 స్థానాలు -తృణమూల్ కాంగ్రెస్, డీ.ఎం.కే, ఆర్. జే. డీ., సమాజవాదీ, ఎన్ సీ పీ వంటి -‘బీజేపీ వ్యతిరేక’ పార్టీలకు వదిలి పెట్టి ; ఓ మూడు వందల స్థానాలను గుర్తించి ; మొత్తం శక్తి యుక్తులను ఆ స్థానాలపై కేంద్రీకరించడానికి – పీకే అవసరం లేదు కదా! కేరళ, కర్ణాటక,తెలంగాణ చత్తిస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్,మహారాష్ట్ర,పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, అస్సాం మొదలైన దాదాపు 15 పెద్ద రాష్ట్రలలో పెద్ద ఫైట్ ఇవ్వగలిగిన స్థితిలోనే కాంగ్రెస్ ఉన్నది కదా!

మూడు వందల స్థానాల్లో 175 నుంచి 200 స్థానాలు తెచ్చుకోగలిగితే… కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేయడానికి అనేక ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉంటాయి.ఎందుకంటె – వాటికి బీజేపీ ఉమ్మడి శత్రువు.
ఎంతో ఘన చరిత్ర కలిగి, గ్రాండ్ ఓల్డ్ పార్టీ గా గుర్తింపు పొంది, ఇప్పటికీ దేశ జీవనం లో గణనీయమైన పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ని ప్రశాంత్ కిషోర్ లాటి రాజకీయ వ్యాపారికి అప్పగించవద్దని ఆ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటు న్నారు. మరి, ఆ అమ్మా,ఆవిడ పిల్లలు వింటున్నారా?

– భోగాది వేంకట రాయుడు
@venkata _rayudu

LEAVE A RESPONSE