Suryaa.co.in

Features

ఎక్కడ నుండి ప్రాణం ఉద్బవిస్తుంది ?

భారత దేశం నలుమూలల నుండి జ్ఞానాన్వేషణ కై భయలు దేరిన’ 6′ గురు పిప్పలాద మహర్షి అందుకు తగిన వాడని తలచి , ఆయనను ఆరు ప్రశ్నలు అడుగుతారు . ఆ ఆరు ప్రశ్నలకు జవాబులుగా ప్రశ్నోపనిషత్ రూపొందింది. ఆరు అద్యాయాలుగా పేర్కొనబడినాయి . ఈ ఉపనిషత్ లో 67 మంత్రాలు ఉన్నాయి . అశ్వలుని కుమారుడైన కౌసల్యుడు పిప్పలాద మహర్షిని ఇలా ప్రశ్నించాడు.” మహర్షి ప్రాణం ఎక్కడ నుండి జన్మించినది ? ఏధంగా శరీరంలో ప్రవేశిస్తుంది ? శరీరంలో ఎలా నెలకొని ఉంటుంది? ఎందు చేత నిష్క్రమిస్తుంది?. కఠిన ప్రశ్నలు అడుగుతున్నావు అయినను నీవు అభిలాషగల్గిన వాడివి కావునా నేను జవాబిస్తాను విను అని చెప్పానారంభిస్తాడు పిప్పలాదుడు .మొదట ఎక్కడ నుండి ప్రాణం ఉద్భవిస్తుంది ?

ఆత్మన ఏష ప్రాణోజాయతే / యథైషా పురుషేచ్చాయై తస్మిన్ ఏతదాతత౦ మనోకృతేన అయాత్యస్మిన్ శరిరే//
ప్రాణం ఆత్మ నుండి ఉద్భవిస్తుంది . మనిషి అతని నీడలా ఆత్మలో ప్రాణం విస్తరించి ఉన్నది . మనస్సు చేష్టల వలన ప్రాణం శరీరం లోకి వస్తుంది . అది ఎలాగో చిన్న ఉదాహరణల తో పరిశీలిద్దాం . అసలు ప్రాణానికి – ఆత్మకు ఉన్న సంభందం ఏమిటి ? ” మనిషి , అతని నీడ వలె ” అంటుంది ఈ మంత్రం. నీడ , మనిషి నుండే రూపొందుతుంది .‌అంతేకాని నీడకు ప్రత్యేకించి స్థానం లేదు . అదే సమయంలో మనిషి నుండి నీడను వేరు చేయలేం కూడా అదేవిధంగా ఆత్మ , ప్రాణం విడదీయలేనివి . ప్రాణం శరీరం లోకి ఎలా వస్తుంది ?

ఆత్మ నుండి విడదీయ లేనిదిగా ఉన్న ప్రాణానికి ప్రత్యేకమైన రాక ఏమీలేదు . శరీరంలో ఆత్మ ఉనికి ఉన్నదంటే అర్ధం ప్రాణం ఉన్నదనే . పై ప్రశ్నకు అర్ధం ప్రాణం శరీరాన్ని ఏవిధంగా నిర్మిస్తుంది అనేది తెలుసుకోవాలి . ప్రాణం శరీరాన్ని ఏవిధంగా రూపొందిస్తుంది ? మనస్సు యొక్క కార్యకలాపాలచేత . అంటే మనస్సు లోని కోర్కెలు , ఎదురు చూపులు , అనుభవాలు , మొదలైన వాటి అనుగుణంగా ప్రాణం శరీరాన్నినిర్మించి ఇస్తుంది .

దీనిపై స్వామి వివేకానంద వివరణ చూద్దాం . ” మనం చేసే ప్రతి పనీ , ఆలోచించే ప్రతి ఆలోచనా మన మనస్సు మీద ఒక గుర్తును ఏర్పారుస్తుంది . దాన్ని మనం ” సంస్కారం” అటుంటాం . ఐతే ఈ సంస్కారాల సామూహిక ఫలమే ఒక వ్యక్తి మరణాంతరం అతడికి కలిగే గతిని నిర్ణయించే మహత్తర శక్తి. ఒకడు మరణిస్తే శరీరం పతనమై పంచ భూతాలలో కలిసి పోతుంది . సంస్కారాలు నశించక మనస్సును అంటిపెట్టుకొని ఉంటాయి . మనస్సనేది సూక్షమైన ద్రవ్యాల తో నిర్మితమైనది కావటం వలన త్వరగా నశించదు. ఏదైన ద్రవ్యం సూక్ష్మ తరమైన కొద్ది సుస్థిరత‌ అధికమవుతుంది . ” ఇదే విషయాన్ని మరో చిన్న ఉదాహరణ తో పరిశీలిద్దాం . వేర్వేరు గాలులు వేర్వేరు దిశల నుండి వచ్చి ఒక చోట కలుస్థాయి. అలా కలిసిన చోట అవి భాగా కలిసి పోయి మిశ్రమమైన గిరగిరా తిరగటం అరాభిస్తాయి .

అలా తిరిగేటప్పుడు దుమ్ముతో కూడిన ఒక ఆకారాన్ని కల్పిస్తాయి . అదే సమయంలో చెత్త , కాగితపు ముక్కలను లాక్కొని మళ్లీ కాసేపటి కి వాటిని వదిలేసి , వేరే చోటికెల్లి అక్కడ గిరగిరా తిరుగుతాయి . మళ్ళీ అక్కడ దొరికిన పదార్ధాలు లాక్కోని వాటితో కొత్త ఆకారాలు కల్పిస్తాయి . సంస్కృతం లో ప్రాణమనే సమిష్ఠి నామంతో పేర్కొనే శక్తులు ఇదే విధంగా వర్తిస్తాయి . శక్తులు ఒక దగ్గర కూడి , అక్కడి ద్రవ్యాల తో ఒక శరీరాన్ని , ఒక మనస్సును కల్పించి , సాగిపోతూ కొంత కాలానికి శరీరం కల్పించభడుతుంది . అదీ పడిపోతే ఇంకొక శరీరం ఏర్పడుతుంది . ఇలా చర్య సాగిపోతూనే ఉంటుంది .

ఇందులో గమనించ వలసినది ద్రవ్యం సహాయం లేకపోతే శక్తి నడక సాగదు , కనుక శరీరం పతనం చెందినపుడు మనస్సు నిలిచి ఉంటుంది . సంస్కారం రూపమైన ప్రాణం వేరోక చోటికి తీసుకొని పోయి . అక్కడి ద్రవ్యాలతో కొత్త సుడిని కల్పించి , కొత్త వృత్తాన్ని కొనసాగిస్తుంది. మనస్సనే మాయశక్తి నశిస్తే కాని ఈ జన్మలు జన్మాంతరాలు అంతా ఊహా కల్పనేననే అద్వైతసత్యం బోధపడుతుంది…

LEAVE A RESPONSE