Suryaa.co.in

Andhra Pradesh

సీఐడీ చీఫ్ దాచిపెట్టిన ఆ నివేదిక ఎక్కడ?..ఇదిగో మా దగ్గర ఉంది..

-దీన్ని చూపిస్తే రాష్ట్ర ప్రజల ముందు నవ్వులపాలవుతామనే ఆరోజు సునీల్ దాచిపెట్టారు
-ఓ కామాంధుడికి సీఐడీ చీఫ్ వత్తాసు పలకడం దురదృష్టకరం
-వైసీపీ ఓ బూతుపార్టీగా మారిపోయింది
-మహిళలే వైసీపీని భూస్థాపితం చేస్తారు
-మహిళలకు టీడీపీ అన్ని వేళలా అండగా నిలబడుతుంది
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. డర్టీ ఎంపీని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడు, అచ్చోసిన ఆంబోతు అయినటువంటి ఎంపీ మాధవ్ పై పోలీసులు గాని, ప్రభుత్వం గాని చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. మాధవ్ బూతు పురాణం వెనుక దాగున్న వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చిన టీడీపీ నాయకులు, వాళ్లు తీసుకువచ్చిన వాస్తవ రిపోర్టులపై బురదజల్లడంపై ప్రభుత్వం, సీఐడీ అధికారులు పెట్టిన శ్రద్ధ, డర్టీ ఎంపీ మాధవ్ పై చర్యలు తీసుకోవడంపై చూపడం లేదు.
దీంతో రాష్ట్రంలోని మహిళల్లో తీవ్రమైన అభద్రతాభావం ఏర్పడింది. తమకు ఏదైనా అన్యాయం జరిగితే, తమపై ఏమైనా అఘాయిత్యాలు జరిగితే పోలీసులు ఉన్నారనే నమ్మకాన్ని మహిళలు కోల్పోయారు. ఇటీవల సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్ తో సీఐడీ విభాగంపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు. మాధవ్ డర్టీ వీడియో నిజమేనంటూ ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టను సీఐడీ చీఫ్ దాచిపెట్టి ప్రజలను పక్కదారిపట్టిస్తున్నారు.

సునీల్ కుమార్ ధైర్యం చాలక దాచిపెట్టిన నివేదిక ఇదే:-
సునీల్ కుమార్ జిమ్ స్టాఫర్డ్ మీకు పంపిన ఆ నివేదిక ఇదిగో నా దగ్గర ఉంది. మీరు రహస్యంగా దాచిపెట్టిన డాక్యుమెంట్ ను మీ ప్రెస్ మీట్ లో మీడియాలో ఎందుకు రిలీజ్ చేయలేకపోయారో, ఆ డాక్యుమెంట్ ను నేను రాష్ట్ర ప్రజలముందుకు తీసుకుని వస్తున్నాను. మీరు తప్పు చేయకుంటే, టీడీపీ డాక్యుమెంట్, మీకు ఎక్లిప్స్ ల్యాబ్ పంపిన డాక్యుమెంట్ ను పోలుస్తూ ప్రజలకు సవివరింగా చెప్పాల్సి ఉంది. మీరు అలా చేయలేదు అంటే మీరు చెప్పిన దానిలో ఎంత నిజముందే ఆనాడే ప్రజలకు అర్థమైంది.
సునీల్ దాచిపెట్టిన రిపోర్టు, దానిలో దాగున్న అంశాలు ఇవే:-
ఆగష్టు 9, 2022న ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ అధినేత జిమ్ స్టాఫోర్డ్ కు ప్రసాద్ పోతిని పంపించిన వీడియోపై ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ఇలా ఉంది…
Purpose:
I was asked by Mr.Pothini to determine if the video was authentic or if it had been altered/edited.
Process and Examination Steps:
It was represented to me that this video is of a facetime video call.
సవరణలు జరిగిన తర్వాత వచ్చిన నివేదికలో ఇలా ఉంది….
Purpose:
I was asked by Mr.Pothini on Aug 9th, 2022 to determine if the video was authentic or if it had been altered/edited.
Process and Examination Steps:
It was represented to me that this video is of a video call.
‘‘సీఐడీ దాచిపెట్టిన నివేదిక, టీడీపీ విడుదల చేసిన నివేదికలో దాగున్న అంశాలు ఇవే’’
‘‘2022 ఆగష్టు 11న ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అధినేత జిమ్ స్టాఫర్డ్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక(సీఐడీ చీఫ్ దాచిపెట్టిన నివేదిక)లో ప్రసాద్ పోతిని డర్టీ ఎంపీ వీడియోను ల్యాబ్ కు ఏ తేదీన ఇచ్చారో లేదు. అదేవిధంగా వీడియో కాల్ కు బదులుగా ఈ నివేదికలో ఫేస్ టైం వీడియో కాల్ అని ఉంది. దీంతో ప్రసాద్ పోతిని ప్రజలకు పూర్తిగా అర్థమయ్యేలా ఉండేందుకుగాను నివేదికలో రెండు చిన్న సవరణలను ల్యాబ్ సిబ్బందిని కోరారు. అవి ఏమంటే 1. వీడియో ఇచ్చిన తేదీ Aug 9th, 2022 చేర్చాలని, 2. ఫేస్ టైం వీడియో కాల్ కు బదులు వీడియో కాల్ అని చేర్చాలని కోరారు. దీంతో ల్యాబ్ సిబ్బంది ఈ రెండు చిన్న సవరణలను చేసి ప్రసాద్ పోతిని కి అందించారు. ఈ రెండు సవరణలు తప్ప ల్యాబ్ అధినేత జిమ్ స్టాఫర్డ్ వీడియో పై ఇచ్చిన తన అంతిమ రిపోర్టు అంశాల్లో ఏ ఒక్క అంశాన్ని సవరించలేదు. దీనిపై సీఐడీ చీఫ్ స్టాఫర్డ్ ను ఈ మెయిల్ ద్వారా సంప్రదించగా ఆయన తన జవాబులో స్పష్టంగా అంతగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేని(not substantive) రెండు మైనర్ సవరణలు మాత్రమే కోరారని తెలియజేస్తూ, తనకు ప్రసాద్ పోతిని పంపిన వీడియో నిజమైనదేనని(Authentic and Un edited) అన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు.

సవరించిన నివేదిక ప్రసాద్ పోతిని గారికి తమ ల్యాబ్ సిబ్బంది ద్వారా అందిన విషయం జిమ్ స్టాఫర్డ్ దృష్టికి రాకపోవడంతో ఆయన తాను ఇచ్చిన ప్రాథమిక నివేదికను జగపరిచి సునీల్ కుమార్ కు ఈమెయిల్ పంపించడం జరిగింది. ఈ విషయం చాలా స్పష్టంగా రెండు నివేదికలను పోల్చి చూస్తే అర్థమవుతుంది. సునీల్ కుమార్ జిమ్ స్టాఫర్డ్ తనకు పంపిన ప్రాథమిక నివేదికను ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయకుండా, ఏదో ఆకాశం బద్దలై భూమిమీద పడ్డట్టు చాలా ఘోరమైన తప్పిదం ఏంటో జరిగిపోయినట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజున చాలా స్పష్టంగా మేము రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం.

గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ ను పరిశీలించి, అది నూటికి నూరుశాతం నిజమని స్టాఫర్డ్ తేల్చిన విషయం వాస్తవం. ప్రభుత్వానికి ఇంకా నమ్మకం కుదరకపోతే ఈ వీడియోను తక్షణమే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి వాస్తవం తెలుసుకోవాలి. ప్రభుత్వానికి ఇలా చేసే ధైర్యం ఉందా?
సునీల్ ప్రెస్ మీట్ పూర్తయినవెంటనే వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు మాధవ్ కు టీడీపీ ఏదో అన్యాయం చేసేసిందని, అనవసరపు ఆరోపణలు చేసిందని మీడియా ముందుకు వచ్చి మాధవ్ ను కాపాడే ప్రయత్నం చేశారు.

ప్రజలు నవ్వుతారనే సునీల్ ఆ నివేదికను దాచిపెట్టారు:-
సునీల్ కుమార్ కు స్టాఫర్డ్ పంపిన ప్రాథమిక నివేదిక, నేడు మేము చూపిస్తున్న నివేదిక ఒక్కటే. ఒకవేళ కాదంటే సునీల్ కుమార్ తన వద్దనున్న రిపోర్టును మీడియా వేదికగా లైవ్ లో తన ఈమెయిల్ నుండి డౌన్ లోడ్ చేసి ప్రజలకు చూపించాలి. తారీఖు చేర్చని నివేదిక, తారీఖు చేర్చిన తర్వాత ల్యాబ్ నుండి వచ్చిన నివేదికను చూపి అన్యాయం జరిగిపోయిందని చెబితే సునీల్ కుమార్ ను చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతారని భయపడ్డారు. అందుకే ప్రెస్ మీట్ లో ఈ నివేదికను విలేకరులకు చూపించలేదు. నేను నిప్పులాంటి మనిషిని గనుకనే కాలర్ ఎగరేసి చెబుతున్నా. టీడీపీ కి ఏ ఒక్కరినీ అకారణంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఫేక్ రిపోర్టులు సృష్టించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒక బాధ్యతగల ఎంపీ మహిళతో అత్యంత అసభ్యంగా ప్రవర్తించిన సందర్భంలో అటువంటి కామాంధుడైన ఎంపీపై చర్యలు తీసుకునే వరకు బాధ్యతగల ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పై ఉంది. అందుకే నిజాన్ని నిగ్గు తేల్చడానికి ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి నివేదిక తెప్పించింది.

డర్టీ ఎంపీని సీఐడీ వెనకేసుకొస్తోంది:-
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డర్టీ ఎంపీని వెనకేసుకొచ్చేలా మాట్లాడారు. డర్టీ ఎంపీపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఏపీ పోలీసు వ్యవస్థ డర్టీ ఎంపీని వెనకేసుకురావడం అత్యంత సిగ్గుచేటు. రాష్ట్రంలోని మహిళలకు ధైర్యం, భద్రతను కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ దురదృష్టవశాత్తు కామాందులకు, అచ్చోసిన ఆంబోతులకు మద్దతు పలకడం చాలా బాధగా ఉంది. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఏం సందేశం ఇస్తున్నారు సార్? మీరొక బాధ్యతగల ఐపీఎస్ అధికారిగా ఉండి ఒక నేర చరిత్ర కలిగిన ఎంపీని మీరు వెనకేసుకురావడం ఏంటి సునీల్ గారు?

పబ్లిసిటీ పీక్..మ్యాటర్ వీక్:-
దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ అంటూ ఓ వైపు పబ్లిసిటీని ఊదరకొడుతూనే, మహిళలకు రక్షణ కల్పిండంలో వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. మహిళలకు ఆపదొస్తే బటన్ నొక్కండి అని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కామాంధుడైన డర్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను వెనకేసుకురావడం ఎంత వరకు సమంజసమో మహిళలకు సమాధానం చెప్పాలి. మాధవ్ డర్టీ ఎపిసోడ్ కు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అండగా నిలబడడం వెనుక ఆంతర్యం ఏంటి?
రాష్ట్రంలోని మహిళలు పోలీసు వ్యవస్థ గురించి ఏం అనుకుంటారో ఒకసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి సునీల్ కుమార్ గారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం చేయాల్సిన పనిని బాధ్యత గల ప్రతిపక్షంగా మేం చేశాం..నిజాన్ని నిర్ధారించే పనిని టీడీపీ చేసింది…మేం చేసిన పనిని మీరు తప్పుపట్టేలా ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

ప్రభుత్వం మౌనంగా ఉండడంతో రంగంలోకి టీడీపీ:-
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ చూసిన కోట్లాది మహిళల మనసుల్ని గాయపర్చడం చూసి టీడీపీ గా మేం స్పందించాం..ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది…
నిజాన్ని నిర్ధారించడానికి అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఈనెల 9న
ప్రసాద్ పోతిని ద్వారా వీడియోను పంపించి ల్యాబ్ అధినేత జిమ్ స్టాఫర్డ్ వద్ద రిపోర్టు తీసుకున్నాం. ఆ వీడియోను స్టాఫర్డ్ క్షుణ్ణంగా పరిశీలించి తన రిపోర్టులో చాలా క్లియర్ గా “That the video shown in this recording is authentic and un-edited” అని పేర్కొన్నారు.

నివేదికలో తప్పులేదు గనుకనే ఛాలెంజ్ చేస్తున్నా:-
ఎక్లిప్స్ ల్యాబ్ రిపోర్టును విడుదల చేసిన నేను దాన్ని పబ్లిక్ డొమైన్ లో ఉంచి, కావాలంటే ఎవరైనా ఈ వివరాలను చెక్ చేసుకోండి అని ఛాలెంజ్ విసిరాను. నిజంగా మేం ఫేక్ డాక్యుమెంట్ లేదా రిపోర్టులను విడుదల చేస్తే ఛాలెంజ్ చేయగలనా?మేం తప్పు చేయలేదు గనుకనే ఆ రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో ఉంచి సవాల్ విసిరాను. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఇటీవల రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేం విడుదల చేసిన రిపోర్టు ఫేక్ అని చెప్పారు. ఒరిజినల్ రిపోర్టును జిమ్ స్టాఫర్డ్ ఆయనకు పంపించారని చెప్పుకొచ్చారు…మంచిదే..ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ను మీడియా మిత్రులకు ఎందుకు రిలీజ్ చేయలేదు? అని నాటి నుండి నేటి వరకు మా టీడీపీ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నా ఎందుకు స్పందించడం లేదో సునీల్ కుమార్ సమాధానం చెప్పాలి.

ఆల్బర్ట్ ల్యాబ్ నివేదికపై చర్యలేవి సీఐడీ చీఫ్?:-
టీడీపీ ఎక్లిప్స్ రిపోర్టు పై బురదజల్లుతున్న సునీల్ కుమార్, వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఆల్బర్ట్ ఫోరెన్సిక్ ఫేక్ నివేదికపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు. దీనిపై ఏమైనా విచారణ చేశారా? రాష్ట్ర ప్రజలకు వీటిపై సమాధానం చెప్పాలి. టీడీపీ బాధ్యతాయుతంగా చిత్తశుద్ధితో ఎక్లిప్స్ నివేదికను తీసుకువచ్చింది. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ నిజాయితీగా గోరంట్ల మాధవ్ పై ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలి. నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఈ వీడియోను ఎందుకు పంపడంలేదో ప్రజలకు చెప్పండి. వైసీపీ నాయకులకు ఐపీసీ సెక్షన్లు వర్తించవా? వాళ్లు ఎటువంటి తప్పులు చేసినా, ఫేక్ నివేదికలు సర్క్యులేట్ చేసినా సీఐడీ పోలీసులకు కనిపించవా, కనిపించినా కనిపించనట్లు నటిస్తున్నారా?

ప్రజలకు కావాల్సింది వాస్తవాలు- సినిమా కథలు కాదు సునీల్:-
ఐపీఎస్ అధికారిగా సినిమా కథలు చెప్పడం ఏంటి? రాష్ట్ర ప్రజలకు కావాల్సింది సినిమా కథలు కాదు, న్యూడ్ వీడియోపై వాస్తవాలు. సినిమా కథలతో ఇంకా డర్టీ పిక్చర్ ఎంపీ మాధవ్ ను వెనకేసుకు రాకుండా, ఆ బూతు వీడియోను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే మీకు సినిమా కష్టాలు తప్పేవి కదా. జగరోనా వైరస్ ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. దాని బారిన పడి ఇబ్బందులు పడుతున్న మీలాంటి అధికారులు, దీని నుండి బయటపడే ప్రయత్నం చేయాలి మీరు. మీరు న్యాయబద్దంగా వ్యవహరిస్తే మీకు టీడీపీ అండగా ఉంటుంది. రాష్ట్రంలోని కోట్లాది మహిళల తరపున మిమ్మల్ని ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. మిమ్మల్ని రాజకీయ లబ్ధికోసం న్యాయబద్దంగా పనిచేయాలని కోరడం లేదు. రాష్ట్రంలోని మహిళలకు పోలీసులపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుతున్నాను.

డర్టీ ఎంపీపై చర్యలు కోరుతూ రాష్ట్రపతి, మహిళాకమిషన్ కు ఫిర్యాదు:-
వైసీపీ డర్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం పట్ల రాష్ట్రంలోని మహిళలే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డర్టీ ఎంపీపై చర్యలు ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తున్నారు. ఏపీలోని వివిధ మహిళా సంఘాల నాయకులు, పార్టీ ప్రతినిధులు ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, డర్టీ ఎంపీ వ్యవహారశైలిపై గౌరవ‘‘భారత రాష్ట్రపతి గారిని’’ అదేవిధంగా ‘‘నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్ పర్సన్’’ ను కలిసి ఫిర్యాదు, నివేదికలు ఇవ్వబోతున్నారు.

అఘాయిత్యాలకు పాల్పడుతున్నది వైసీపీ నాయకులే:-
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను పరిశీలిస్తే వాటిలో దోషులుగా వైసీపీ నాయకులే తేలుతున్నారు. గత మూడేళ్లుగా అన్ని స్థాయిల్లో ఉన్న వైసీపీ నాయకులే ముద్దాయిలుగా ఉన్నారు. వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వగైరా ఉన్నారు. రాష్ట్రంలో ఇంత తంతు జరుగుతున్నా..ఏపీ పోలీసులు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, తప్పును నిలదీసే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, నిర్బంధాలు విధిస్తూ వేధిస్తున్నారు. మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రశ్నించడమే ప్రతిపక్షం చేస్తున్న తప్పా? ఎంపీ ఒక మహిళతో వీడియోకాల్ లో అసభ్యంగా మాట్లాడుతుంటే ప్రతిపక్షం కూడా అధికారపక్షం మాదిరిగా చూస్తూ కూర్చోవాలా? మౌనంగా ఉండాలా? మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.

మహిళలకు టీడీపీ పెద్దపీట:-
మహిళలకు పెద్దపీట వేసిన పార్టీగా టీడీపీ మహిళల పక్షాన ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి చరిత్రను గుర్తుచేసుకోవాలి. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారకరామారావు మహిళలకు సమానంగా ఆస్తి హక్కును కల్పించి రాష్ట్రంలోని మహిళలకు భరోసా, ధైర్యాన్ని కల్పించారు. దేశంలో ఇదొక చరిత్ర…రాష్ట్రంలో ఈ విధంగా టీడీపీ తొలిసారిగా మహిళలు, వారి భద్రత గురించి అనేక రకాలుగా ఆలోచించింది…అన్నగారి తదనంతరంనారాచంద్రబాబు నాయుడు గారు మహిళల్లో భరోసా నింపడానికి, వాళ్లంతట వాళ్లు తమ స్వశక్తితో బ్రతకాలనే సదుద్దేశంతో డ్వాక్రా సంఘాలు ప్రారంభించారు. అన్న ఎన్టీఆర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో చంద్రబాబుగారు డ్వాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు.

బిల్ క్లింటన్ మెచ్చేలా మహిళా అభ్యున్నతి పథకాలు:-
అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ ఏపీకి వచ్చినప్పుడు డ్వాక్రా సంఘాల వ్యవస్థను చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి, చంద్రబాబుగారిని పొగడ్తలతో ముంచెత్తారు. మహిళలకు ఎప్పుడైనా పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీ నే. ఒక దళిత మహిళ ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ ను చేసిన మొట్టమొదటి నాయకులు నారాచంద్రబాబు నాయుడు మాత్రమే…ఏపీ చరిత్ర పుటల్లో ఇదొక సువర్ణ అధ్యాయం. పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి మహిళల అభ్యున్నతి కోసం, వారిని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం పోరాడిన, పాటుపడిన, శ్రమించిన, తాపత్రయపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే నేడు టీడీపీ నాయకులుగా మేం చూస్తూ కూర్చోవాలా?

వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు:-
జగన్ రెడ్డికి, ఆయనకు తొత్తులుగా మారిన కొంతమంది టెయింటెడ్(కళంకిత) అధికారులకు చెప్పేది ఒక్కటే. ఎట్టి పరిస్థితుల్లో మహిళల కోసం మేం చేస్తున్న పోరాటం ఆపే ప్రసక్తే లేదు. తప్పనిసరిగా ఎంతవరకైనా వెళ్లి నాలాంటి టీడీపీ కార్యకర్త పోరాటం చేస్తాడని గంటాపథంగా చెబుతున్నాం. మీరు ఎన్నిరకాలుగా వేధించేపనులు చేసినా, తప్పుడు కేసులు పెట్టినా మహిళామ తల్లులకు అండగా నిలిచేందుకు ప్రతి పసుపు సైనికుడు తమ పోరాటాన్ని కొనసాగించే తీరుతాడు..వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు…

వైసీపీ ఓ బూతు పార్టీ:-
టీడీపీని ఉద్దేశించి వైసీపీ నాయకులు ఫేక్ పార్టీ అన్నారు. కానీ వైసీపీ ఒక బూతు పార్టీగా మారిపోయిందని తెలుసుకోవాలి, ఆ పార్టీలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాలి. ఓ కామాంధుడైన ఎంపీని వెనకేసుకురావాల్సిన అవసరం మీకు ఏముంది సునీల్ గారు? అంబేద్కర్ ఐడియాలజిస్టును అని పదేపదే మీరు చెబుతున్నారు. అచ్చోసిన ఆంబోతులకు వత్తాసు పలకాలని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి కామాంధుడికి అండగా నిలవాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడైనా చెప్పారా? మీరే ఆత్మ విమర్శ చేసుకోవాలి.

క్విట్ జగన్ – సేవ్ ఆంధ్రప్రదేశ్ మా నినాదం:-
ఏపీకి జగన్ రెడ్డి అనే నియంత కబంద హస్తాల నుండి విముక్తి కల్పించాలనే దృఢ సంకల్పంతో ఒకరకంగా నేడు మేము మరో స్వాతంత్ర్య పోరాటం చేస్తున్నాం. స్వాతంత్ర్యోద్యమం సమయంలో న్యాయం కోసం పోరాడిన వారిపైనా బ్రిటీషు వాళ్లు కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం చూశాం. అయినా వాళ్లు పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించారు. నేడు జగన్ రెడ్డి సర్కారు కూడా నాటి బ్రిటీషు పాలకుల మాదిరిగా మాపై కేసులు పెట్టి, వేధించాలని చూస్తోంది. అయినా భయపడకుండా పోరాడి జగన్ రెడ్డి చేతిలో పీడింపబడుతున్న ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తాం. మా నాయకుడు నారా చంద్రబాబునాయుడు అందించిన క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం.

మాధవ్ పై చర్యలు తీసుకునే వరకు పోరాడతాం:-
ఇప్పటికీ, ఎప్పటికీ టీడీపీ మహిళల పక్షమే. మేమంతా మహిళలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం. హజీరా కు న్యాయం ఎక్కడ సార్? గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకునే వరకు వదిలే ప్రసక్తే లేదు. వైసీపీ నాయకులు మీడియా ముందు ఎంత మొరిగినా మాధవ్ నిర్ధోషి కాలేడు. ప్రజలు విశ్వసించరు. చంద్రబాబుగారి నాయకత్వంలో సగర్వంగా పనిచేస్తున్నాం.

వైసీపీ ని మహిళలే భూస్థాపితం చేస్తారు:-
మీ నాయకుడిలా మా నాయకుడు జైలులో చిప్పకూడు తినలేదు, 18కేసుల్లో నిందితుడు కాదు, సొంత బాబాయ్ ను గొడ్డలిపెట్టుతో చంపలేదు, సొంత తల్లిని, చెల్లిని రోడ్డున పడేయలేదు. చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. వైసీపీ నాయకులకు ఈ అవకాశం లేదు. వైసీపీ ని రాష్ట్రంలోని మహిళలే భూస్థాపితం చేస్తారు.

LEAVE A RESPONSE