Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి అద్దెకు తెచ్చిన గేటు ఎటు పోయింది?

-పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు సీఎం మోసం
– ఏ మొహం పెట్టుకొని వచ్చారు జగన్ రెడ్డి
– బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్

విజయవాడ: పశ్చిమ ప్రకాశం జిల్లా, కడప మరియు నెల్లూరు జిల్లాల ప్రజలను వరప్రదాయిని వెలిగొండ ప్రాజెక్టు పూర్తీ కాకున్నా పూర్తీ చేసినట్లు అట్టహాసంగా ప్రారంభోత్సవానికి సిద్దం అనడం అంటే ప్రజలను మోసం చేయడానికి సిద్దం అవ్వడమా?

మేము గతంలో తేదీ 30 జనవరి 2024 న వెలుగొండ ప్రాజెక్టు పెండింగ్ పనుల పైన, నిర్వాసితుల సమస్యల పైన వేసిన ప్రశ్నలకు ముఖ్య మంత్రి నుండి సమాధానం లేదు.వెలిగొండ ప్రాజెక్టు పూర్తీ కోసం వివిధ మార్గాలలో ఆందోళన కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేస్తున్నాం.

వెలిగొండ సమస్య పైన గత నెల ఫిబ్రవరిలో మార్కాపురంలో మరియు ఎర్రగుండ పాలెంలో ధర్నాలు చేశాం.పశ్చిమ ప్రకాశం జిల్లా వాసులు 2019 ఎన్నికలలో అత్యధిక మెజార్టీ వైకాపాకు ఇస్తే నేడు పూర్తి కానీ ప్రాజెక్టును జాతికి అంకితం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.

ఈ మధ్య కుప్పంకు శ్రీశైలం నుండి నీరు అంటూ జగన్ అద్దెకు తెచ్చి ఎత్తిన గేటు ఎటు పోయింది? ఒక వైపు ప్రాజెక్టు గేట్లు ఎత్తం అని చెప్పుకునేలోపే నిర్మాణ అవినీతి లోపాల వల్ల నీరు రోడ్డు పాలు కావడం కుప్పంలో చూశాం.

జగన్మోహన్ రెడ్డి గారు వెలిగొండ ప్రాజెక్టు సంబందించి మేము చేసే సవాలుకు సమాధానం ఇవ్వడానికి సిద్దమా :

1 ) ప్రాజెక్టు నిర్వాసితులకు 1800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉందా, లేదా ? మీరు ఉంటున్న ఇంటికి స్థలం యజమానికి చేసుకున్న ఒప్పందం మేరకు అన్ని చెల్లించి కట్టరా లేక కబ్జా చేసి కట్టారా?

2 ) ప్రాజెక్టు రివిట్మెంట్ పూర్తి చేశారా ?

3) కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటరీ పనులు 60 శాతం పనులు పూర్తీ కాకుండా వెలిగొండ ఎలా జాతికి అంకితం చేయగలరు?

4 ) డిస్ట్రిబ్యూటరీ కెనాల్ మరియు అవసరమైన వంతెనలు పూర్తీ చేశామని చెప్పే దమ్ము మీకు ఉందా జగన్ గారు?

5 ) టన్నెల్ మరియు ప్రధాన డ్యామ్ మధ్య 2009 లో నిర్మించిన ఫీడర్ కెనాల్ మొత్తం మట్టితో పూడి పోయినదానికి నిర్వహణ మరియు మరమత్తులు చేయకుండా ఈ హడావుడి ఎవరిని దగా చేయడానికి జగన్ గారు ?

5) మిగులు జలాల పైన ఆధారపడి నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టు నుండి ప్రస్తుత పరిస్థితులలో అవసరమైన నీరు లభ్యం అయ్యే పరిస్థితి ఉందా? దీని పైన మీ అవగాహన ఏంటి జగన్ గారు?

6 ) నికర జలాలు కనీసం 10 టీఎంసీలు కేటాయించాలని పశ్చిమ ప్రకాశం ప్రజలు డిమాండ్ చేస్తున్నా జగన్మోహన రెడ్డి గారికి మనసు కరగడం లేదు?

ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన భాద్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, పూర్తీ కానీ వెలిగొండ ప్రాజెక్టు పూర్తీ చేసినట్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తడం అంటే నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయడం నిజమా, కాదా?

గుండ్లకమ్మ పైన గేట్లు కొట్టుకు పోతే ఏడాదిగా కనీసం మరమత్తులు చేయని జగన్ గారి ప్రభత్వం వెలిగొండ పూర్తి చేశాం అంటే నమ్మే వారు ఎవరు లేరు.

వెలిగొండ పూర్తి అయినట్లయితే సురక్షిత త్రాగు నీరు అందించడం ద్వారా కనిగిరిలో ఉన్న ఫ్లోరైడ్ సమస్య నుండి ప్రజలకు రక్షణ అనే అంశం మదిలో ఉంటే ఇలా పూర్తి కాని ప్రాజెక్టుని మోసపూరితంగా జాతికి అంకితం అంటారా.

ఈరోజు హౌస్ అరెస్ట్ అంటే పూర్తి కానీ ప్రాజెక్టు పైన ప్రశ్నలకు సమాధానం చేపోలేకనే కదా.వెలిగొండ ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తీ అయ్యే వరకు బీజేపీ పోరాడుతుంది? ఈ అంశం పైన ఇప్పటికే బీజేపీ అనేక ఆందోళన కార్యక్రమాలు చేసింది.

పశ్చిమ ప్రకాశం జిల్లా ఏర్పాటుకు అనేకసార్లు బీజేపీ డిమాండ్ చేసినా ఆ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని జగన్మోహన రెడ్డి గారు ఏ మొహం పెట్టుకొని వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం ప్రజలను మోసం చేయడానికి సిద్దం అయ్యారు?

కనిగిరి నిమ్జ్ మరియు దొనకొండ పారిశ్రామిక వాడకు కేంద్రం నుండి అనుమతులున్నా, అవసరమైన భూమి అందించని రాష్ట్ర ప్రబుత్వం పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టు నుండి నీరు ఇచ్చేస్తున్నాం అని ఎవరిని మోసం చేయడానికి జగన్ సిద్ధ పడ్డారు.

అమరావతి నుండి అనంతపురం వరకు ఎక్ష్ప్రెస్స్ వే కోసం కేంద్రప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చినా, దాని రూట్ మార్చి నమ్మి ఓట్ వేసిన ఆ ప్రాంత ప్రజలను జగన్మోహన్ రెడీ గారు నమ్మక ద్రోహం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కోసం 50 కోట్లు మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు వెనక్కి పోయింది.

కేంద్ర ప్రభుత్వం దొనకొండ వద్ద హెలికాఫ్టర్ ట్రైనింగ్ సెంటర్ మరియు నేవి నేవిగేషన్ సెంటర్ మంజూరు చేస్తే, కనీసం అవసరమైన భూమి మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యింది.

పశ్చిమ ప్రకాశం జిల్లా మార్కాపురంలో మెడికల్ కాలేజీ కోసం అనుమతి ఇవ్వడం, దోర్నాలో గిరిజనుల కోసం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తీ చేసింది.

ఒంగోలు పార్లమెంట్ పరిధిలో నేడు ప్రజలకు త్రాగు నీరు, రైతుకు సాగు నీరు లేదు మరియు యువతకు ఉపాధి లేదు, కానీ వైకాపా నాయకుల అవినీతికి అంతులేదు.

జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క జల ప్రాజెక్టు పూర్తీ కాలేదు, అభివృద్ధి ఆనవాళ్లు శూన్యం. వెలిగొండ వద్దకు బీజేపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటిస్తుంది, నిజాల నిగ్గు తేలుస్తుంది.

LEAVE A RESPONSE