అవ్వయ్యార్ అనే వృద్ధురాలు పరమశివుని_భక్తురాలు.
ఆమె భక్తికి మెచ్చి గణపతి ఆమెను సశరీరంగా కైలాసానికి తీసుకెళతాడు.
అవ్వ కడు వృద్ధురాలవడం వల్ల కాళ్లు మడచి కూర్చోలేక శంకరుడికి ముందు కాళ్లుచాపి కూర్చొంది.
అది చూసి పరమేశ్వరుని పక్కనే ఉన్న పార్వతీదేవికికేమో మనస్సు చివుక్కుమంది. అలా కూర్చోవడం అపరాధం కదా అనే భావంతో అవ్వకు ఒకసారి చెప్పి చూడమని పతిని కోరింది.
“‘అమ్మో! ఆమె పరమభక్తురాలు.
ఆమెనేమి అనకూడదు!’ అని శివుడు సూచించాడు. అయినా పరమేశ్వరి ఆ అమర్యాదను సహించలేక చెలికత్తెకు చెప్పి చూసింది.
ఆ సఖి అవ్వను సమీపించి ‘అవ్వా! కాళ్లు ఈశ్వరుని వైపునకు పెట్టకు’ అంది.
అప్పుడు ఆ వృద్ధురాలు అలాగా అమ్మా! ఈశ్వరుడు లేని చోటెక్కడోచెప్పు.
కాళ్లు అటువైపు పెట్టుకుంటాను’ అంటూ పక్కకు తిప్పుకుందట!. పరమేశ్వరుడు ఆ వైపునకు తిరిగాడు.
అటు తిప్పితే అటూ తిరిగాడు. ఎటూ
తిప్పితే అటు శంకరుడు తిరగాల్సివచ్చింది.
అలా తిరుగుతూ పరమేశ్వరుడు పార్వతీదేవి వైపు చూసి ‘నేను చెబితే విన్నావు కాదు! ఆమె నన్ను ఎలా తిప్పుతున్నదో చూడు. అందుకే నేను నోరు మెదపకు అన్నాను. నేను భక్తుల వశమేననినీకు తెలుసు కదా!’అన్నాడు.
అప్పుడు పార్వతీదేవి ‘అవ్వా! నన్ను క్షమించు’ అని ప్రార్థించింది.
అయినా
శివుడు లేని చోటు ఈవిశ్వంలో ఎక్కడైనా ఉందా ? అన్నింటా ఆయనే.!
విశ్వమంతా శివమయం.
– – శ్రీనివాసరెడ్డి