Suryaa.co.in

Political News

ఏది సత్యం.. ఏదసత్యం?

వలస పాలన నుంచి స్వయం పాలన దాకా తెలంగాణ కోసం సీఎం కేసీయార్ ఎదుర్కుంటున్న కష్టాలను, దిగమింగిన కన్నీల్లను, ప్రాణానికి ఎదురొడ్డి చేసిన త్యాగాలను, భరించిన అవమానాలను, దుర్మార్గమైన విమర్శలను తలుచుకుంటే హృదయమున్న ఎవరికైనా కన్నీరు తన్నుకరాక మానదు.

త్యాగాలతో దశాబ్దాల కాలం కరిగిపోంగ, వలస పాలనలో పరాయీకరణకు గురయ్యి, యేదీ నాది కాదు అనే నిరాశా నిస్పృహలతో రాజకీయ నిర్వీర్యతకు గురైంది తెలంగాణ. అటువంటి సంధికాలంలో ముందటికి వచ్చింది కేసీయారీజమ్’ అనే వొక రాజకీయ పంథా. అప్పటిదాకా మెయిన్ స్ట్రీం పాలిటిక్స్ లో అణచివేయబడి గుండె గొంతుకలో కొట్లాడుతున్న తెలంగాణ సామాజిక రాజకీయ సాంస్కృతిక అస్తిత్వ భావనను పెకిలించి శంఖారావం పూరించి, వేయిగొంతుల ప్రకటన చేసి రణ నినాదం వినిపించిండు కేసీయార్.

నాడు దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ మహాత్ముని బాటలో నడిచి, శాంతియుత పద్దతుల్లో తెలంగాణను నడిపించి స్వయం పాలన సాగించిండు. ఉద్యమం చేస్తూనే ఒక పక్క ఇంటి పోరు, మరో పక్క బయటి పోరును తట్టుకొని నిలబడడం సామాన్యులతో అయ్యే పనికాదు.. కాని కేసీయార్ కు సాధ్యమైంది.

ఈ తన్లాట స్వరాష్ట్రంలో కూడా వెన్నంటింది.ఆరంభంలోనే స్వయం పాలనను కూలదోయడానికి విఫల ప్రయత్నం చేసిన తెలంగాణ ద్రోహుల గుంపు తిరిగి తమ కుట్రలకు, కుతంత్రాలకు పదునుపెడుతూ.. తమ స్వార్థ రాజకీయాల కోసం ఏకమై గుంటనక్కల మాదిరి మోపైండ్రు.

ద్రోహులకు సద్దులు మోసే తెలంగాణ ఇంటి దొంగలు కేసీఆర్ ను పడగొట్టాలని గుంట నక్క పన్నాగాలను తలుచుకుంటే తెలంగాణ హృదయాలు నేటికీ తల్లడిల్లుతున్నయి.

గాలి వార్తలను సృష్టించి అమాయకపు తెలంగాణ ప్రజలను గోల్మాల్ తిప్పి అధికారం గద్దెనెక్కుదాం అని ఆత్రపడుతున్న విద్వేషవాదులకు భంగపాటు తప్పదు.

పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తెర్లు గాకుంట కాపాడుతున్న కేసీఆర్ పట్టుదలను భగ్నం చేయాలని చూస్తున్న ఈ బానిస తొత్తులకు నవంబర్ 30 నాడు తమ ఓటు తో బుద్ధి చెప్పాలని తెలంగాణ సమాజం నిశ్చయించుకున్నది.

కెసిఆర్ చేసే ప్రతిపనినీ తప్పుపడుతూ, ప్రతిదాన్నీ వ్యతిరేకిస్తూ, గుంపులు గుంపులుగా మీడియా మాధ్యమాల ద్వారా గుప్పుతున్న అబద్దాలను, అర్థ సత్యాలను పసిగట్టి తిప్పికొట్టేందుకు సిద్ధంగా వుంది తెలంగాణ.

సోషల్ మీడియా పేరుతో నడుపుతున్న గోబెల్స్ ప్రచారాన్ని తెలంగాణ సోయితో అర్థం చేసుకుంటూ యేది సత్యం ..యేది అసత్యమో తెలుసుకుంటున్నరు.

కొనసాగుతున్న ప్రగతి ప్రస్థానం మరింతగా పురోగ మించాలంటే..మరింత రాజకీయ పాలన స్థిరత్వం అనివార్యం అందుకోసం మరికొద్ది రోజుల్లో రాబోయే ఎన్నికల్లో తిరిగి బిఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటం… కేసీయార్ నే మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకుంటం…అంటున్నారు. గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే అనేది స్పష్టమైంది.

ఎటువంటి అనుమానం అక్కరలేదు. మేము రాజకీయ జ్ఞానానికి వచ్చినం .. ఓ మహాత్మా.. ఓ మహర్షీ.. మీ బాటే సత్యం, మీ మాటే నిత్యం.. మీ అడుగుజాడలలోనే నడుస్తం..’’ అంటున్నది ఇవాళ యావత్ తెలంగాణ సమాజం.

— హజారి

LEAVE A RESPONSE