Suryaa.co.in

Andhra Pradesh

అసలు అస్మదీయులెవరు? తస్మదీయులెవరు?

-ఇంకా లూప్‌లైన్‌లో 50 మంది జగన్‌రెడ్డి పోలీసు బాధితులు
– జీతాలు లేకుండా వీఆర్‌లో ఏళ్లపాటు మగ్గిన పోలీసు అధికారులు
– అందులో కమ్మవర్గానికి చెందిన వారే ఎక్కువ
– ప్రభుత్వం మారినా మారని పోస్టింగుల తీరు
– మంత్రి అచ్చెన్న అన్నయ్య కూడా ఇంకా లూప్‌లైన్‌లోనే
– రామతీర్థలో బాబుపై కేసులు పెట్టిన అధికారికి పోస్టింగ్
– బాబు కాన్వాయ్‌కు లారీలు అడ్డుపెట్టిన వారికి అందలం
– సోషల్‌మీడియాలో వచ్చిన తర్వాతనే మాతంగి అవుట్
– ఇంకా ఎన్నికలప్పటి అధికారులే కొనసాగుతున్న వైచిత్రి
– తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి

(ఎ.బాబు)

విజయవాడ: వారికి గత చంద్రబాబు సర్కారులో డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీలుగా పనిచేయడమే శాపమయింది.ఎన్నికల ముందయితే ఈసీనే కొందరిపై వేటు వేసింది. జగన్‌రెడ్డి సీఎం అయిన వెంటనే వారందరినీ వేటాడి-వెంటాడి మరీ లూప్‌లైన్‌కు పంపించారు. అసలు పోలీసు శాఖలో ఎన్ని విభాగాలు ఉంటాయో కూడా తెలియని చోటకు విసిరేశారు. కొన్ని డజన్లమందికయితే అసలు పోస్టింగులు లేక వీఆర్‌లోనే మగ్గిపోయారు. దానితో జీతాలు నిలిచిపోయాయి. ఆమాటకొస్తే.. డీజీపీ స్ధాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావుదీ అదే విషాదం.ఆయనకు ఇప్పటికీ రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, సస్షెన్షన్ నాటి జీతాలు అందలేదట. అది వేరే విషయం.

ఇక గత చంద్రబాబు సర్కారులో పనిచేసిన సీఐల విషాదమయితే చెప్పాల్సిన పని లేదు. వారికీ పోస్టింగులు లేవు. ఏళ్ల తర్వాత ఇచ్చినా అవి కూడా లూప్‌లైన్ పోస్టింగులే. వీరిలో చాలామంది, ‘జగన్‌రెడ్డి ప్రేమించే కమ్మ సామజికవర్గం’ వారు కావడమే కారణం. మరి పాలన మారింది. పాలకులు మారారు. మళ్లీ చంద్రబాబునాయుడే సీఎం అయ్యారు. ఇంకా ఎన్నికల ముందు పనిచేసిన డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ, సీఐ, ఎస్‌లే ఉన్నారు. జగన్‌రెడ్డి బాధితులు మాత్రం చకోరపక్షుల్లా పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు.

అందులో ఇప్పుడు ప్రమోషన్లు వచ్చి ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఐజీ, ఐజీ స్థాయిలో లూప్‌లైన్లలో మగ్గుతున్న వారూ ఉన్నారు. అసలు జగన్‌రెడ్డి బాధితుడైన మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుకే దిక్కులేకపోతే.. ఇక కింది స్థాయి అధికారుల గోడు పట్టించుకునేదెవరు?..అట్టుకు అట్టున్నర తినిపిస్తామన్న రెడ్‌బుక్ ఏమైంది? ఇదీ ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల వేదన.

ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ కి సన్నిహితులంటూ దాదాపు 50 మందికి పైగా డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, లను పోస్టింగ్ లు రెడ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. కొంతమంది అధికారులకు 16 నెలల పాటు అసలు పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపి ఆఫిస్ అటాచ్ పేరుతో జీతం రాకుండా చేసి వాళ్ళతో అడ్డమైన చాకిరీ చేయించారు. వీళ్లలో ఒకే సామాజిక వర్గం వారు సింహ భాగం ఉన్నారు.

కొంతమందికి ప్రాధాన్యమైన పోలీస్ ట్రెయినింగ్ కాలేజ్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కాలేజి, ఎపీ ఎస్పీ బెటాలియెన్, ఇలా అసలు పోలీస్ ఉద్యోగం లో ఇటువంటి పోస్టులు ఉంటాయని కూడా తెలియని పోస్టుల్లో కూర్చో పెట్టారు. అంటే ఈ ఐదేళ్ళ కాలంలో వాళ్ళు డీఎస్పీ లుగా పని చేసినట్లు బాహ్య ప్రపంచానికి తెలీదు.

ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. నెల రోజులు దాటింది.

రాష్ట్ర స్థాయి లోఉన్న డీఎస్పీ పోస్టుల లో ఎవరున్నారు.. పోస్టులు లేకుండా ఇబ్బండి పడ్డ వారు ఎవరు ఆనే సమీక్ష కూడా జరగలేదు. మరోపక్క ఇప్పటి వరకు వైసిపి తో అంట కాగి, టీడిపి నీ, కార్యకర్తలను , నాయకులను ఇబ్బండి పెట్టిన వారి లెక్కలు తేల్చే పరిస్థితి కనపడటం లేదు.

కనీసం రెడ్ బుక్ లో పేర్లు ఉన్న అధికారుల పై చర్యలు తీసుకోవడం లేదు. కేవలం కొంత మంది సీనియర్ ఐపీఎస్ లను పక్కన పెట్టి వదిలేశారు. సందట్లో సడేి మియా ఆన్నట్లు, కొందరు అధికారులు ప్రభుత్వ పెద్దల అండతో మంచి పోస్టింగ్ ల లో దూ రుస్తున్నారు.. ఐదేళ్లు అధికార పార్టీ తో అంట కాగిన వాళ్ళు మళ్ళీ మంచి పొస్తుల్లోకి వెళ్లేందుకు నాయకులను కాక పడుతున్నారు.

కొన్ని ఉదాహరణలు..

పులిపాక అనిల్ కుమార్ డీఎస్పీ. గ్రూప్ 1 ఆఫీసర్..
గౌతమ్ సావంగ్ దగ్గర రెండేళ్లు ఓఎస్డీ ..
తర్వాత ఆయనకు సావంగ్ విజయనగరం డీస్పీ పోస్టింగ్ ఇచ్చారు.
రామతీర్థం ఇష్యూ అపుడు బాబు మీద కేసులు పెట్టారు.

అదే సమయంలో వీసా రెడ్డి కి రాచ మర్యాదలతో రామ తీర్థం తీసుకు వచ్చా రు. బాబు కాన్వాయ్ కు లారీ లు అడ్డు పెట్టిన ఘనుడు ఆయన.

ఇపుడు సదరు అనిల్ కుమార్ నీ హోమంత్రి ఓఎస్డీ గా వేయించుకున్నారు. ఆ పోస్టు కోసం లూప్ లో ఉన్న కొందరు అధికారులు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్క లేదు.

ఇది శాంపిల్.. అచ్చెన్నాయుడు సొంత అన్న ప్రభాకర్ డీఎస్పీ గా గత 5 ఏళ్లు లూప్ లైన్ లో ఉన్నాడు.. ఇపుడు కూడా విశాఖపట్నం ఎస్బీ (లూప్‌లైన్) ) ఇచ్చారు అంట. 4 నెలల్లో ఆయన రిటైర్ అవుతున్నారు.

టీడిపి నాయకులను కొట్టి ఇబ్బందుల పాలు చేసిన మాతంగి శ్రీనివాస్ అనే సీఐ కి తుళ్ళూరు పోస్టింగ్ ఇచ్చేశారు. పార్టీ నాయకులు ఆ విషయం మీద లోకేష్ కి ఫిర్యాదు చేస్తే నాలుక కర్చుకుని, అతన్ని వెంటనే అక్కడి నుంచీ పంపేశారు.
ఇప్పటికైనా ఎవరు అస్మదీయులు, ఎవరు తస్మ దీయులు అనే అంశాన్ని సమీక్షించాల్సిన ఆవశ్యకత ఉంది.

 

LEAVE A RESPONSE