2024 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ పథకం ఎవరికి అందాలి ? ఇక్కడే పెద్ద ప్రశ్న ?
ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సెన్సెస్ ప్రకారం గృహాలు 1 కోటి 55 లక్షలు అందులో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు 1 కోటి 47 లక్షలు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే… ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు ఎన్ని కుటుంబాలు , రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకున్న వారు ఎన్ని కుటుంబాలు, ఇన్కమ్ టాక్స్ పేయర్స్ ఎన్ని కుటుంబాలు? వ్యాపారస్తులు,ధనవంతులు అత్యధిక ధనవంతులు ఎన్ని కుటుంబాలు? ఆర్థికంగా బలంగా ఉండే కుటుంబాలు ఎన్ని? వీరందరూ కలిసి సుమారుగా 50 లక్షల కుటుంబాలు అనుకుందాం. అంటే దీనిని బట్టి తెల్ల రేషన్ కార్డులు అర్హత లేని వారి దగ్గర, దొంగ కార్డులు ఉన్నవి అని అర్థమవుతుంది.
ప్రభుత్వం పేద ప్రజల ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకొని, సంక్షేమం కోసం ఆసరాగా ఉండేందుకు ఎన్నికల సమయంలో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల కొలమానం ఏమిటి?
ఏ ప్రభుత్వం దగ్గరయినా సామాన్య ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కొనే వస్తువుల మీద, ఏదో ఒక రూపేణా ప్రజలు కట్టే టాక్స్ ల మీద వచ్చే ఆదాయం తప్ప, ఇంకొకటి కాదు అనేది అందరికీ తెలిసిందే. కట్టే పన్నులలో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు, ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వఆదరణ, సహాయం నిజమైన పేదవాడికి, నిజమైన అర్హునికి అందితే ఎవరు పెద్దగా మన టాక్స్ వృధా అవుతుందని బాధపడరు.
అలా కాకుండా ఎక్సర్సైజు చేయకుండా నిజమైన పేదలను,అర్హులను గుర్తించకుండా ఎన్నికల సమయంలో చెప్పేసాము. తెల్ల రేషన్ కార్డు ఆధారంగా 1 కోటి 47 లక్షల మందికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేద్దామని ప్రభుత్వం అనుకుంటే.. అన్ని వర్గాల ప్రజలు, (అందరూ ఏదోక రూపేణా పన్ను కట్టే వారే కాబట్టి) బాధపడే అవకాశం ఉంది. మూడు సిలిండర్ల ఉచిత పథకం అర్హులతోబాటు అనర్హులకు అందిందని భాదపడేవారు చాలామంది ఉంటారు.
మొదటగా ఈ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు అర్హులకే ఉన్నాయా? లేదా? గత ప్రభుత్వంలో ఇష్ట ప్రకారం పంపిణీ చేశారా! (రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విరివిగా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారు అవే ఇప్పటికీ కొనసాగుతున్నాయి) అందరికీ కూడా ఈ రాష్ట్రంలో1 కోటి,55 లక్షల కుటుంబాలు ఏంటి ? తెల్ల రేషన్ కార్డులు 1,47 లక్షలు ఏంటి.? అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేవారే మరి దీనికి ప్రభుత్వమే పరిష్కారం కనుగొనాలి. ప్రజలు రాజకీయ పార్టీలు సహకరించాలి.
కేంద్ర ప్రభుత్వం నెలనెలా ఇస్తున్న ఉచిత బియ్యం పథకం, ఈ రాష్ట్రంలో 65 లక్షల కార్డులకు మాత్రమే ఇస్తుంది. వారి సర్వే ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు 65 లక్షలని వారి లెక్క. అసలే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మన రాష్ట్రం, ప్రభుత్వ పథకాలు అనర్హులకు కూడా అందితే ప్రజలు ప్రభుత్వాన్ని కామెంట్ చేస్తారు. దీనికి ప్రజల సహకారంతోటి రాజకీయ పార్టీల సహకారంతో, నిజమైన అర్హులకు ఏ ప్రభుత్వ పథకమైన అందాలి అనేది సామాన్య ప్రజల అభిప్రాయం. న్యాయం కూడా.
దీపావళి నుండి ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ లోపల నిజమైన అర్హుదారుల ను గుర్తించి వారికే అందజేయాలి. లేదా అంత సమయం లేకపోతే ఇంకొంత సమయం తీసుకోనైనా, అర్హుదారుల లిస్టు తయారు చేసుకోవాలి. లేకపోతే ఒకసారి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత మరల ఆపివేస్తే, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కావున ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించి.. ప్రజల ఇతర రాజకీయ పార్టీల సహకారం తీసుకుని, వాస్తవాలను వారి ముందు ఉంచి పథకం అమలు చేస్తే పన్ను కట్టే ప్రజలు సంతోషిస్తారు.