Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హత్య ఎవరు చేశారు? ఎందుకు, ఎలా, ఎప్పుడు, అనే వివరాలన్నీ జగన్ కు ముందే తెలుసు

-బాబాయి చనిపోయాడని తెలిసి కూడా మీటింగ్ కంటిన్యూ చేస్తారా?
-‘‘ఎలిబీ’’ కోసం తెలవారుజామున 4 గంటలకు జగన్ మేనిఫెస్టో మీటింగ్
-అజయ్ కల్లం, రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి అబద్ధాలు మాట్లాడటం సరైందికాదు
-అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయకుండా సీబీఐ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది?
-ముఖ్యమంత్రి శ్రీమతినికూడా సీబీఐ విచారిస్తుంది
-పదిమందికి నీతులు చెప్పే ఉమ్మారెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు?
-సీబీఐ తన ఔన్నత్యాన్ని పోగొట్టుకోకూడదు
-టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

సీఎం జగన్ కు వివేకా హత్య కేసులో అన్నీ తెలిసే బుకాయిస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ కు వివేకా హత్య కేసులో అన్నీ తెలిసే బుకాయిస్తున్నారు. వివేకా హత్య ఎవరు చేశారు? ఎందుకు, ఎలా, ఎప్పుడు, అనే వివరాలన్నీ జగన్ కు ముందే తెలుసు. సీఎంకు వివేకా హత్య గురించి అన్ని తెలిసి బహిరంగపరచకపోవడం రాజ్యంగ విరుద్ధం,
ఆరోజు సీఎంగా ఆయన చేసిన ప్రమాణానికి వ్యతిరేకం. ఇది తెలిసే ‘‘ఎలిబీ’’ కోసం తెలవారుజామున 4 గంటలకు జగన్ మేనిఫెస్టో మీటింగ్ అని, పార్టీ ముఖ్యులను పిలిచి తన నివాసంలో మీటింగ్ పెట్టారు. ఏనాడు తెల్లవారుఝామున 4 గంటలకు ఏ మీటింగ్ పెట్టని జగన్ ఆరోజు ‘ఎలిబీ’ సృష్టించుకోవడం కోసం ఒక పన్నాగం పన్నారు. కుట్ర తోనే రిటైర్డ్ ఐఏఎస్ ను, ఉమ్మారెడ్డిని,మాజీ పార్లమెంట్ సభ్యుడిని, మరో పెద్దమనిషిని మీటింగ్ కుఎన్నుకోవడం ‘ఎలిబీ’ కోసమే.

జగన్ కి మానవత్వం, స్పందించే హృదయం లేదు, ఉంటే బాబాయి చనిపోయాడని తెలిసికూడా మీటింగ్ కంటిన్యూ చేస్తారా? ఆనాడు తండ్రి చనిపోయి శవం ఇంటికి రాకముందే సీఎం పదవి కోసం సంతకాల సేకరణ చేశారు. అజయ్ కల్లం, రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి అబద్ధాలు మాట్లాడటం సరైందికాదు.. ఆయన వాస్తవాలు సీబీఐకి చెప్పాలి. జగన్ తన బాబాయి చనిపోయిన విషయం మేనిఫెస్టో సమావేశం లో తెలియజేసినప్పుడు ఆ విషయం సీబీఐకి అజయ్ కల్లం, ఉమ్మారెడ్డి తదితరులు ఎందుకు ఇంతవరకు తెలియజేయలేదు?

ఈ కేసులో పెద్ద కుట్రకోణం దాగివుంది. సీబీఐ ఆ కుట్రను ఛేదించి, అసలు సిసలైన దోషులను అరెస్టు చేయాలి. సీఎంను, ఆయన శ్రీమతిని విచారణ చేయకుండా ఈ కేసు దర్యాప్తు పూర్తికాదు. అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయకుండా సీబీఐ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? అజయ్ కల్లం, ఉమ్మారెడ్డి కూడా సీబీఐ దర్యాప్తుకు సహకరించి వాస్తవాలు తెలియజేయాలి.

జగన్ ఏమీ తెలియని నంగనాచిలాగ బుకాయించడం ఎంతవరకు సబబు? నాలుగు సంవత్సరాలకుపైగా ముఖ్యమంత్రిగా వెలగబెట్టి సాధించింది ఇదా? వివేకా హత్య సమాచారం తెలిసినా.. రహస్యంగా ఉంచడంలో మతలబేంటి? సీఎంకు వివేకా హత్య గురించి తెలిసి కూడా బహిరంగపరచకపోవడం రాజ్యంగ విరుద్ధం కాదా? 31, మే 2019న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దేవుడిసాక్షిగా నమ్ముకున్న ఏసుప్రభువు సాక్షిగా ‘‘నా నోటీసుకు వచ్చిందేదీ దాచను’’ అని ప్రమాణం చేయలేదా? ప్రమాణం చేసి కూడా దాచారు.

తెలవారుజామున 4 గంటలకు రాజకీయ మీటింగ్ పెట్టడంతోనే తెలిసిపోతోంది ఇదొక నాటకమని. ఓఎస్ డీ కృష్ణమోహన్ రెడ్డి మీటింగ్ జరుగుతున్న సమయంలో ఫోన్ లో అవినాష్ రెడ్డి మాట్లాడారు. ఆ ఫోన్ లో జగన్ మాట్లాడాలి. ఓఎస్ డీ అవినాష్ రెడ్డి ఫోన్ చేశారు. ఈ ఫోన్ లోనే జరగాల్సిన తతంగం జరిగిపోయింది. మీరు మాకు ఒప్పజెప్పిన కార్యాన్ని సంపూర్ణంగా పూర్తి చేశాం అని జగన్ కు సమాచారం అందినట్లు తెలుస్తోంది. బాబాయ్ ని చంపేశాం అని చెప్పినట్లుగానే ఆ ఫోన్ సారాంశంగా భావించొచ్చు. మేడమ్ పీఏ నవీన్ ఫోన్ వచ్చింది. మా బాబాయ్ ఇక లేరు అనగా మై అంకుల్ ఈజ్ నో మోర్ అనగానే ఎవరైనా నోరు మూసుకుంటారా? ఎలా చనిపోయారు? ఏమీ అని వివరాలు అడగరా?

జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు శవాన్ని కూడా చూడకుండా సంతకాలు తీసుకున్నారు. ఇక్కడ బాబాయ్ చనిపోతేనేమో నాన్ ఫాస్టింగ్ మీటింగ్ పెట్టి కంటిన్యూ చేశారు. జగన్ కు మానవత్వం లేదు, స్పందించే హృదయం అంతకన్నా లేదు. మరణం వార్త తెలియగానే భోరున ఏడవాల్సింది పోయి మూడవ పేజి తీయండి చర్చిద్దాం అని ఎవరైనా అంటారా? ఎలా చనిపోయారని మీటింగ్ లో ఉన్న పెద్దలు అడగరా? ఇప్పుడే బురదలో కూరకపోయారు. ఇంకా కూరుకుపోవాలని 160 స్టేట్ మెంట్ గురించి చెప్పారు.

గతంలో మంచి పేరున్న అజయ్ కల్లం ను ఏ శక్తి ఇలా మార్చిందో తెలియడంలేదు. హత్య చేసిన వ్యక్తి జగన్ కు ఫోన్ చేసి వివేకాది గుండెపోటు అని చెప్పి ఉండాలి, లేకుంటే పై అంతస్తు నుంచి కింది అంతస్తుకి వచ్చేటప్పటికి జగన్ వివేకాది గుండెపోటు అని సృష్టించుకొనైనా ఉండాలి. లేకుంటే అవినాష్ రెడ్డి అయినా చెప్పివుండాలి. వివేకానందరెడ్డి మృతి పై ఆ సమయంలో జరుగుతుండిన మేనిఫెస్టో మీటింగ్ లో చర్చించి ఉండాల్సింది. మీటింగ్ నుంచి జగన్, ఆయన భార్యను వెళ్లిపొమ్మని పంపించి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు.

జగన్ ది నిరంకుశ మనస్తత్వం. వివేకానందరెడ్డిని హత్య చేయాలన్న ప్రణాళికలోని వ్యక్తే జగన్ కు ఫోన్ చేసి ఉండివుండవచ్చు. సీఎం జగన్ కు తెలియకుండా ఈ హత్య జరగలేదు. సీబీఐ దీన్ని వదలదు. ముఖ్యమంత్రి శ్రీమతినికూడా సీబీఐ విచారిస్తుంది. ఈ కేసులో సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారు? నిజాలు ఎందుకు చెప్పడంలేదు?

నిర్దోషి అన్న వ్యక్తి ఎందుకు సీబీఐని అవాయిడ్ చేస్తున్నారు? పేదవాడికొక న్యాయం.. ఉన్నవాడికి ఒక న్యాయమా? ఎంపీకి పార్లమెంటు సమావేశాలప్పుడు బీజీ షెడ్యూల్ ఉంటుందేమోగానీ మామూలు సమయాల్లో ఏం పని ఉంటుంది? మాటి మాటికి బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తారా? అందరికీ ఒకే న్యాయం అని చెప్పాల్సిన బాధ్యత సీబీఐ పైన కూడా ఉంది. తప్పు చేసినవారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనన్న మాట సీఎం నోట ఎప్పుడూ రాదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సురేష్ చెప్పడంతో సజ్జల అతని చొక్కా విప్పించారు.

స్వేచ్ఛగా మాట్లాడే స్థితి కూడా రాష్ట్రంలో లేదు. ముఖ్యమంత్రికి తెలిసే ఇది జరిగివుంటుంది అందుకే బుకాయిస్తున్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. సీబీఐ కాన్సిపిరెన్సీ గురించి ఎంక్వైరీ చేయాలి. జగన్ కు ఇంటర్ కమ్ లో ఫోన్ ఎప్పుడొచ్చింది? పైకి ఎప్పుడు వెళ్లారు? ఎంత సేపటికి దిగొచ్చారు? దిగి వచ్చినప్పుడు ఆయన ముఖ కవళికలు ఎలా ఉన్నాయో అజయ్ కల్లం, ఉమ్మారెడ్డి చెప్పాలి. పనైపోయిందనే సంతోషం కనపడిందా? లేక బాబాయి చనిపోయాడనే బాధ వ్యక్తమైందా? అనే విషయం చెప్పాలి.

పదిమందికి నీతులు చెప్పే ఉమ్మారెడ్డి ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉన్నారు? వివరాలు సీబీఐకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు దాచారు? సామాన్యుల కంటే అన్యాయంగా వ్యవహరించారు. హుటాహుటిన బాబాయి చనిపోయిన ప్రదేశానికి వెళ్లాల్సిన జగన్ తీరిగ్గా మీటింగ్ కండక్ట్ చేయడమేంటి? ఈ ఎలిబితో ముఖ్యమంత్రి దొరికిపోయారు. సీబీఐ తన ఔన్నత్యాన్ని పోగొట్టుకోకూడదు. తల రెండు ముక్కలైతే గుండెపోటు అనడం ఏమిటి? దుర్మార్గంగా వ్యవహరించారు. నారాసుర రక్త చరిత్ర అని ఒక అభూత కల్పన చేశారని, ఇప్పటికైనా నిజం నిగ్గు తేల్చాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సీబీఐకి తెలిపారు.

LEAVE A RESPONSE