(పాలంకి సత్య)
సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలలో మనకు కనిపించేవి ఆరు. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు ఉపగ్రహమైనప్పటికీ మన పూర్వీకులు గ్రహాలలో చేర్చారు.
భూమికి బదులుగా సూర్యుడి పేరు రాసి గ్రహాలు ఏడు అనే లెక్క చెప్పారు. ఆ గ్రహాల పేర్లని ఏడు వారాలకు పెట్టారు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం.
ఇక్కడే మనకు సందేహం కలగవచ్చు. గ్రహాల వరుస వేరుగా, గ్రహాల పేరు పెట్టిన వారాల వరుస వేరుగా ఉందేమి? ప్రాచీన ఖగోళ శాస్త్రం తెలిస్తే గానీ ఈ విషయం అర్థం కాదు. రోజును ఘడియలు, విఘడియలు గాక అనేక హోరలుగా మనవారు విభజన చేశారు. రోజుకి 24 హోరలు ఆహోరనే ఇంగ్లీష్ వారు అవర్(hour) అంటారు.
వారాల పేర్లు నిర్ణయించడానికి అతి తక్కువగా ప్రయాణం చేసే శనిగ్రహాన్ని ముందుగా చెప్పారు. ఆపైన గురుగ్రహం వగైరా.
శనివారం నాడు మొదటి హోర శని గ్రహంతో ప్రారంభమవుతుంది. రెండవ హోర గురుగ్రహం, మూడవ హోర అంగారక గ్రహం. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళితే మర్నాడు మొదటి హోర రవితో ప్రారంభమవుతుంది. అందుకే శనివారం తర్వాత వారం రవి వారం లేదా ఆదివారం.
రవి వారం మొదటి హోర సూర్యుడితో లెక్కపెట్టుకుంటూ వెళితే మర్నాటి మొదటిహోర చంద్రుడితో ప్రారంభమవుతుంది. అందుకే ఆదివారం తర్వాతి వారం సోమవారం.
ఆపైన మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం వస్తాయి. ఏడు రోజులు అయ్యేసరికి మొదటి హోర మళ్ళీ శని గ్రహం అవుతుంది. ఇదే వారాల వరుసకు వివరణ.
ఓపిక ఉంటే వరుసగా హోరలు లెక్కపెట్టుకుని వారాలు ఈ విధంగా వస్తాయని స్వయంగా తెలుసుకోవచ్చు. గ్రహాల పేరున వారాలు ఏర్పడినది భారతదేశంలో.
శని గురు మంగళ సూర్య శుక్ర బుధ చంద్ర. ప్రతి 24 వది లెక్క పెట్టుకోవాలి.ప్రతి 4వది అయినా సరి పోతుంది
కానీ పాశ్చాత్యులు వారజ్ఞానం తమదేనంటారు. ఖగోళ విజ్ఞానం కూడా తమ వద్దనే పుట్టిందంటారు. సాటర్డే సండే మండే వదిలేస్తే మిగిలిన వారాలకు గ్రహాల పేర్లు లేవేమి .
శాసన ఆధారాలే కావలసిన వారికి జనమేజయ చక్రవర్తి వేయించిన శాసనంలో సోమవారం అన్న పదం ఉంది. మొదటి జత పరిచిన పోస్టులో ఉన్న సమాధానం చూడండి