• సుప్రీంకోర్టు తీర్పుతో బాబాయ్ ని చంపినవారిని కాపాడాలన్న జగన్ రెడ్డి విఫలయత్నాలు బట్టబయలు.
• బాబాయ్ గొడ్డలిపోటు కేసు విచారణలో “న్యాయం జరుగుగుతుందని ప్రచారంచేయడం కాదు, న్యాయం జరిగినట్టు కనబడాలి” అన్న అత్యున్నతన్యాయస్థానం వ్యాఖ్యలు ముమ్మాటికీ జగన్ రెడ్డికి, ఆయనప్రభుత్వానికి గొడ్డలిపెట్టులాంటివే.
• బాబాయ్ హత్యకేసులో ఆధారాలు, సాక్ష్యాలు రూపుమాపిన అవినాశ్ రెడ్డి, అతనిబృందాన్ని కాపాడుతున్న జగన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే హక్కులేదు.
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
సొంత బాబాయ్ ను హత్యచేసినవారిని కాపాడటానికి అధికారబలంతో, జగన్ రెడ్డిచేసిన విఫలయత్నాలన్నీ సుప్రీంకోర్టు తీర్పుతో బట్టబయలు అయ్యాయని, హత్యకేసులో పిటిషన్ దారులప్రాథమికహక్కుల్ని కాపాడలేని ముఖ్యమంత్రి, రాష్ట్రప్రజల హక్కులను ఏం కాపాడ తాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు.మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఉమామహేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
బాబాయ్ గొడ్డలిపోటు వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు జగన్ రెడ్డికి, ఆయనప్రభుత్వానికి గొడ్డలిపెట్టులాంటివి.“సొంతబాబాయ్ హత్యకేసు నిందితులను ఇప్పటికీ పట్టుకోలేకపోవడం ముమ్మాటికీ జగన్ రెడ్డి అసమర్థత, వైఫల్యమే వివేకాహత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీకావడం జగన్ రెడ్డికి, ఆయనప్రభుత్వానికి సిగ్గుచేటు. బాబాయ్ హత్యను జగన్ రెడ్డి తన స్వప్రయోజ నాలకోసం రాజకీయంగా వాడుకున్నాడని ఆయన సొంత కుటుంబమే చెబుతోంది. వివేకా హత్యకేసుపై తనచెల్లి షర్మిల వ్యాఖ్యలపై జగన్ ఏం సమాధానం చెబుతాడు? వివేకా మర్డర్ కేసులో జగన్ రెడ్డి పూర్తిప్రమేయం, పాత్ర జగన్ రెడ్డి కుటుంబానిదేనని తాముతొలినుంచీ చెబుతూనేఉన్నాం.
“న్యాయం జరుగుగుతుందని ప్రచారంచేయడం కాదు, న్యాయం జరిగినట్టు కనబడాలి” అన్న అత్యున్నతన్యాయస్థానం వ్యాఖ్యలు ముమ్మాటికీ జగన్ రెడ్డికి, ఆయనప్రభుత్వానికి గొడ్డలిపెట్టులాంటివే. హత్యకేసు విచారణలో సాక్ష్యాలు, ఆధారాల ధ్వంసం జరిగిందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆధారాలు రూపుమాపింది ఎవరో ముఖ్యమంత్రికి తెలియదా? తన తండ్రి హత్యకేసు విచారణలో నిందితులు అరెస్ట్ కాకుండా జగన్ రెడ్డి ప్యాలెస్ నుంచి మద్ధతు లభిస్తున్నందునే విచారణలో తీవ్రజాప్యం జరుగుతోందని వివేకా కుమార్తె వై.ఎస్.సునీత గతంలో కోర్టును ఆశ్రయించారు. కోర్టుని ఆశ్రయించిందని చెప్పి, ఆమెను, ఆమెభర్తను కూడా భయపెట్టి, దారికి తెచ్చుకోవాలని జగన్ రెడ్డి అండ్ కో ప్రయత్నించింది.
కడప ఎంపీ సీటువివాదమే వివేకాను బలిగొంది….
కడప ఎంపీ సీటువిషయంలో తలెత్తిన వివాదమే వివేకాహత్యకు కారణం. ఎంపీ సీటు తనకో, షర్మిలకో, విజయమ్మకో ఇవ్వాలని, ఇతరులకు ఇవ్వొద్దని వివేకా గతంలో గట్టిగా జగన్ రెడ్డినికోరాడు. ఎంపీ సీటు వేరేవారికి ఇస్తే ఊరుకునేదిలేదని వివేకా తెగేసిచెప్పడంవల్లే ఆయన్ని హత్యచేశారని సీబీఐకూడా తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. 2015 మార్చి 15న వివేకాహత్య జరిగితే నేటికీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్ రెడ్డి నిందితుల్ని ఎందుకు పట్టుకోలేకపోయాడు? వివేకాహత్యపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై జగన్ రెడ్డి ఏంచెబు తాడు? ఎవరైతే హత్యచేయించారో వారే ముందు వివేకా మరణించిన ప్రదేశానికి వెళ్లారు.
ఎంపీ అవినాశ్ రెడ్డి తనతండ్రి కలిసి హాస్పటల్ నుంచి కాంపౌండర్ ను పిలిచి, రక్తపుమరకలు తుడిచేయించి, గాయాలకు కుట్లువేసి, కట్లుకట్టించారని సుప్రీం అభిప్రాయ పడింది. ప్రాథమిక హక్కుల్ని పరిగణనలోకి తీసుకునే కేసువిచారణను ఇతరరాష్ట్రానికి బదిలీచేస్తున్నట్లు న్యాయస్థానం అభిప్రాయపడింది. వివేకాహత్యకేసు విచారణలో పిటిషన్ దారులకుఏపీలో ప్రాథమిక హక్కులు లేవని తేల్చింది. తనసొంతచెల్లి, తల్లి, బాబాయ్ కూతురికే ప్రాథమిక హక్కులు కల్పించలేని జగన్ రెడ్డి పాలనలో సామాన్యప్రజలకు ఉంటాయా?
అధికారంలోకి వచ్చిందిమొదలు, ప్రతిపక్షాలు, ప్రశ్నించేవారు, మీడియావారిపై దాడులు చేయడం, చంపించడమే జగన్ రెడ్డి అజెండాగా మారింది. వివేకాహత్యకేసు విచారణలో ముగ్గురుసాక్షులను ఇప్పటికే లేపేశారు. తనప్రాణాలకు రక్షణకల్పించండి మహాప్రభో అంటూ హత్యకేసులో అప్రూవర్ అయిన దస్తగిరివాపోయాడు. గతంలో పరిటాలరవిహత్యకేసు విచారణలో ఆధారాలు, సాక్షులను ధ్వంసంచేసినట్టే, వివేకాహత్య కేసులో కూడా జగన్ రెడ్డి, అతనికుటుంబం సాక్ష్యాలు, సాక్షులు లేకుండా చేయడానికి ప్రయత్నించింది.
జగన్మోహన్ రెడ్డి అండలేకుంటే అవినాశ్ రెడ్డి ఎప్పుడో జైలుకెళ్లేవాడు…
సొంత బాబాయ్ హత్యకేసులో ఆధారాలు, సాక్ష్యాలురూపుమాపిన అవినాశ్ రెడ్డి, అతనిబ్యాచ్ ను కాపాడుతున్న జగన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే హక్కులేదు. గొడ్డలిపోటుని గుండెపోటుగా ప్రజల్ని నమ్మించిన జగన్ అండ్ కో, సీబీఐ అధికారులపై కూడా బెదిరింపులకు పాల్పడి, కేసువిచారణను అడ్డుకుంది. తెలంగాణ సీబీఐకోర్టులో కొద్దిరోజుల్లోనే వివేకాహత్యకేసు విచారణ మొదలవుతుంది. విచారణలో ప్రధాన నిందితుడైన అవినాశ్ రెడ్డిని తప్పించడం ఎవరివల్లాకాదు. వివేకాహత్యకేసులో అవినాశ్ రెడ్డి పాత్రను, అతని ప్రమేయాన్ని అతనిఫోన్ సిగ్నల్స్ ఆధారంగానే సీబీఐ రూఢీ చేసింది.
జగన్మోహన్ రెడ్డి, ఇన్నాళ్లూ అవినాశ్ రెడ్డికి, అతని బృందానికి అండగాలేకుంటే, వారంతా ఎప్పుడో జైల్ ఊచలు లెక్కపెట్టేవారు. వివేకాహత్యకేసులో జగన్ రెడ్డి, అతనిప్రభుత్వమే సాక్ష్యాలు, సాక్షులను ధ్వంసంచేసిందని, సీబీఐ అధికారి రాంసింగ్ ను స్థానికపోలీస్ శాఖ కేసులతో భయపెట్టిందని డాక్టర్ వై.ఎస్. సునీత ఆధారాలతోసహా, న్యాయస్థానాన్ని ఆశ్రయించాక, ఆమెఇచ్చిన సాక్ష్యాలను పరిశీలించాకే సుప్రీంకోర్టు వివేకాహత్యకేసు విచారణను వేరేరాష్ట్రానికి బదిలీచేసింది. హత్యలుచేసిన వారిపక్షాన ముఖ్యమంత్రే నిలిస్తే, రాష్ట్రప్రజలకు ఎలాన్యాయం జరుగుతుంది?
రాజధాని అమరావతిపై సుప్రీంతీర్పు తెలుసుకోకుండానే ప్రభుత్వం, మంత్రులు శునకానందం పొందారు.
రాజధాని అమరావతిపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని అంశాలపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టులో రాజధాని అమరావతిపై వాదనలు జరిగినసమయంలో ప్రభుత్వన్యాయవాదులు తమప్రభుత్వానికి కర్నూలులో హైకోర్ట్ పెట్టడంలేదని లేదని చెప్పారు. సుప్రీంకోర్టులో రాష్ట్రం తరుపున వాదనలు వినిపించిన న్యాయవాదులు అలా ఎందుకు చెప్పారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రభుత్వ న్యాయవాదులు అలా చెబుతుంటే, ప్రభుత్వం కర్నూల్లో హైకోర్టు పెడుతున్నట్లు నాటకాలు ఆడుతూ, ప్రజలమధ్యవిద్వేషాలు రాజేస్తోంది.
హైకోర్టు పేరుతో కావాలనే కర్నూల్లో చంద్రబాబుపైకి రౌడీలు, గూండాలను ఉసిగొల్పారు
కర్నూలు వెళ్లిన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడిపైకి కావాలనే ప్రభుత్వం రౌడీలు, గూండాలను ఉసిగొల్పి విధ్వంసరాజకీయాలకు పాల్పడటానికి ప్రయత్నించింది. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటువిషయంలో, సుప్రీంలో ప్రభుత్వన్యాయవాదులు చెప్పిన సమాధానమే అందుకు నిదర్శనం. కావాలనే ప్రతిపక్షనేతపైకి అక్కడిప్రజల్ని రెచ్చగొట్టిన ప్రభుత్వం, సిగ్గులేకుండా హైకోర్టు పెట్టే ఆలోచనే తమకులేదని సుప్రీంకోర్టులో చెప్పడం ఎలాంటి నీచరాజకీయమో ఇప్పటికైనా సీమప్రజలు ఆలోచించాలి. హైకోర్టు పేరుతో సీమప్రజల్ని, విశాఖలో రాజధానిపేరుతో ఉత్తరాంధ్రప్రజల్ని ప్రభుత్వం కావాలనే రెచ్చగొడుతోందని చెప్పడానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలే నిదర్శనం. సుప్రీం కోర్టు రాజధానిపై చేసిన వ్యాఖ్యలతో వైసీపీనేతలు, మంత్రులు పూర్తివివరాలు తెలుసుకోకుండానే శునకానందం పొందారు.
సుప్రీంకోర్టు తీర్పుతాలూకా అంశాలు బయటకురాకుండానే, ప్రభుత్వన్యాయవాదుల వ్యాఖ్యలు తెలియకుండానే, జగన్ రెడ్డి అండ్ కో ప్రజల్ని రెచ్చగొట్టేలా వికృతానందానికి తెరలేపారు. రాజధాని పేరుతో విశాఖను, అక్కడిభూములు, విలువైన సంపదను జగన్ అండ్ కో దోచేశారు. ఏ2 సారథ్యంలోని భూమాఫియా ఆఖరికి వృద్ధాశ్రమాలు, సేవాసంస్థలు, కొండలు, గుట్టలు, సహజవనరుల్ని కూడావదల్లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రవ్యాప్తంగా పాలనపేరుతో దోపిడీలో ఇదేవిధమైన పంథాకొనసాగిస్తూ, రాష్ట్రాన్ని,ప్రజల్ని జగన్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా దోచుకుంటోంది” అని బొండా ఆగ్రహం వ్యక్తంచేశారు.