-
ఆవు నెయ్యి కన్నా పంది కొవ్వు విలువైనదని పోన్నవోలు సుధాకర్ వ్యాఖ్యానించటం వైసీపీ బరితెగింపుకు నిదర్శనం
-
కలియుగ దైవం అందరి తప్పులను లెక్క వేస్తున్నాడు
- బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్
అమరావతి: గుంటూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న అపచారాలపై,లడ్డు ప్రసాదంలో జంతు కళేబరాల నూనెలపై, గుడ్డు పంది మాంసాల కొవ్వు తదితర పదార్థాలతో తయారైన నకిలీ ఆవు నెయ్యి వాడకంపై ప్రపంచ వ్యాప్తంగా స్వామివారి భక్తులలో ఆందోళన, బాధ నెలకొన్న నేపద్యంలో ప్రపంచవ్యాప్తంగా భక్తులు నిరసనలు విమర్శలు తెలియజేస్తున్న సమయంలో, దేశంలో ఉన్న ప్రముఖ పీఠాధిపతులు స్పందించి జరిగిన అపరాధంపై, అన్న, లడ్డు ప్రసాదాల్లో కల్తీ వినియోగంపై జరిగిన తప్పును ఎత్తిచూపుతూ స్వామీజీలు వ్యాఖ్యానించడం జరిగిందనీ, కానీ తెలుగు రాష్ట్రాల్లో పెట్టుడు పీఠాలు పెట్టుకున్న చిన్న జీయర్ స్వామిజీ మరియు విశాఖ శారద పీఠాధిపతులు స్వరూపానంద స్వామీజీ, సాత్వామనంద స్వామీజీలు ఈ విషయం మీద ఎందుకు నోరు మెదపట్లేదని శ్రీధర్ స్వామీజీలను ప్రశ్నించారు.
ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే, కనీసం పీఠాధిపతులు స్పందించకపోవడం వారి యొక్క అధర్మ మార్గానికి సంకేతమా అని శ్రీధర్ ప్రశ్నించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల్లో కెసిఆర్, జగన్ లకు రాజగురువులుగా వ్యవహరించిన చిన్న జీయర్ స్వామి, విశాఖ స్వరూపానంద స్వామి గత ఐదేళ్లుగా ఈ నకిలీ ఆవు నెయ్యి వాడకంపై, స్వామివారికి నివేదినిచ్చే సొంత ప్రసాదాల్లో కూడా ఈ నకిలీ ఆవు నెయ్యిని వాడటం పై గత జగన్ ప్రభుత్వం, టిటిడి పాలకమండలి భక్తులకు “శాఖాహార లడ్డు” అందించకుండా “మాంసాహార లడ్డు” అందించిన విధానంపై రాజ గురువులు కూడా తక్షణమే ఖండించాలని, లేనిపక్షంలో రాజకీయ నాయకులతో పాటు స్వామీజీలు కూడా భక్తుల, భగవంతుని ఆగ్రహానికి గురికాక తప్పదని శ్రీధర్ హెచ్చరించారు.
అలానే మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ ఈ అంశంపై డిల్లో నేడు మాట్లాడుతూ పంది కొవ్వు ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు అని, అది బంగారంతో సమానమని, ఆవు నెయ్యి రాగి,ఇత్తడి వంటి వస్తువు అని బంగారంలో రాగి కలిపితే తప్పేమి ఉందని చెప్పటాన్ని భగవంతుని పట్ల వైసీపీ నాయకులకు వున్న అహంకారానికి నిదర్శనం అని శ్రీధర్ దుయ్యబట్టారు, పంది కొవ్వును బంగారంతోను,ఆవు నెయ్యిని ఇత్తడితోనూ పోల్చడం, పంది కొవ్వు ప్రపంచ మార్కెట్లో 400రూ/-ల నుండి 1400రూ/- ల వరకు ధర పలుకుతుందని, ఆవుల కన్నా అందుకు చాలా శ్రేష్టమని ఉన్న వ్యాఖ్యానించడం జగన్మోహన్ రెడ్డి బరితెగింపుకు నిదర్శనమని, వెంకటేశ్వర స్వామిని ఎంతటి స్థాయికి దిగజారుస్తున్నారో ఇనుకు ఇదే ఉదాహరణ అని శ్రీధర్ మండిపడ్డారు, ఒక రకంగా పొన్నావోలు సుధాకర్ ఆవు నెయ్యిలో పంది కొవ్వుని కలిపి కల్తీ చేసిన మాట వాస్తవమేనని పరోక్షంగా అంగీకరించినట్లేనని శ్రీధర్ తెలిపారు.
ఇట్లా గతంలో తిరుమల శ్రీవారి పింకు డైమండ్ ను చంద్రబాబు నాయుడు కాజేసి ఆయన ఇంట్లో దాచిపెట్టుకొని తర్వాత జెనీవాలో వేలం వేసినట్లుగా ఎన్నికల ముందు ఐవైఆర్ కృష్ణారావు, రమణ దీక్షితులు, జివియల్ నరసింహారావు తదితరులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం కోసం విపరీతంగా ప్రచారం తప్పుడు, అబద్దాల ఆరోపణలు చేశారని, మరిఇప్పుడు ఒకపక్క ప్రపంచవ్యాప్తంగా స్వామివారి లడ్డు ప్రసాదం పై భక్తులలో అలజడి జరుగుతుంటే, తిరుమలలో జరుగుతున్న అపచారాలపై వీరు కనీసం నోరు కూడా ఎందుకు మెదపలేకపోతున్నారని శ్రీధర్ ప్రశ్నించారు.
జగన్ అంటే భయమా లేక ప్యాకేజీలు మిస్ అవుతాయని ఆందోళన అని ప్రశ్నించారు. మేధావులు అనే ముసుగు కప్పుకొని ప్రజల్ని మోసం చేయటం వీరికి పరిపాటిగా మారిందని ఇటువంటి వారిని ఆ కలియుగ దైవం తప్పకుండా శిక్షలు విధిస్తాడని,ఇప్పటికైనా సరే చేసిన తప్పుడు ఆరోపణలు,పనులకు వీరు పశ్చాత్తాపం పడి స్వామివారికి నిలువు దోపిడీ ఇచ్చినా కానీ దైవం పట్ల వీరు చేసిన పాపకృత్యాలకు అంతిమ ముగింపును కఠిన శిక్ష ద్వారా కలియుగ దైవమే నిర్ణయిస్తారని శ్రీధర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డమాను ప్రసాదు, వంగవీటి చైతన్య చిలుమూరు ఫణి, ఎండపల్లి శబరి తదితరులు పాల్గొన్నారు.