– డబ్బుకు లోకం దాసోహ’మనీ’!
రేషన్ బదులు
డబ్బులివ్వడం..
ఇది పధకమా..
సూత్రమా..మంత్రమా..కుతంత్రమా..ఇది ఎవరికి ప్రయోజనకరం.ఏ బుర్రలో ఇలాంటి ఆలోచనలు ఎందుకు పుడుతున్నాయి ఇవన్నీ ఈ రాష్ట్రాన్ని..రాష్ట్ర ప్రజల్ని ఏ తీరం వైపు తీసుకుపోతున్నాయి.
ఇరవై,ముఫ్ఫై రోజులు కుటుంబానికి ఆధారంగా, భరోసాగా ఉండాల్సిన బియ్యం బదులు అయిదారు వందల రూపాయలు ఇచ్చేస్తే, రెండు మూడు రోజుల్లో ఖతం.. మందు కొట్టేస్తే సాయంత్రానికే ఫినిష్..అలా సర్కారు సొమ్ము(?)మళ్లీ ఖజానాకే.. మొత్తానికి ఆ సొమ్ము తాగడంతోనో,అనారోగ్యానికిమందులనే కారణంతోనో, బేకారుగానో పోగొట్టుకుంటారు.
కిలోపన్నెండు నుండి పదిహేననుకున్నా,ప్రజలొప్పుకునేసరికి అదిపన్నెండు రూపాయలే అవుతుంది. డీలరు నుండి వినియోగదారుడి చేతిలోకి వచ్చే పాటికి కిలో,పదిరూపాయల వరకే వస్తుంది.కనీసం ఇంట్లో బియ్యమంటూ ఉండడమే ఎంతైనా శుభం..
బజారులో బియ్యమంటూ కొనడానికిపోతే కిలోముఫ్పైరూపాయల కనిష్టధరకు ఏం కొనగలరు. బియ్యం బదులు డబ్బు ఇస్తే కుటుంబాలకు కొత్త సమస్యలు పంచినట్టే..ఉన్న సమస్యలు పెంచినట్టే..
మద్యపానం పెరిగి కుటుంబాలు ఘోరంగా నాశనం అవుతాయి. భార్య పిల్లల ఇబ్బందులు పెరుగుతాయి. ఇంట్లోబియ్యంఉండటమేకుటుంబసబ్యులకు క్షేమం.
మినిమం గ్యారంటీ.. నెలతకు నెలంతా ఆధారంగా ఉండే బియ్యాన్ని వద్దంటే డబ్బని
ఆశ చూపుతూ బదులుగా ప్రభుత్వం ఇచ్చే అయిదారు వందల డబ్బులు బిలోపావర్టీలైన్
వారికి కష్టాలు బదులుగా ఇవ్వటమే.
ఇప్పటికే నగదు రూపంలో ఇస్తున్న అమ్మ ఒడి తదితర పథకాల ప్రయోజనం
ఎలా పక్కదారి పట్టేసిందో స్పష్టంగా చూస్తున్నాం.ఆ మొత్తాలు ఇతర అవసరాలకు..ఒక్కోసారి మద్యం వంటి ఇతర అవసరాలకు మళ్లిపోతూ విద్యకు చేరడం లేదు.ఫలితంగా కొన్ని కుటుంబాల్లో పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి.ఇప్పుడు నగదు పథకం ఇంకొకటి సర్కారు బట్టలోంచి వచ్చింది.ఇలా డబ్బుకు లోకం దాసోహం తీరున మార్చేసి.. ఏం ఆశిస్తున్నారో..ఏం సాధించబోతున్నారో..!!??
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286