మద్యం అమ్మకాలు, తయారీ, సరఫరా, డిస్టలరీస్ పై జగన్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించగలడా?
దాదాపు 100 కు పైగా మద్యం బ్రాండ్లను ఎలా అనుమతి ఇచ్చిందో జగన్ రెడ్డి,వాసుదేవరెడ్డి సమాధానం చేప్పాలి
మద్యం టెండర్ల లోచంద్రబాబు కొల్లు రవీంద్ర లు తప్పు చేశారు అనడం సిగ్గుచేటు
చిత్తూరు కోపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పి షణ్ముగం
చిత్తూరు: రూపాయి అవినీతి నిరూపించకుండా స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు.నిన్నటికి నిన్న చంద్రబాబుకు బెయిల్ తధ్యమని తెలియటంతో మద్యం టెండరు లో అవినీతి జరిగిందని కేసు పెట్టారు.పైగా, రాజకీయ సభల్లో పాల్గొనకూడదని, ప్రెస్ మీట్స్ పెట్టకూడదంటూ హైకోర్ట్ లో పిటిషన్లు వేసి జగన్ రెడ్డి తన పిరికి తనాన్ని చాటుకొన్నాడు.కేసులు పెట్టడం తప్ప నాలుగున్నర సంవత్సరాలుగా చంద్రబాబు రూపాయి అవినీతిని చేసాడని నిరూపించలేక పోయారు.
జీవోలిచ్చిన అజేయ కల్లాం “రెడ్డి ని జగన్ రెడ్డి ఎందుకు విచారణ చేయలేదు? జగన్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూ, 24,000 కోట్లు దిగమింగిన జగన్ రెడ్డి మద్యం కుంభకోణాన్ని ప్రజలకు వివరిస్తున్నందుకే తిరిగి మద్యం కుంభకోణాన్ని చంద్రబాబు పై పెట్టి అణచివేసే కుట్ర చేస్తున్నారు.
అడ్డగోలుగా కేసులు, తప్పుడు ఆరోపణలు చేయ్యటం తప్ప వైసీపీ ప్రభుత్వం చేయ్యగలిగింది ఏమి లేదు. బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి అణచి వెయ్యటం తప్ప జగన్ రెడ్డి సాధించిందేమీ లేదు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, తయారీ, సరఫరా, డిస్టలరీస్ పై జగన్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించగలడా?
ప్రివిలైజ్ ఫీజు తాగించారనే ఆరోపణలు పచ్చి అబద్ధం… ప్రివిలైజ్ ఫీజు కు సంబంధించి, మద్యం వ్యాపారుల విజ్ఞపి తో నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.1800 కోట్లు ఆదాయం వచ్చింది . అదే తప్పు అయితే మరి నేడు వైసీపీ ప్రభుత్వం దాదాపు 100 కు పైగా మద్యం బ్రాండ్లను ఎలా అనుమతి ఇచ్చిందో జగన్ రెడ్డి,వాసుదేవరెడ్డి సమాధానం చేప్పాలి.
వైసీపీ ప్రభుత్వం చేప్పిన పి.ఎం.కే,విశాఖ డిస్టిలరీలు విషయంలో గత ప్రభుత్వం పక్షపాతతో వ్యవహరిస్తే అవే డిస్టలరీలు ఇప్పటి ప్రభుత్వ పెద్దల ఆదీనంలో ఎలా కొనసాగుతున్నాయి? జగన్ రెడ్డి తన దోపిడీ కోసం తీసుకువచ్చిన నూతన మద్యం విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎటువంటి లాభం రాక పోయిన, తాడేపల్లి ప్యాలేస్ కు మాత్రం వేల కోట్లు చేరాయి. నాలుగేళ్లుగా కల్తీ మద్యం అమ్మకాలతో లక్ష కోట్లు దిగమింగిన జగన్ రెడ్డి..మద్యం టెండర్ల లోచంద్రబాబు తప్పు చేసాడనడం సిగ్గుచేటు.