Suryaa.co.in

Andhra Pradesh

సంఘీ, అంబుజా, మై హోమ్ కంపెనీ భూములను ఎందుకు పరిశీలించలేదు?

– అన్ని పార్టీల నాయకులు జగన్మోహన్ రెడ్డికి భూములు అమ్మారు
– బ్యాంకు లోన్ లేకుండా కంపెనీలు కట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు
– సరస్వతి పవర్ ప్రాజెక్టుకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి
– డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ సరస్వతి భూముల్లో హడావిడి
– మెడికల్ కాలేజీ ఎందుకు ఆగిపోయిందో పవన్.. చంద్రబాబును ప్రశ్నించాలి
– మెడికల్ కాలేజీని పవన్ కళ్యాణ్ పరిశీలిస్తే బాగుండేది
– మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి

పల్నాడు జిల్లా: జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోనే కాదు వ్యాపారంలో కూడా సక్సెస్ మ్యానే. జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాకముందే సరస్వతి భూములు కొనుగోలు చేశారు. పల్నాడు జిల్లాలో మారుమూల ప్రాంతం జగన్మోహన్ రెడ్డి భూములు కొన్నారు.

జగన్మోహన్ రెడ్డి భూములు కొన్న సమయంలో పల్నాడు ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలుసు. భూములు కొనుగోలు చేసేటప్పుడు పోలీసులు కూడా ప్రాంతంలోకి వెళ్లలేని పరిస్థితి.ఇక్కడ కంపెనీ పెట్టి ఉపాధి కల్పించాలన్న భావంతో అప్పట్లో భూములు కొనుగోలు చేశారు.

ఎకరానికి రెండు మూడు రేటు పెంచి మరీ భూములు కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి భూములు కొనుగోలు చేసేటప్పుడు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. అన్ని పార్టీల నాయకులు జగన్మోహన్ రెడ్డికి భూములు అమ్మారు. కంపెనీ నిర్మాణానికి ఎందుకు జరగలేదు అందరికీ తెలుసు.

కాంగ్రెస్ టిడిపి కోర్టుల్లో కేసులు వేసి అక్రమ కేసులు పెట్టి బ్యాంకులో లోన్ ఇవ్వకుండా చేశాయి. బ్యాంకు లోన్ లేకుండా కంపెనీలు కట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు సరస్వతి పవర్ ప్రాజెక్టుకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. పల్నాడులో సంఘీ, అంబుజా, మై హోమ్ కంపెనీలకు భూములు ఇచ్చి 40 ఏళ్లు అయింది. ఆ భూములను పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లి పరిశీలించలేదు?

నిన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పై చేసిన విమర్శలు తో ప్రతిష్ట దెబ్బతిందని అందరూ అనుకుంటున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ సరస్వతి భూముల్లోకి వెళ్లి హడావిడి చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాల విఫలం అయిపోయింది. సూపర్ సిక్స్ ఎక్కడ పోయిందో తెలియదు. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి హంగామాలు చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పల్నాడులో ఏర్పాటుచేసిన మెడికల్ కాలేజీ ఎందుకు ఆగిపోయిందో పవన్ కళ్యాణ్ చంద్రబాబును ప్రశ్నించాలి. పిడుగురాళ్ల ఆగిపోయిన మెడికల్ కాలేజీని పవన్ కళ్యాణ్ పరిశీలిస్తే బాగుండేది.

LEAVE A RESPONSE