– కేఎల్ఐ నీళ్ల విడుదల సందర్భంగా కాంగ్రెస్ నేతల ఆరోపణలను ఖండించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: కృష్ణా నదిలో ప్రవాహం మొదలై 40 రోజులు గడుస్తున్నా కేఎల్ఐ మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు ? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేయకుండా ఏడాదిన్నరగా ఎందుకు పడావు పెట్టారు ? మోటార్లను ఆపకుండా కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నీటితో నింపాలి.
పాలమూరు పనులు పూర్తి చేసి నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లను నింపాలి. ఉద్దేశపూర్వకంగా పాలమూరు ఎత్తిపోతల పనులు చేపట్టడం లేదు. కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా పాలమూరు ఎత్తిపోతల పనుల వ్యయం పెరిగి పోతున్నది.
బీఆర్ఎస్ పార్టీ నిందలు మోపుతుందని కాంగ్రెస్ మంత్రి చెప్పడం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో, మళ్లీ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడుతున్నాడు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతారు.