Suryaa.co.in

Features

కమ్యూనిస్టులకు భారతదేశంపై ద్వేషం ఎందుకు ?

– దేశాన్ని ఎందుకు ముక్కలు చేయాలనుకుంటున్నారు?

ఇలాంటి కమ్యూనిస్టుల చరిత్ర తెలియకుండా వారితో కేసీఆర్ జత కట్టడం ఏమిటి?దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాంగ్రెస్, కమ్యూనిస్టులు మన పాఠ్య పుస్తకాల్లో ఏ ఒక్క దేశభక్తి సంఘటనలు, జాతీయ విప్లవ వీరుల కథలు గాని లేకుండా జాగ్రత్త పడ్డారు.ఈ ఇద్దరూ దేశాన్ని పంచుకున్నారు.పదవులు కాంగ్రెస్ కు..చరిత్ర రచన,పాఠ్యపుస్తకాల యోజన, సాహిత్య అకాడమీలు కమ్యూనిస్టుల కు దక్కింది.

కాంగ్రెస్ పదవుల పిచ్చి తో దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టారు. ఆంగ్లేయులు వ్రాసిన చరిత్రను, చట్టాలను యథావిధిగా కొనసాగించారు. ఆంగ్లేయుల పాత్రను కమ్యూనిస్టులు కొనసాగించారు.కమ్యూనిస్టులు రొమిల్లా థాపర్ , ఆర్ సి మజుందార్ వంటి చరిత్రకారులు మన దేశ ప్రజలను ఇంకా బానిసత్వం లో ఉంచడానికి చరిత్రను తప్పుగా రూపొందించారు. అలాగే మెకాలే విద్యా విధానం వల్ల మన చరిత్ర తుంగలో తొక్కబడింది. మన పాఠ్య పుస్తకాల్లో ఏ ఒక్క దేశభక్తి సంఘటనలు కాని, జాతీయ విప్లవ వీరుల కథలు గాని లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఇద్దరు చరిత్ర కారుల మార్గం లో కొందరు మీడియా ఎడిటర్లు మసి పూసి మారేడుకాయ చేస్తున్నారు.

ఎందుకంటే ఈ ఎడిటర్లు కమ్యూనిస్టుల మానసపుత్రులు. వీళ్ళు మాత్రమే కాదు… ఇంకా ఎందరో వీళ్ళ శిష్యులు, సమకాలీకులు, దేశ చరిత్ర ను భారతీయ సంస్కృతి లో భాగం కాదన్నట్లు తాము ఆడింది ఆటగా పాడింది పాటగా, ప్రభుత్వం లోని కొన్ని సంస్థలను , యూనివర్సిటీలను, విద్యాసంస్థలను, విద్యా వంతులను, గ్రూప్ కోచింగ్ కేంద్రాలను,విద్యార్థులను, సామాన్య ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.కొన్ని దేశభక్తి ని కలిగించే ముఖ్యమైన విషయాలు నేటి యువతరానికి చెప్పకుండా కావాలని దాచి ఉంచుతున్నారు.

1.నేతాజి సుభాష్ చంద్రబోస్ ని వాళ్ళు హిట్లరు బూట్లు నాకే కుక్క అని గతం లో తిట్టిన వారు..ఆయన సాధించిన గొప్ప విషయాల గురించి చెప్పరు.( బెంగాల్లో పుట్టిన సుభాష్,స్వామి వివేకానంద పేరు అక్కడి ప్రజలకు చెప్పకుండా 40 సంవత్సరాల పాటు దేశ ద్రోహులు కమ్యూనిస్టు పాలకులు దాచి ఉంచారు. రామ క్రిష్ణ మిషన్ సన్యాసులను గ్రామాల్లో కి వెళితే చిత్రహింస పెట్టారు).
2. 1857 స్వాతంత్ర్య యుద్ధం వీళ్ళ దృష్టిలో సిపాయిల తిరుగుబాటు.ఝాన్సిలక్ష్మి, తాంతియా తోపే గురించి చెప్పరు. వీళ్ళను ఒప్పుకోరు. ఈ చరిత్రను అబద్ధాలు చేసి చెబుతారు.
3.దేశం, దేశభక్తి, భరతమాత అంటేనే వీళ్ళకు ఒళ్ళుమంట. వీళ్ళ కమ్యూనిస్టుల డిక్షనరీ లో ఈ కాన్సెప్ట్ కి అర్థాలు లేవు.

4.అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రకటన వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చింది. ఒక్క ప్రశంసా వాక్యం వీళ్ళ నోట్లొ వినలేదు. ప్రధాని మోడి దేశ విదేశాల్లో ప్రజలను కలిపి ఉంచడానికి, లక్షలాది భారతీయులతో ‘భారత్ మాతా కి జై ‘ అనిపిస్తుంటే , ఒక్క వ్యాసం,స్టేట్ మెంట్ గాని, డిబేట్ గాని పాజిటివ్ గా ఉండదు..ఒకరిద్దరు పార్ల మెంట్ సభ్యులు ఉద్వేగంగా మాట్లాడితే, రోజుల తరబడి మోడీని తిడుతూ వార్తలు ప్రచురిస్తారు. మోడీ ప్రభుత్వం 99 శాతం సరిగ్గా పని చేస్తలేదని మీరు భావిస్తే, కనీసం 1 శాతం చేసిన మంచి పనైనా సమర్థిస్తు వ్రాసే, చెప్పే ధైర్యం ఈ పత్రికలకు, మేధావులకు లేదు. పాపం రోహిత్ అయినా బహిరంగంగా కాషాయం చూస్తేనే,హిందూ చిహ్నాం కనపడితే చాలు కసి,కక్షతో చింపేస్తాను అని అన్నాడు. ఈ మేధావులు మాత్రం మనస్సుల్లో ఈ ద్వేషాన్ని పెట్టుకుని, విద్యార్థులు ,ప్రజలను హిందూ మతం పైన దాడి చేసే తీవ్రవాదులుగా మారుస్తున్నారు.

5.డైరెక్ట్ గా కమ్యూనిస్టులమని చెప్పక, రక రకాల బ్యానర్లతో ప్రత్యక్షమై ప్రజా సేవకులుగా అవతారమెత్తే వీళ్ళు, వీళ్ళ ప్రధాన లక్ష్యం హిందుత్వాన్ని,భారతీయ సంస్కృతిని చులకన చేసి ప్రచారం చేయడమే. హిందువులను, హిందూ సంస్థలను అవహేళన చేయడం, మోడి ని లక్ష్యంగా ఎంచుకుని చిన్న చిన్న విషయాలను,పైగా దేశానికి పనికొచ్చే విషయాలను ఏదో అయిపోతున్నట్లు భూతద్దం లో చూపించి, ప్రజలను గందరగోళ పరచడమే వీరి ఉద్దేశ్యం.(ఉదాహరణకు ఆవు మాంసం పై, ఘర్ వాపసీ పై , దాద్రీ సంఘటనల పై, యూనివర్సిటీల్లో బహిరంగ ముద్దులు,బీఫ్ వంటలు, దళిత ముసుగులు, నోట్ల రద్దు, జీ.ఎస్.టీ, కాశ్మీర్ అంశం, నేడు పౌరసత్వ చట్ట సవరణ మొదలైన విషయాలపై వ్యాసాలు, చర్చలు, సభలు, సంపాదకీయాలు వ్రాస్తారు,చేస్తారు)

6.పేరుకు వీరు పెద్దమనుషులు, మేధావులుగా కనపడినా కూడా హిందు వ్యతిరేక గ్రూప్ లో చేరి, నక్సలైట్ తీవ్రవాదులు చేసే అమానుష హత్యాకాండ పై ఒక్క పల్లెత్తు మాట అనరు. అమాయక గిరిజనులు, దళితులు, ప్రజలు, పోలీసులు మొదలైనవారు అమానుషంగా నక్సలైట్ల చేతిలో చచ్చిపోతే, ఒక్క కన్నీటి చుక్క కాదు కదా. సానుభూతి వాక్యం వీళ్ళ చరిత్ర లో ఒక్కటీ కనిపించదు. నక్సలైట్లు చస్తే మాత్రం పేజీలకు పేజీలు నింపి పౌరహక్కులు భంగం అయినట్లు గోల గోల చేస్తారు.

7. ఆర్యులు ఈ దేశం వారు కాదని, బయట నుండి వచ్చారని దొంగ మాటలు ప్రచురించి అబద్ధాలు వ్రాస్తారు. ( డా.అంబేద్కర్ స్వయంగా ఋగ్వేదం చదివి ‘ఆర్యులు బయటి నుండి వచ్చారనేది ‘ అబద్ధమని నొక్కి చెపారు. పైగా ఆర్య అనే పదం జాతి శబ్దం కాదని, గుణ వాచకమని కూడా అంబేద్కర్ చెప్పారు) అయినా సరే మన దేశంలో ముఖ్యమైన సంస్థల్లో తిష్ట వేసుకుని పోయిన వీరు అబద్ధాలు చెబు తునే వున్నారు.

8. ముఖ్యమైన పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియా లో ఉన్నారు. ( నక్సలైట్లను రాజ్యంగ బద్ధంగా నిషేధించడంతో ఫోర్త్ ఎస్టేట్ అయిన పత్రికల్లో చొరబడ్డారు) భావ వ్యక్తీకరణ పేరుతో, పత్రికా స్వేచ్చ పేరుతో దేశ సంస్కృతి పై, హిందువులపై దాడి చేస్తూ, ప్రధాని మోడి పై బురద చల్లే పనికి శ్రీకారం చుట్టారు. వీళ్ళు ఏది రాసినా చెల్లుతుంది.

9. జర్నలిజం అంటేనే ధార్మిక విషయాల జోలికి పోకుండా, మతాన్ని, ముఖ్యంగా హిందూ మతాన్ని, దేవుళ్లను, పండుగలను చులకన చేసి వ్రాయటం, కార్టూన్స్ ప్రచురించటం ఒకరిద్దరు స్వాములు చేసిన తప్పుకు సన్యాసి త్యాగ జీవిత పాత్రనే వెక్కిరించటం, భగవద్గీతను అవహేళను చేయటం, ఆయుత చండీ యాగాన్ని విమర్శించటం ఇలా హిందూ మతంపై గురిపెట్టడమే నిజమైన, అసలైన జర్నలిజం గా తీర్చి దిద్దిన గొప్ప మేధావులు వీరు.

10.తెలుగు భాష వేరు, తెలంగాణ భాష వేరు గా తెలివి ప్రదర్శిస్తూ ఉండటం. ముస్లింల ఉర్దూ ని కౌగిలించుకుంటాం కాని తెలుగు భాషను ని మాత్రం ముట్టుకోం అనే ద్వేషాన్ని వెల్లగక్కడం. (పాకిస్తాన్ లోని పక్తున్ భాష,పంజాబ్ భాష,సింధీ భాష, బెలుచి భాష మాట్లాడే వారే ఎక్కువ. ఉర్దూ తక్కువ. అలాగే ఉర్దు కాదని బంగ్లాదేశ్ వాళ్ళు ప్రత్యేక దేశం కోరుకున్నరు. కాని ఉర్దూ ని మాత్ర దూరం పెట్టారు). తెలుగు భాష, సంస్కృతం కంటే ఉర్దూ అంటే మహా ఇష్టం. ఈ కమ్యూనిస్టులకు ఉర్దూ పై ప్రేమ కాదు. హిందువులను దెబ్బ తీయాలంటే ఈ భాష మాట్లాడే ముస్లిములను, హిందువులపై దువ్వాలి కదా. అందుకే ఈ ఎత్తుగడ.

11. మతోన్మాది వికారుద్దీన్ చనిపోతే, అతని తండ్రిని, రోహిత్ చచ్చిపోతే అతని తల్లిని తమ గుప్పిట్లో పెట్టుకుని రాజకీయాలు చేయటం, వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య.
12. ఈ దేశ వారసత్వ సంపద మనకు గర్వకారణ. కాని పైన పేర్కొన్న వారు ఎవరు కూడా మన త్యాగ మూర్తులను, దేశభక్తులను, జాతీయ నాయకులను నమ్మరు. మావో,లెనిన్,మార్క్స్,కాస్ట్రో,చెగువేరా,స్టాలిన్ వీళ్ళకు ఆదర్శమూర్తులు. యాకుబ్ మేమెన్,అఫ్జల్ గురు, కాశ్మీర్ తీవ్ర వాదులు వీళ్ళ దృష్టిలో విప్లవ వీరులు..దేశ మొక్కటే కాదు..కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థ పట్ల కూడా నమ్మకం లేని ఈ సో కాల్డ్ మేధావులు సొల్లు చెప్తూ ఉంటారు.

కమ్మీ రాష్ట్రాల హిందూ ప్రజలు బానిసలుగా, ఎవరికీ చెప్పుకోలేక, కుమిలిపోతూ ,తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళ మాట కాదనలేక, బ్రతుకుతున్నారు. రజాకర్ల శారీరిక అత్యాచారాల తర్వాత, ఇప్పుడు వివిధ ముసుగులు వేసుకున్న ఈ వామపక్ష మేధావుల అత్యాచారాలు మానసికంగా, బుద్ధి పరంగా అంతులేకుండా కొనసాగుతునే వున్నాయి.

ఇవన్నీ అబద్ధమైతే గతం లోని వీళ్ళ వ్యాసాలు చదవండి. ఇప్పుడైనా డైరెక్ట్ గా కనపడ్డ చోట ఈ మేధావులను అడగండి. వివేకనందుడు, భరతమాత, భారతీయ సంస్కృతి, నక్సలైట్ల హత్యా కాండ, భారతీయ కుటుంబ వ్యవస్థ ల గురించి ,భారతీయ వైవాహిక వ్యవస్థ, హిందూ ధర్మం విశేషత, హిందు సమాజం లో మహిళ పాత్ర ల గురించి , కాశ్మీర్ భారత దేశం లో అంతర్భాగమా కాదా అని అడగండి. అయితే మౌనం, లేకుంటే వ్యంగ్యం. లేదా ఘోరమైన వ్యాఖ్యలు తప్ప మరేమి వినం.

ఇప్పుడు ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశం. ఇన్నాళ్లూ ఒక ఎత్తు . ఇప్పుడు ఒక ఎత్తు. 2019 సార్వత్రిక ఎన్నికలలో మోడీ ప్రభుత్వానికి అఖండ మెజారిటీ తెచ్చి పెట్టడం లో కీలక పాత్ర పోషించింది యువత అని కొన్ని సర్వేల వల్ల తెలిసింది. నిజా నిజాలు తెలుసుకునే పరిపక్వత, విచక్షణ నేటి యువతలో చాలావరకూ పెరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయంగా చెప్పుకోవాలి, గర్వపడాలి కూడా.

అబద్ధాలు, అసత్యాలతో ఎంతో కాలం ప్రజలను మభ్యపెట్టలేరని గుర్తించాలి. నెగెటివిటితో ప్రజలను వంచించలేరని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే విద్యావంతులైన యువకులు, దేశ భక్తులు వీళ్ళు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. నిజమైన చరిత్ర, యువకులను గొప్ప త్యాగమూర్తులు గా తీర్చి దిద్దే భారతీయ విద్య, బానిస మనస్తత్వాన్ని వదలి భారతీయ సంస్కృతి పట్ల అధ్యయనం చేసి, ప్రజలు ఒక గొప్ప దేశంగా మలుచుకునే రోజు ఇంకా ఎంతో దూరం లేదు.

( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు

LEAVE A RESPONSE