– సినీ పరిశ్రమ ఆదాయం కొట్టేయడానికే జగన్మోహన్ రెడ్డి దానిపై కన్నేశాడు
• జీవోనెం 35తో జగన్మోహన్ రెడ్డి చిత్రపరిశ్రమకు బుల్లెట్ దింపాడు
• సినిమాహాళ్లు మూయించే క్రమంలో ముఖ్యమంత్రి వేలాదికుటుంబాలను రోడ్డునపడేస్తున్నాడు
• చెత్తసలహాదారులు, చెత్తనిర్ణయాలతో ముఖ్యమంత్రి అంతిమంగా రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టాడు
– మాజీ మంత్రి కే.ఎస్.జవహర్
ముఖ్యమంత్రి అయినతొలిరోజుల్లో ఎలాఉన్నాడో, ఇప్పుడుకూడా జగన్మోహన్ రెడ్డి అలానే ఉన్నాడని, ప్రజలు, వ్యవస్థలనుదృష్టిలో పెట్టుకొని పనిచేయకుండా, తనకుఏది అనిపిస్తే అదే చేస్తున్నాడని, ఆక్రమంలోనే ఇప్పుడు సినీరంగానికి బుల్లెట్ దింపుతున్నాడని, టీడీపీ సీని యర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ ఎద్దేవాచేశారు. గురువారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
జీవోనెం 35ద్వారా సినిమారంగాన్ని, చిత్రపరిశ్రమను బలితీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు. సినిమాటిక్కెట్ల ధరలు తగ్గిస్తున్నానంటూ, అంతిమంగా చిత్రపరిశ్రమను నాశనంచేయడానికే కంకణం కట్టుకున్నాడు. కాదేదీ తనఆదాయానికి అనర్హమైనది అన్న ముఖ్యమంత్రి తీరుతో లక్షలాదిమంది రోడ్డునపడే పరిస్థితివచ్చింది. అసలుసినిమా పరిశ్రమకు, ఈ ప్రభుత్వానికి సంబంధంఏమిటి? సినిమాథియేటర్లు ఏమైనా ఈ ముఖ్యమంత్రి నిర్మించాడా… చిత్రనిర్మాణంచేపట్టేవారికి ఏమైనారాయితీలు ఇస్తున్నారా? ప్రేక్షకులకు ఈ ముఖ్యమంత్రి ఏమైనా డబ్బులిస్తున్నాడా?
సినిమా షూటింగులకు అనుకూలమైన, అనువైన సానుకూల వాతావరణాన్ని కూడా ఈప్రభుత్వం రాష్ట్రంలో కల్పించలేకపోయింది. జీవోనెం 35ద్వారా శ్లాబులవిధానం తీసుకొచ్చిన ప్రభుత్వం, దాదాపు 20ఏళ్లనుంచి ఉన్న రేట్లను తగ్గిస్తున్నామంటూ, చిత్రపరిశ్రమను నిర్మూలించడానికి కంకణం కట్టుకుంది. సినిమా టిక్కెట్
రేట్లనుఎలాగైతే శ్లాబులవిధానంతో తగ్గించాలని ఈముఖ్యమంత్రి చెబుతున్నాడో, అలానే తన భారతి సిమెంట్ తోపాటు, తనపార్టీవారు, తనఅవినీతిలో భాగస్వాములైన వారి సిమెంట్, ఐరన్ కంపెనీలకు కూడా శ్లాబులవిధానాన్ని అప్లైచేసి, సిమెంట్, ఇనుము ధరలు తగ్గించగలడా అని ప్రశ్నిస్తున్నాం.
ముఖ్యమంత్రి ఇష్టమొచ్చినట్లు విద్యుత్ ఛార్జీలుపెంచుతుంటే, సినిమాథియేటర్ల నిర్వాహాకులు కాస్తోకూస్తో ధరలుపెంచకూడదా? ముఖ్యమంత్రి ముందుతానుపెంచినధరలను తగ్గించేఆలోచనలు ఎందుకు చేయడంలేదు. చెత్తసలహాదారులను పక్కనపెట్టుకున్న ముఖ్య మంత్రి పరిపాలనలో, రాజధాని విషయంలో, సంక్షేమంలో తీవ్రసంక్షోభాన్ని తీసుకొచ్చాడు. చెత్తసలహాదారులను పక్కనపెట్టుకొని, చెత్తనిర్ణయాలతో రాష్ట్రాన్ని సంక్షోభం దిశగా తీసుకెళుతున్నాడు.
సలహాదారులు ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే సలహా ఒక్కటైనా ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నాం. సినిమాహాళ్ల నిర్వహణకు ఎంత భారమవుతుంది…వాటిపై ఆధారపడి ఎంతమంది బతుకుతున్నారనే కనీసఆలోచన చేయకుండా ముఖ్యమంత్రి, అధికారులుచేతిలో ఉన్నారుకదా అనివారిని సినిమాహాళ్ల పైకి ఉసిగొల్పుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రతీకారంతో రగిలిపోతూ రాష్ట్రాన్నే బలిచేయడానికి సిద్ధమయ్యాడు. సినిమాహాళ్లు అంటే ముఖ్యమంత్రి అనుకుంటున్నట్లు థియేటర్ యజమానో, దర్శకుడో, నిర్మాతో కాదనే వాస్త వాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకుఆలోచించడు? ఒకసినిమా హాల్ నిర్వహణకు ఎంత ఖర్చ వుతుంది… ప్రభుత్వం తీసుకొచ్చిన శ్లాబ్ విధానం ఎలాఉంది అనే ఆలోచన ప్రభుత్వం చేయకపోవడం బాధాకరం.
సినీనటుడు నాగార్జున, చిరంజీవిలను ఇంటికి పిలిచి భోజనం పెట్టినవ్యక్తి, ఇప్పుడు సినీరంగాన్ని నిర్వీర్యంచేయడానికి చేస్తున్న ప్రయత్నాలను వారిద్దరూ ఎందుకు ఖండించడంలేదు? సినిమావాళ్లు దోపిడీచేస్తున్నారని ముఖ్యమంత్రి అంటున్నాడు. …. మరి ఆయన చేసే వ్యాపారాలలో దోపిడీ చేయడం లేదా? సినిమారంగం ఆదాయాన్నికొల్లగొ ట్టడానికే ముఖ్యమంత్రి దానిపైకన్నేశాడు. సినీరంగాన్ని కాపాడుకోవడానికి చిత్రపరిశ్రమకు చెందినఅన్నివిభాగాలవారు ఏకతాటిపైకి రావాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి తన పిచ్చినిర్ణయాలకు స్వస్తిపలికి, చిత్రపరిశ్రమ మనుగడసాగించేలా ఆలోచన చేయాలి.